Priyamani : ఆయన అమెరికాలో ఉన్నారు, అందుకే - ఎట్టకేలకు స్పందించిన ప్రియమణి
ప్రియమణి, ఆమె భర్త వేర్వేరుగా ఉంటున్నారని... ఇద్దరూ గొడవ పడ్డారని వచ్చిన పుకార్లపై ప్రియమణి స్పందించారు.
ప్రియమణి (Priyamani) అలియాస్ ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్, ఆమె భర్త ముస్తఫా రాజ్ (Mustafa Raj) వేర్వేరుగా ఉంటున్నారా? ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా? త్వరలో విడిపోనున్నారా? - ఇటీవల పలు పుకార్లు షికారు చేశాయి. వాటికి ప్రియమణి చెక్ పెట్టారు. పుకార్లు వచ్చినప్పుడు అనవసరం స్పందించి మంట పెట్టడం ఎందుకని మౌనంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పుకార్లలో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.
ఆయన అమెరికాలో ఉన్నారు! అందుకే...
ప్రియమణి వ్యక్తిగత జీవితం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు మొదలు అయ్యాయని పుకార్లు షికార్లు చేశాయి. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారనేది ఆ రూమర్స్ సారాంశం. వాటిని పిచ్చి పుకారుగా ప్రియమణి కొట్టిపారేశారు. త్వరలో కనుమరుగు అవుతుందన్నారు.
దీపావళి వేడుకలో భర్త ఎందుకు లేరు?
దీపావళిని ప్రియమణి ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంది. అందులో ముస్తఫా రాజ్ లేరు. ఎందుకు? అనేది ప్రియమణి వివరించారు. ''ఆయన అమెరికాలో ఉన్నారు. అందుకే, ఫ్యామిలీ ఫోటోల్లో కనిపించలేదు'' అని ఆమె తెలిపారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో కూడా ముస్తఫాను మిస్ అవుతున్నట్లు ప్రియమణి పేర్కొన్నారు.
ముస్తఫాతో ప్రియమణి వివాహమై ఐదేళ్లు!
Priyamani Marriage Date : ప్రియమణి వివాహమై ఐదేళ్లు అయ్యింది. ఆగస్టు 23, 2017లో ముస్తఫా రాజ్‌తో ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో వేరు పడిన తర్వాత ప్రియమణిని పెళ్లాడారు. ఇంకో విషయం... ఆయన ముస్లిం. ప్రియమణి అయ్యంగార్స్ అమ్మాయి. మతం వీళ్లిద్దరి ప్రేమకు, పెళ్ళికి అడ్డు కాలేదు. ముస్లింను పెళ్లి చేసుకున్నందుకు కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ... ప్రియమణి ఎప్పుడూ ఆలోచించినది లేదు. భర్తపై తనకు ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో చాటుకున్నారు.
Also Read : 'రామ్ సేతు' రివ్యూ : అక్షయ్ కుమార్‌కు శ్రీరాముడు విజయాన్ని అందించాడా? సత్యదేవ్ ఎలా చేశారు?
View this post on Instagram
మొదటి భార్యతో ప్రియమణి భర్తకు గొడవ?
ప్రియమణి భర్తకు మొదటి భార్యతో గొడవలు జరుగుతున్నాయని, లీగల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయని సమాచారం. ఆ గొడవ వల్ల ప్రియమణి జీవితంలో కూడా సమస్య వచ్చినట్లు గుసగుసలు వినిపించాయి. ఇప్పుడు ప్రియమణి క్లారిటీ ఇవ్వడంతో అటువంటిది ఏమీ లేదని స్పష్టం అయ్యింది.
సీబీఐ అధికారిగా ప్రియమణి!
Priyamani Plays CBI Officer Role In Dr 56 : సినిమాలకు వస్తే... ప్రియమణి చాలా బిజీ బిజీ. ప్రస్తుతం 'డాక్టర్ 56' అనే సినిమాలో సీబీఐ అధికారిగా ప్రధాన పాత్ర చేస్తున్నారు. అదొక మెడికల్ థ్రిల్లర్. అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో ఓ పాత్ర చేస్తున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న 'జవాన్'లోనూ ఓ పాత్ర చేస్తున్నారు.
విలన్ లేదంటే కామెడీ!
ప్రియమణి తన కెరీర్‌లో చాలా చిత్రాలు ఉన్నాయి. హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఉంది. కథానాయికగా కమర్షియల్ సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్ చేశారు. మరి, ఆమెకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అంటే... "ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చేయాలని ఉంది. అలాగే, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ కూడా చేయాలని ఉంది. ఈ రెండూ నేను ఇప్పటి వరకూ చేయలేదు" అని ఆ మధ్య ప్రియమణి తెలిపారు.