Adipurush Poster Copied : 'ఆదిపురుష్' పోస్టర్ కాపీనా? - సిగ్గుచేటు అంటోన్న యానిమేషన్ స్టూడియో
'ఆదిపురుష్' టీజర్ డిజప్పాయింట్ చేసిందంటూ ప్రభాస్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ఆడియన్స్ పోస్టులు చేస్తున్నారు. టీజర్ మాత్రమే కాదు... ఇప్పుడు పోస్టర్ కూడా వివాదంలో చిక్కుకుంది.
'ఆదిపురుష్' (Adipurush) చిత్ర బృందాన్ని వరుస విమర్శలు వెంటాడుతున్నాయి. ఆల్రెడీ టీజర్‌పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పుడు పోస్టర్ కూడా ట్రోల్స్ బారిన పడింది. అది కాపీ పోస్టర్ అంటూ ఓ నెటిజఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టును షేర్ చేసిన వానర సేన యానిమేషన్ స్టూడియో... 'సిగ్గు చేటు' అని పేర్కొంది. అసలు, ఏమిటీ కాపీ గొడవ? అనే వివరాల్లోకి వెళితే...
శివుడి పోస్టర్ స్ఫూర్తితో...
'ఆదిపురుష్' ఫస్ట్ లుక్?
'ఆదిపురుష్'లో ప్రభాస్ ఫస్ట్ లుక్ చూశారా? ఒక చేత్తో విల్లును పట్టుకుని, మరొక చేతిలో బాణంతో కనిపించారు. ఆ పోస్టర్ తాము క్రియేట్ చేసిన శివుడి పోస్టర్ కాపీ అని వానర సేన అనే యానిమేషన్ స్టూడియో ఆరోపిస్తోంది. ''నిర్మాతలు కనీసం ఒరిజినల్ క్రియేటర్స్‌కు క్రెడిట్ ఇవ్వాల్సింది'' అని పేర్కొంది. 'సిగ్గు చేటు' అని వ్యాఖ్యానించింది. ఇదంతా ఒక స్టూడెంట్ చేసిన పోస్టుతో మొదలైంది. ఆ తర్వాత చాలా మంది విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు.
'ఆదిపురుష్' పోస్టర్‌ను, వానర సేన క్రియేట్ చేసిన శివుడి పోస్టర్‌ను పక్క పక్కన ఒకే ఫోటోలో డిజైన్ చేసిన ఓ నెటిజన్ ''శివుడి స్టిల్ నుంచి 'ఆదిపురుష్' మేకర్స్ స్ఫూర్తి పొందినట్లు ఉన్నారు'' అని పేర్కొన్నారు. మరొకరు ''స్ఫూర్తి కాదు, కాపీ పేస్ట్ చేశారు'' దాని కింద మరొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ''ఆదిపురుష్' టీజర్‌లో కంటే 'బాహుబలి'లో ప్రభాస్ శ్రీరాముడిలా కనిపించారు. రాజమౌళి దర్శకత్వంలో అయితే ప్రభాస్ పర్ఫెక్ట్‌గా ఉంటారు'' అని కామెంట్ చేశారు.
వానర సేన స్టూడియోస్‌పైన కొందరు విమర్శలు చేస్తున్నారు. ఒరిజినల్ క్రియేటర్స్ వారు కాదని పేర్కొంటున్నారు. అదీ సంగతి!
టీజర్‌పై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ మీద 'ఆదిపురుష్' దర్శకుడు ఓం రౌత్ రియాక్ట్ అయ్యారు. కార్టూన్ ఛానళ్లలో వచ్చే సీరియల్స్‌లో గ్రాఫిక్స్ బావుంటాయని, స్టార్ హీరో ప్రభాస్ ఇచ్చిన అవకాశాన్ని ఆయన సరిగా ఉపయోగించుకోలేదని కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో ఓం రౌత్ ''మీమ్స్, ట్రోల్స్ నన్ను సర్‌ప్రైజ్ చేయలేదు. అయితే... తొలుత ఆ విమర్శలు చూసి కొంత ధైర్యం కోల్పోయిన మాట వాస్తవమే. అయితే... బిగ్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ కోసం మేం సినిమా తీశాం. ప్రేక్షకుల ఆనందం కోసం సినిమా టీజర్ యూట్యూబ్‌లో విడుదల చేశాం. మొబైల్ ఫోనులో టీజర్ చూస్తే కొంత భిన్నంగా ఉంటుంది. థియేటర్లకు వస్తున్న ప్రేక్షకులు మాత్రమే కాదు... మారుమూల గ్రామాల ప్రజలను సైతం థియేటర్లకు రప్పించడానికి సినిమా తీశాం'' అని సమాధానం ఇచ్చారు. త్రీడీలో సినిమా చూస్తే బావుంటుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
Also Read : Godfather Box Office : 'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?
'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.
Also Read : RRR For Oscars : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది!
View this post on Instagram