Prabhas-Maruthi film: బాయ్‌కాట్ మారుతీ, ఆయనతో సినిమా వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్!
మారుతితో ప్రభాస్ సినిమా రేపే పూజా కార్యక్రమాలు జరుగబోతున్నట్లు సమాచారం.
![Prabhas-Maruthi film: బాయ్‌కాట్ మారుతీ, ఆయనతో సినిమా వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్! Prabhas-Maruthi’s film to be launched tomorrow? Prabhas-Maruthi film: బాయ్‌కాట్ మారుతీ, ఆయనతో సినిమా వద్దంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోలింగ్ - మహేష్ బాబు ఫ్యాన్స్ సపోర్ట్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/24/f1843e3cbfd13e66ff46fb6315e8409b1661334924835205_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని మారుతి స్వయంగా చెప్పారు. తక్కువ రోజుల్లో ఈ సినిమా చేయాలనుకుంటున్నారు. మారుతి స్టైల్ లో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రేపే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను మొదలుపెట్టొద్దని కోరుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్.
దానికి కారణం మారుతి అనే చెప్పాలి. ఈ మధ్యకాలంలో మారుతి నుంచి వచ్చిన ఒక్క సినిమా కూడా సరిగ్గా ఆడలేదు. భారీ అంచనాల మధ్య విడుదలైన 'పక్కా కమర్షియల్' సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ తో సినిమా కరెక్ట్ కాదనేది అభిమానుల అభిప్రాయం. ఈ క్రమంలో మారుతిని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయొద్దంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు.
ఫ్యాన్స్ ఎంత ట్రోల్ చేసినా.. ఈ కాంబోలో సినిమా రావడం పక్కా అంటున్నారు. మొదట డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన తప్పుకోవడంతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడానికి ఒప్పుకుంది. మరి ఈ సినిమాతో మారుతి తన టాలెంట్ నిరూపించుకొని.. అందరి నోళ్లు మూయిస్తారేమో చూడాలి.
Mentally Be Prepared Rebels 🌝#Prabhas - Maruthi Project Formal Launch Tmrw pic.twitter.com/7gS1wFc5TC
— Roaring REBELS (@RoaringRebels_) August 24, 2022
#Prabhas Fans 🙂💔 pic.twitter.com/mr7sbA9idz
— Venu Prabhas ™ (@TheVenuPrabhas) August 24, 2022
Ilantappude gunde ni raayi cheskovali🥲
— Prabhas DOMAIN (@Prabhas_Domain) August 24, 2022
Lets hope for the best💥💪#Prabhas pic.twitter.com/FWYrKQObAT
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు మారుతి. తన మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నారు. దీనికొక ఉదాహరణ కూడా చెప్పారు. 'మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ మరొకటి వండకూడదు' అంటూ చెప్పుకొచ్చారు. మారుతి మాటలను బట్టి ప్రభాస్ తో తన మార్క్ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసే ఛాన్స్ ఉంది.
కథ ప్రకారం.. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారట. మెయిన్ హీరోయిన్ గా అనుష్కను తీసుకున్నట్లు సమాచారం. ఆమె ఈ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. అదే నిజమైతే మరోసారి తెరపై ప్రభాస్-అనుష్కలను చూసే ఛాన్స్ వస్తుంది. రెండు, మూడు షెడ్యూల్స్ లో సినిమాను పూర్తి చేస్తారట. ఈ సినిమాతో పాటు ప్రభాస్ లిస్ట్ లో 'ప్రాజెక్ట్ K', 'సలార్', 'స్పిరిట్' వంటి సినిమాలు ఉన్నాయి. మరో రెండు, మూడేళ్లలో ఈ సినిమాలన్నీ పూర్తి చేయనున్నారు ప్రభాస్.
Rebels on fire 🔥🔥🔥 now twitter thanks for your support @urstrulyMahesh fans ❤️❤️#BoycottMaruthiFromTFI pic.twitter.com/7oQOSCaVrB
— TREND'𝐑𝐄𝐁𝐄𝐋'𝐋𝐈𝐍𝐆 (@REBELRoarStart) August 24, 2022
#BoycottMaruthiFromTFI
— 🕊 (@Dookudu_Fan) August 24, 2022
Superstar Rebelstar fans unity.. 🔥😎
MB -PB fans Twitter pic.twitter.com/Kx3efxOnH3
Mb,Pb Fans Today 😀
— NagulMeera Arya (@nagulmeera_arya) August 24, 2022
Era Lucha @DirectorMaruthi#BoycottMaruthiFromTFI pic.twitter.com/b2joMi3GNc
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)