Prabhas Marathi Movie : ఇప్పుడు మారుతి సెట్స్‌కు ప్రభాస్ - క్రిస్మస్ ముందు వరకూ!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్. ఆయన బర్త్‌డే గిఫ్ట్ రెడీ అయ్యింది. కొత్త లుక్‌లో హ్యాండ్సమ్ హంక్ సందడి చేయనున్నారు. అసలు వివరాల్లోకి వెళితే...
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఓ షెడ్యూల్ కంప్లీట్ చేశారు కూడా. ట్విస్ట్ ఏంటంటే... ఫస్ట్ షెడ్యూల్‌లో ప్రభాస్ లేరు. మిగతా ఆర్టిస్టుల మీద సీన్స్ తీశారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
డిసెంబర్ 8 నుంచి రెండో షెడ్యూల్!
Prabhas Marathi Movie Second Schedule : డిసెంబర్ 8 నుంచి ప్రభాస్, మారుతి సినిమా రెండో షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్‌లో హీరో జాయిన్ అవుతారని సమాచారం. క్రిస్మస్ ముందు వరకు కీ సీన్స్ తీయాలని మారుతి ప్లాన్ చేశారట.
హారర్ థ్రిల్లర్ జానర్‌లో కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. 'బాహుబలి', 'సాహో', ఇప్పుడు చేస్తున్న 'సలార్' సినిమాలతో పోలిస్తే... ప్రభాస్ రోల్ చాలా వైవిధ్యంగా ఉంటుందని తెలిసింది. మారుతి స్టైల్ ఆఫ్ కామెడీతో ప్రేక్షకులను ప్రభాస్ నవ్వించనున్నారని తెలిసింది.
ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్లు!
ప్రభాస్, మారుతి సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. ఓ కథానాయికగా నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మరో కథానాయికగా మాళవికా మోహనన్ (Malavika Mohanan) ను ఎప్పుడో ఎంపిక చేశారు. మూడో కథానాయికను కూడా ఈ మధ్య కన్ఫర్మ్ చేశారు.
రాజ్ తరుణ్ 'లవర్' సినిమాలో కథానాయికగా నటించిన రిద్ధీ కుమార్ (Riddhi Kumar) గుర్తు ఉన్నారా? ఈ సినిమాలో ఆవిడ ఛాన్స్ అనుకున్నారు. ప్రభాస్ లాస్ట్ సినిమా 'రాధే శ్యామ్'లో ఆవిడ ఓ చిన్న రోల్ చేశారు. ఇప్పుడు ఏకంగా మూడో హీరోయిన్ ఛాన్స్ అంటే పెద్ద అవకాశమే. ఇంతకు ముందు హిందీ సినిమా 'సలామ్ వెంకీ'లో ఆవిడ నటించారు.
వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేయాలని మారుతి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'రాజు డీలక్స్' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. ఆ విషయం కూడా ఆదివారం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?
మారుతి సినిమా కాకుండా ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు భారీ సినిమాలు ఉన్నాయి. అందులో 'ఆదిపురుష్' సినిమా ఒకటి. తొలుత వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. సినిమా వీఎఫ్ఎక్స్ బాలేదని టాక్ రావడంతో మళ్ళీ రీవర్క్ చేయాలని డిసైడ్ అయ్యారు. దాంతో వాయిదా వేశారు.
మారుతి సినిమా, 'ఆదిపురుష్' కాకుండా 'కెజియఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న 'సలార్' ఒకటి... 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ కె' ఒకటి... ప్రభాస్ చేతిలో ఉన్నాయి. అవి పూర్తి అయిన తర్వాత 'స్పిరిట్' సెట్స్ మీదకు వెళుతుంది. 'స్పిరిట్' సినిమాకు 'అర్జున్ రెడ్డి' ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకుడు. అది కూడా పాన్ ఇండియా సినిమా.