Kalki 2898 AD Release Date: ప్రభాస్ 'కల్కి' విడుదలకు మెగా సెంటిమెంట్ - చిరు క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే
Prabhas Kalki 2989 AD release date locked: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న 'కల్కి 2989 ఏడీ' విడుదల తేదీ ఖరారు చేశారని తెలిసింది.
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ 'కల్కి 2989 ఏడీ' విడుదల తేదీ (Kalki 2898 AD movie release date) ఖరారు చేశారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి క్లాసిక్ ఫిల్మ్ రిలీజ్ రోజే ఆ సినిమా థియేటర్లలోకి రానుందని సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళితే...
మే 9న ప్రభాస్ 'కల్కి' విడుదల
మే 9, 2024లో 'కల్కి' సినిమాను విడుదల చేయడానికి నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ సన్నాహాలు చేస్తోందని ఫిల్మ్ నగర్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఆ రోజే ఎందుకు? స్పెషాలిటీ ఏమిటి? అంటే... చిరంజీవి, శ్రీదేవి జంటగా వైజయంతి మూవీస్ ప్రొడ్యూస్ చేసిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' ఆ రోజే విడుదల అయ్యింది.
మే 9కి, 'కల్కి' సినిమాకు మరొక అనుబంధం ఏమిటంటే... దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయన దర్శకత్వం వహించిన సావిత్రి బయోపిక్ 'మహానటి' విడుదలైనది కూడా ఆ రోజే. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్ ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. దర్శక, నిర్మాతలకు బాగా కలిసి వచ్చిన రోజు కావడంతో మే 9న 'కల్కి'ని కూడా విడుదల చేయాలని డిసైడ్ అయ్యారని తెలిసింది.
Also Read: 'గుంటూరు కారం' దెబ్బకు ప్రభాస్ 'సలార్' రికార్డ్ గల్లంతు... మమ మహేష్ మాస్
𝐏𝐑𝐎𝐉𝐄𝐂𝐓-𝐊 is now #Kalki2898AD 💥
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 20, 2023
Here's a small glimpse into our world: https://t.co/3vkH1VpZgP#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD
'మహానటి' తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'కల్కి 2989 ఏడీ'. ఈ చిత్రాన్ని రూ. 400 కోట్ల నిర్మాణ వ్యయంతో తెరకెక్కిస్తున్నట్లు టాలీవుడ్ టాక్. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే... ప్రభాస్ 'సలార్' డిసెంబర్ 23న థియేటర్లలోకి వచ్చింది. ఆ సినిమా విడుదల తేదీ వెల్లడించిన సమయంలో సంక్రాంతికి విడుదల కాదని ప్రేక్షకులకు సైతం అర్థమైంది. వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: 'గుంటూరు కారం' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఓవర్సీస్ రిపోర్ట్
'కల్కి' సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకోన్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రభాస్, దీపిక జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. తెలుగులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సరసన 'లోఫర్'... హిందీలో 'ఎంఎస్ ధోని', 'బాఘీ 2', 'భారత్', 'ఏక్ విలన్ రిటర్న్స్' సినిమాలు చేసిన దిశా పటానీ కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది సెకండ్ హీరోయిన్ రోల్ అని టాక్.
భారతీయ చిత్ర పరిశ్రమలో లెజెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 ఏడీ' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నారని సమాచారం. అయితే... ఆ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా వెల్లడించలేదు.