News
News
X

Saalar: 'సలార్' సెట్స్ లో ప్రభాస్ - బ్యాక్ టు షూటింగ్!

ప్రభాస్ 'సలార్' సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు.

FOLLOW US: 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న యాక్షన్ ఎంటర్‏టైనర్ 'సలార్'(Salaar). ఈ చిత్రానికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth neel) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన.. శ్రుతి హాసన్ హీరోయిన్‏గా నటిస్తోంది. 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. 

ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టారు. అదే సమయంలో ప్రభాస్ పెదనాన్న, నటుడు కృష్ణంరాజు మరణించారు. ఆయన మరణం ప్రభాస్ ని ఎంతగానో బాధిస్తుంది. కొంతకాలంపాటు ఆయన షూటింగ్ కి హాజరయ్యే పరిస్థితి లేదు. దీంతో మేకర్స్ షూటింగ్ వాయిదా వేసుకోవాలేమోనని ఆలోచిస్తున్నారు. కానీ ఈ షెడ్యూల్ కోసం నిర్మాతలు బాగా ఖర్చు పెట్టారు. 

Prabhas back in action begins Saalar shooting: ఒకటి కాదు, రెండు కాదు.. రామోజీ ఫిల్మ్ సిటీలో మొత్తం 12 సెట్లు వేశారు. ప్రతీ సెట్ లోనూ రెండు, మూడు రోజులు మాత్రం షూటింగ్ చేస్తారట. కానీ సెట్ లు వేయక తప్పలేదు. షూటింగ్ జరిపినా.. జరపకపోయినా సెట్స్ లకు రోజుల లెక్కన డబ్బు చెల్లిస్తూనే ఉండాలి. షూటింగ్ ఆలస్యమైతే యాక్టర్స్ డేట్స్ కూడా క్లాష్ అవుతాయి. ఈ విషయం ప్రభాస్ కి కూడా తెలుసు. అందుకే ఈరోజు నుంచి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఆయన ఎంత బాధలో ఉన్నా.. నిర్మాతలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో 'సలార్' సెట్స్ పైకి వెళ్లారు. 

ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్:

కథ ప్రకారం.. ఈ సినిమాకి ఇంటర్వెల్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ చాలా కీలకం. ఈ సన్నివేశాలు సినిమాకి హైలైట్ అయ్యేలా డిజైన్ చేయాలనుకున్నారు. ఇప్పటికే ఇంటర్వెల్ సీన్స్ కి సంబంధించిన షూటింగ్ ను నిర్వహించారు. అయితే ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదని మరోసారి రీషూట్ చేశారట. 'సలార్' విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఫిక్స్ అయ్యాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాలో ప్రభాస్ రగ్డ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాయి.

ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించనున్నారు. సెప్టెంబర్ 28, 2023లో సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించగా.. భువన గౌడ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ సహా పలు భాషల్లో రిలీజ్ కానుంది. రూ.150 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలంగాణలోని బొగ్గు గనుల్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది.

ఈ సినిమాతో పాటు ప్రభాస్ మరిన్ని సినిమాలు ఒప్పుకున్నారు. ఇప్పటికే 'ఆదిపురుష్' సినిమాను పూర్తి చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారు. మరోపక్క నాగ్ అశ్విన్ డైరెక్ట్ డైరెక్ట్ చేస్తోన్న 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు. వీటితో పాటు మారుతి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయ్యారు. రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.    

Published at : 22 Sep 2022 05:50 PM (IST) Tags: prashanth neel Salaar Salaar Movie Prabhas

సంబంధిత కథనాలు

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Ori Devuda: 'వైఫ్ లో ఫ్రెండ్ ని చూడొచ్చు, కానీ ఫ్రెండే వైఫ్ గా వస్తే' - 'ఓరి దేవుడా' ట్రైలర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Bigg Boss 6 Telugu: 'గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు' - గీతూపై బాలాదిత్య ఫైర్!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Khushboo: హాస్పిటల్ లో ఖుష్బూ - ఫ్యాన్స్ ఆందోళన!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

టాప్ స్టోరీస్

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

Hyderabad Metro Rail : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్, రాత్రి 11 గంటల వరకు సేవలు పొడిగింపు

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకి ఫిర్యాదు చేసిన వైఎస్ షర్మిల