Prabhas Adipurush Court Case : ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ - హీరోతో పాటు 'ఆదిపురుష్' యూనిట్‌కు నోటీసులు
'ఆదిపురుష్' చిత్ర బృందానికి కొత్త చిక్కులు ఎదురయ్యాయి. టీజర్ విడుదలైన తర్వాత వస్తున్న ట్రోల్స్, మీమ్స్ పక్కన పెడితే... ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి.
Delhi High Court Shock To Prabhas : పాన్ ఇండియా హీరో ప్రభాస్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు 'ఆదిపురుష్' (Adipurush) చిత్ర బృందానికి కూడా ఇది పెద్ద షాక్ అని చెప్పాలి. సినిమా టీజర్ విడుదలైన తర్వాత నుంచి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో కార్టూన్ సినిమా తీశారని విమర్శలు చేస్తున్నారు. మీమ్స్, ట్రోల్స్ పక్కన పెడితే... ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి నోటీసులు వచ్చాయి. ఎందుకు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...
Adipurush Lands In Trouble : పురాణ ఇతిహాస గ్రంధమైన రామాయణం ఆధారంగా 'ఆదిపురుష్' రూపొందుతోంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. రాముని పాత్రలో ప్రభాస్, రావణ బ్రహ్మగా లంకాధిపతి పాత్రలో సైఫ్ అలీ ఖాన్, సీతగా కృతి సనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. టీజర్‌లో వాళ్ళను చూపించిన విధానంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సినిమాను రూపొందిస్తున్నారని భక్తులు మండిపడ్డారు. అందులో కొందరు రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.
ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బ తీసేలా 'ఆదిపురుష్'లో సన్నివేశాలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతినిధి మాళవికా అవినాష్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం టీజర్ విడుదలైన తర్వాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని బ్రాహ్మణ సంఘాలు నిరసన తెలిపాయి. అయోధ్యలోని పూజారి సినిమాపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ప్రమోద్ పాండే అనే న్యాయవాది కోర్టులో కేసు వేశారు.
'ఆదిపురుష్' బృందానికి ఢిల్లీ కోర్టు నోటీసులు
'ఆదిపురుష్' చిత్రబృందం హిందువుల మనోభావాలను దెబ్బ తీసిందని, ఆ చిత్ర బృందంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్ మీద సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అనంతరం ప్రభాస్ సహా యూనిట్ సభ్యులకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో సినిమాపై స్టే విధించాలని కోరడం గమనార్హం.
Also Read : Adipurush: ట్రోల్స్ ఎఫెక్ట్ - వీఎఫ్ఎక్స్ కంటెంట్ పై 'ఆదిపురుష్' టీమ్ రీవర్క్!
'ఆదిపురుష్' టీజర్ విడుదలైన తర్వాత వస్తున్న విమర్శలపై దర్శకుడు ఓం రౌత్ ఇప్పటికే స్పందించారు. తాము ఏ విధమైన తప్పూ చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఈతరం ప్రేక్షకులకు, యువతకు రామాయణం, రాముడు ప్రబోధించిన నీతి చేరాలంటే ఈ విధంగా చెప్పాలని వివరించారు. ట్రోల్స్ గురించి ఆయన స్పందిస్తూ... మైబైల్స్‌లో కంటే బిగ్ స్క్రీన్ మీద చూసినప్పుడు విజువల్ క్వాలిటీ తెలుస్తుందన్నారు. తాము సినిమా తీసింది యూట్యూబ్ కోసం కాదని, థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడం కోసమన్నారు.
సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. త్రీడీలో సినిమా కొత్త అనుభూతి ఇస్తుందని హీరో ప్రభాస్ పేర్కొన్నారు. టీజర్ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు తాను చిన్న పిల్లాడిని అయిపోయానని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందిస్తున్నారట.
Also Read : Shadow Madhubabu Novels : ఓటీటీకి 'షాడో' మధుబాబు నవలలు - రైట్స్ అన్నీ ఆ దర్శకుడి దగ్గరే