అన్వేషించండి

Adipurush: ట్రోల్స్ ఎఫెక్ట్ - వీఎఫ్ఎక్స్ కంటెంట్ పై 'ఆదిపురుష్' టీమ్ రీవర్క్!

ఇప్పుడు 'ఆదిపురుష్' టీమ్ వీఎఫ్ఎక్స్ పై రీవర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ప్రభాస్(Prabhas) ప్రధాన పాత్రలో దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'(Adipurush). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇటీవల విడుదలైన సినిమా టీజర్ అంచనాలు తారుమారయ్యేలా చేసింది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా టీజర్‌లోని సన్నివేశాలు కార్టూన్ మూవీని తలపించాయి. అలాగే వానర సేనను కూడా అభ్యంతరకరంగా చూపించారని, VFX సీన్స్ మరీ దారుణంగా ఉన్నాయని ట్రోల్ చేశారు. 

ఇప్పటికే ఈ టీజర్ పై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల మనోభావాలు, సెంటిమెంట్లను దెబ్బతీసేలా 'ఆదిపురుష్' మూవీ సీన్స్ ఉన్నాయని ఈ సినిమాపై కోర్టులో కేసులు పెడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు 'ఆదిపురుష్' టీమ్ వీఎఫ్ఎక్స్ పై రీవర్క్ చేస్తున్నట్లు సమాచారం. గ్రాఫిక్స్ పై విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో ఇప్పుడు మరోసారి వర్క్ చేయడానికి రెడీ అయ్యారు. దర్శకుడు ఓం రౌత్ ఈ వర్క్ ను దగ్గరుండి చూసుకుంటున్నారట. ప్రభాస్, నిర్మాత భూషణ్ కుమార్ కూడా వీఎఫ్ఎక్స్ షాట్స్ పై స్పెషల్ ఫోకస్ చేయమని చెప్పారట. 

పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కి ఎక్కువ సమయం ఉండడంతో వీఎఫ్ఎక్స్ విషయంలో మరింత శ్రద్ధ పెట్టే ఛాన్స్ వచ్చింది. 2023 జనవరి 12న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ రీవర్క్ కోసం కూడా ఎక్స్ ట్రా బడ్జెట్ కేటాయిస్తున్నారట. 'ఆదిపురుష్'లో శ్రీరాముని పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ (Kriti Sanon), లక్ష్మణుడిగా సన్నీ సింగ్ (Sunny Singh), లంకేశ్ పాత్రలో హిందీ హీరో సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) నటించారు.  సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న 'ఆదిపురుష్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రాన్ని టీ సిరీస్ సంస్థ నిర్మిస్తోంది. సుమారు 500 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో సినిమా రూపొందుతోంది.

మార్వెల్ రేంజ్‌లో 'ఆదిపురుష్':
కొన్నాళ్ల క్రితం రామాయణం ఆధారంగా తీసిన జపనీస్ యానిమేషన్ ఫిల్మ్ చూశానని.. మన పురాణాల గురించి తెలియని ఎవరో అలాంటి సినిమా తీసినప్పుడు మనమెందుకు తీయకూడదనే ఆలోచనతో 'ఆదిపురుష్'ని తెరకెక్కించినట్లు చెప్పారు ఓం రౌత్. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు నేటి జెనరేషన్ కి అర్ధమయ్యేలా తీయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. రామాయణాన్ని చాలా కోణాల్లో తెలుసుకున్నానని.. అయితే ఈ జెనరేషన్ వారికి మార్వెల్స్, హ్యారీ పోటర్ వంటి సినిమాలు బాగా కనెక్ట్ అవుతుండడంతో.. అది దృష్టిలో పెట్టుకొని 'ఆదిపురుష్' తీసినట్లు చెప్పారు. రామాయణాన్ని వక్రీకరించి ఈ సినిమా తీయలేదని.. మోడర్న్ పెర్స్పెక్టివ్ లో సినిమా తీశానని అన్నారు.

హాలీవుడ్ లో 'ఆదిపురుష్':
ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా కాకుండా.. పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే నిర్మాతలు వెల్లడించారు. దీనికోసం హాలీవుడ్ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నారట. 'బాహుబలి' సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అందుకే ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా 'ఆదిపురుష్' రిలీజ్ చేయాలనుకుంటున్నారు.

Also Read: 'మెగా' ఆవేదన - చిరంజీవి పనైపోయిందని ప్రచారం చేసింది ఎవరు?

Also Read: 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Pokiri 20Years: ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా...! బుల్లెట్టు దిగిందా లేదా..!?  పండుగాడొచ్చి 20 ఏళ్లు
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా...! బుల్లెట్టు దిగిందా లేదా..!?  పండుగాడొచ్చి 20 ఏళ్లు
Lakshimi Raave Maa Intiki Serial Today April 27th: విక్రమ్ గురించి శ్రీలక్ష్మీని మ్యాడీ ఏమని హెచ్చరిస్తాడు..? సింధూకు విడాకుల ఇవ్వడానికి గోపీ ఎందుకు ఒప్పుకోలేదు...?
లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్‌: విక్రమ్ గురించి శ్రీలక్ష్మీని మ్యాడీ ఏమని హెచ్చరిస్తాడు..? సింధూకు విడాకుల ఇవ్వడానికి గోపీ ఎందుకు ఒప్పుకోలేదు...?
Jagadhatri Serial Today April 27th: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?
జగద్ధాత్రి సీరియల్: ఇంటి పనులు తప్పించుకోవడానికి నిషిక, వైజయంతి వేసిన ప్లాన్‌ ఏంటి..?
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్

వీడియోలు

Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్
SRH vs RR IPL 2026 Highlights | టేబుల్ టాపర్‌గా SRH
Prabhsimran Singh Hits 6 Fours in an Over IPL 2026 | ప్రభ్‌సిమ్రన్ సిక్సర్ల రికార్డ్
KL Rahul 152 Runs vs PBKS IPL 2026 | సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన కేఎల్ రాహుల్
Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Rahul: కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
కాంగ్రెస్‌లో చేరడమే పెద్ద రిస్క్ - రాహుల్ గాంధీకే నేరుగా చెప్పిన విద్యార్థిని - వీడియో వైరల్
Special Leave for Police: తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
తెలంగాణ పోలీసులకు డీజీపీ గుడ్‌న్యూస్.. ఆ 2 రోజులు సెలవులపై ఉత్తర్వులు జారీ
Andhra University:
"శతాయుష్మాన్ భవ" ఏయూను దీవించిన ప్రముఖులు! ఘనంగా ముగిసిన శతాబ్ది వసంతాల వేడుకలు! ప్రత్యేక ఆకర్షణగా సచిన్, త్రివిక్రమ్
Hyderabad IT Corridor: హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
హైదరాబాద్‌లో ఇలా చేస్తారా? - సైక్లింగ్ ట్రాక్‌పై ఏం జరుగుతుందో మహిళ వీడియో వైరల్
live in relationship: సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
సహజీవనంలో బిడ్డను కన్న యువతి - తేడా వచ్చిందని రేప్ కేసు - సుప్రీంకోర్టు ఏమన్నదంటే ?
Mumbai News: బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
బిర్యానీ, పుచ్చకాయ తిన్న నలుగురు మృతి! ముంబైలో ఘోర విషాదం 
Tips for Child Sleep : పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
పిల్లలు హాయిగా నిద్రపోవాలంటే.. తల్లిదండ్రులు తప్పకుండా పాటించాల్సిన టిప్స్
Social Post : మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
మోడ్రన్ డ్రెస్‌లో వామికా - నేచర్ ఎంజాయ్ చేసిన ఇస్మార్ట్ బ్యూటీ... ఫోటోస్ వైరల్
Embed widget