By: ABP Desam | Updated at : 27 Feb 2023 12:04 PM (IST)
Edited By: anjibabuchittimalla
Images Credit: Chiranjeevi, PawanKalyan and RRR/Instagram
‘RRR’ సినిమా తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను సృష్టించడమే కాకుండా, తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. దీంతో అంతర్జాతీయంగా సినిమాకు ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. తాజాగా ఈ మూవీకి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఈవెంట్ లో ఏకంగా 5 అవార్డులు దక్కించుకుంది. ఈ అవార్డులను దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. అంతేకాదు, ఈ వేడులకలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంటర్ గా పాల్గొన్నారు. ఓ ప్రత్యేకమైన అవార్డును అందుకున్నారు. దీంతో రామ్ చరణ్ కు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయి.
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ను అభినందిస్తూ జనసేన పార్టీ తరఫున అధికారికంగా ప్రెస్ నోట్ ను విడుదల చేశారు. ‘‘ఎంతో ప్రతిష్ఠాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డుల్లో ‘RRR’ వరుస పురస్కారాలు దక్కించుకోవడం ఆనందదాయకం. ఈ వేదికపై ‘బెస్ట్ వాయిస్/మోషన్ కాప్చర్ పెర్ఫార్మెన్స్’ను రామ్ చరణ్ ద్వారా ప్రకటించడం, స్పాట్ లైట్ అవార్డు స్వీకరించడం సంతోషాన్ని కలిగించింది. రామ్ చరణ్ కి, దర్శకులు రాజమౌళి, అలాగే చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు. చరణ్ మరిన్ని మంచి సినిమాలు చేసి అందరి మన్ననలు పొంది ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. అయితే, పవన్ కల్యాణ్ ప్రెస్ నోట్ లో ‘RRR’ చిత్రంలో రామ్ చరణ్ తో కలిసి నటించిన జూ. ఎన్టీఆర్ పేరును ప్రస్తావించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఆయన తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. రామ్ చరణ్, రాజమౌళి పేరు రాసిన పవన్, జూ. ఎన్టీఆర్ ను ఎందుకు మర్చిపోయారంటూ మండిపడుతున్నారు.
అభినందనలు... రామ్ చరణ్ @AlwaysRamCharan - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/bJQgy8TPf1
— JanaSena Party (@JanaSenaParty) February 25, 2023
చిరంజీవి సైతం తాజాగా చేసిన ట్వీట్ లో ఎన్టీఆర్ పేరును ప్రస్తావించలేదు. తన కొడుకు రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి పేరును మాత్రమే గుర్తు చేశారు. అప్పుడు కూడా జూ. ఎన్టీఆర్ అభిమానులు తీవ్రంగా బాధపడ్డారు. రామ్ చరణ్ ను మాత్రమే ప్రశంసించడాన్ని ఎన్టీఆర్ అభిమానులు తప్పుబట్టారు. ఆ తర్వాత ‘RRR’పై చిరంజీవి చేసిన మరో ట్వీట్ లోనూ రామ్ చరణ్, SS రాజమౌళి పేర్లు మాత్రమే ప్రస్తావించారు. దీంతో మెగాస్టార్ తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
A Proud Moment for Telugu / Indian Cinema @AlwaysRamCharan ,features on the famed #GoodMorningAmerica
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 23, 2023
Amazing how the power of One passionate idea born in the visionary @ssrajamouli ‘s brain, envelopes the world!
Onwards & Upwards !! 👏👏https://t.co/Ur25tvt9r9 pic.twitter.com/SrpisRfviK
ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో ‘RRR’ 5 అవార్డులను దక్కించుకుంది. ఈ వేడుకకు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకావాల్సి ఉన్నా ఆయన సోదరుడు నందమూరి తారకరత్న చనిపోవడంతో వెళ్లలేదు. దీంతో చరణ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు.
Read Also: అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్ చేయాలనుంది, బాలీవుడ్ టాప్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Gruhalakshmi March 23rd: తులసి తన భార్య కాదని వాసుదేవ్‌కి చెప్పేసిన నందు- హీరోలాగా ఫైట్ చేసి దివ్యని కాపాడిన విక్రమ్
NTR 30 Muhurtam : రాజమౌళి క్లాప్‌తో మొదలైన ఎన్టీఆర్ 30 - అతిరథ మహారథుల సమక్షంలో...
Brahmamudi March 23rd: చెల్లి అదృష్టాన్ని చూసి అసూయ పడిన స్వప్న- కావ్య తొందరపాటుతో దొరికిపోయిన కనకం
Guppedanta Manasu March 23rd: అర్థరాత్రి వసు సేవలో రిషి - దేవయానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన జగతి
Ennenno Janmalabandham March 23rd: గెలిచిన భార్యాభర్తల బంధం, విన్నీ షాక్- వేదకి ఇక సీతమ్మ కష్టాలే
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు ఓటేస్తారా? రాజీనామాను ఆమోదించేశారా?
KCR Tour: నేడు 4 జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటన - పూర్తి షెడ్యూల్ ఇదీ
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Fed Rate Hike: వడ్డీ రేట్లను 25 bps పెంచిన ఫెడ్ - ప్రపంచం ఏమైనా పర్లేదు, తన దారి తనదే!