Pooja Hegde: 'ఎఫ్3'లో ఐటెం సాంగ్ - పూజాహెగ్డే ఎంత డిమాండ్ చేసిందంటే?
'ఎఫ్3' సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజాహెగ్డేను సంప్రదించారు. దీనికోసం ఆమె ఎంత డిమాండ్ చేసిందో తెలుసా?
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న పూజాహెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా బిజీ అయింది. అయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీని పక్కన పెట్టలేదు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. టాలీవుడ్ లో ఈ బ్యూటీ ఒక్కో సినిమాకి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు తీసుకుంటుంది. ఆమెకి ఉన్న క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు కూడా అంత మొత్తాన్ని ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. హీరోయిన్ గానే కాకుండా.. క్యామియో, స్పెషల్ సాంగ్స్ కూడా నటిస్తోంది ఈ బ్యూటీ.
ఇప్పటికే 'రంగస్థలం' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించింది ఈ బ్యూటీ. అలానే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' సినిమాలో క్యామియో రోల్ పోషించింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇప్పుడు ఈ బ్యూటీని ఐటెం సాంగ్ కోసం సంప్రదించినట్లు తెలుస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి 'ఎఫ్3' సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం పూజాహెగ్డేను సంప్రదించారు. దీనికోసం ఆమె రూ.1.25 కోట్లు డిమాండ్ చేసింది. నిర్మాత దిల్ రాజు ఆమెని కోటి రూపాయలకు ఒప్పించినట్లు తెలుస్తోంది. ఒక్క సాంగ్ కోసం కోటి రూపాయలంటే మాములు విషయం కాదు. త్వరలోనే పూజాహెగ్డేపై ఈ పాటను చిత్రీకరించనున్నారు. ఈ సినిమా మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పూజాహెగ్డే నటించిన 'బీస్ట్' సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో విజయ్ హీరోగా నటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. మరి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి!
Also Read: ఎయిర్‌పోర్టులో నటికి వేధింపులు - అసభ్యంగా తాకుతూ!
Also Read: రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ సినిమా లేనట్లేనా?
View this post on Instagram