By: ABP Desam | Updated at : 12 Jan 2023 07:47 PM (IST)
Edited By: anjibabuchittimalla
Photo@Aishwarya Lekshmi/Instagram
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు పొందిన ముద్దుగుమ్మ ఐశ్వర్య లక్ష్మీ. తెలుగు, తమిళ, మలయాళ సినిమా పరిశ్రమలో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’, ‘మట్టి కుస్తి’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ సడెన్ షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు పెళ్లంటే ఇష్టం లేదని చెప్పిన ఈ అమ్మడు ఏకంగా ఇన్ స్టా వేదికగా ప్రియుడిని పరిచయం చేసింది. ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో అర్జున్ దాస్ తో ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పింది.
ఐశ్వర్య లక్ష్మీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అర్జున్ దాస్ తో దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకు లవ్ సింబల్ పెట్టింది. ఆమె ఇన్‌స్టా పోస్ట్‌కు పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అవుతున్నారు. అందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు. నెటిజన్లు సైతం ఆమె శుభకాంక్షలు చెప్తున్నారు. ఈ జంట ఇలాగే సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. మరి కొంత మంది మాత్రం ఇదో ప్రమోషన్ లో భాగంగా ఆడుతున్న డ్రామాగా కొట్టి పారేస్తున్నారు. ఇద్దరు కలిసి త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రచారం చేస్తున్నారు.
‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా సక్సెస్ తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య లక్ష్మి పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. అసలు తనకు పెళ్లి అంటేనే ఇష్టం లేదని వెల్లడించింది. తన జీవితంలో పెళ్లికి చోటు లేదని చెప్పుకొచ్చింది. ఆ విషయాన్ని సినీ జనాలు మర్చిపోక ముందే ఐశ్వర్య, తన ప్రియుడిని పరిచయం చేయడం పట్ల అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, నెటిజన్లు అంటున్నట్లు సినిమా ప్రమోషనా? లేదంటే నిజంగానే ఇద్దరూ ప్రేమలో ఉన్నారా? అనే విషయంపై ఎవరికీ ఎలాంటి క్లారిటీ లేదు. ఈ విషయంపై ఐశ్వర్య లేదంటే అర్జున్ ఎవరో ఒకరు వివరణ ఇవ్వాల్సిందే. అప్పటి వరకు వెయిట్ చేయక తప్పదు.
అటు అర్జున్ దాస్ ‘బుట్టబొమ్మ’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అందుకున్న ‘కప్పెలా’ సినిమాకు రీమేక్ గా ‘బుట్టబొమ్మ’ తెరకెక్కుతోంది. సితార ఎంటర్ టైనమెంట్స్ బ్యానర్ లో నిర్మితం అవుతున్న ఈ సినిమాకు చంద్ర శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. అనీకా సురేందర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.
Read Also: ‘RRR’ సీక్వెల్ పై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు, కీలక విషయాలు వెల్లడి!
Brahmamudi February 4th: రాజ్ కి నిజం చెప్పమన్న కావ్య- స్వప్న మీద కన్నేసిన రాహుల్
Leo Movie Shooting: దళపతి ‘లియో’లో ఏజెంట్ టీనా కీలక పాత్ర, చిత్ర బృందంతో స్పెషల్ ఫ్లైట్ లో కశ్మీర్ కు పయనం!
Janaki Kalaganaledu February 4th: రామతో కన్నీళ్లు పెట్టించిన అఖిల్- వంట రాక తిప్పలు పడుతున్న మలయాళం
Butta Bomma Movie Review - 'బుట్ట బొమ్మ' రివ్యూ : మలయాళ హిట్ 'కప్పేలా' తెలుగు రీమేక్ ఎలా ఉందంటే?
Guppedantha Manasu February 4th Update: ఆఖరి శ్వాసవరకూ రిషి సార్ ప్రేమకోసమే తపిస్తానన్న వసు, దేవయాని స్కెచ్ పసిగట్టేసిన జగతి-మహేంద్ర
Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !
Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?
Twitter Ad Revenue Share: ట్విట్టర్ ద్వారా సంపాదన కూడా - కానీ అది మాత్రం కంపల్సరీ!
SBI Q3 Result: రికార్డ్ సృష్టించిన స్టేట్ బ్యాంక్, గతం ఎన్నడూ ఇన్ని లాభాలు కళ్లజూడలేదు