By: ABP Desam | Updated at : 01 Feb 2022 02:01 PM (IST)
హీరోయిన్ డిమాండ్స్ చూశారా..?
టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఉన్న హీరోయిన్లనే రిపీట్ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్లే మన ముద్దుగుమ్మల డిమాండ్స్ కూడా ఉంటాయి. ఇప్పటి స్టార్ హీరోయిన్లు ఒక్కో సినిమాకి రెండు, మూడు కోట్లకు తక్కువ కాకుంగా తీసుకుంటున్నారు. ఒక్క హిట్టు వస్తే చాలు.. వాళ్ల రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తుంటారు. యంగ్ హీరోయిన్ల డిమాండ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి.
'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఈ లిస్ట్ లో శ్రీలీల కూడా చేరిపోయింది. ఇటీవల విడుదలైన 'పెళ్లి సందడి' సినిమాలో హీరోయిన్ గా నటించింది శ్రీలీల. గౌరీ రోనంకి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నటించడం విశేషం.
శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించాడు. దసరా సీజన్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ.. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది.కొన్ని థియేటర్లలో ఈ సినిమా యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో శ్రీలీల స్క్రీన్ ప్రెజన్స్, నటన, డాన్స్ లు ఆకట్టుకోవడంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకి పైగా సినిమాలున్నాయని తెలుస్తోంది. తొలి సినిమాకి రూ.5 లక్షల పారితోషికం తీసుకున్న శ్రీలీల.. రెండో సినిమాకి రూ.40 లక్షల వరకు తీసుకుంది. ఇటీవల శ్రీలీల సైన్ చేసిన ఓ సినిమాకి రూ.75 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఆమె కాల్షీట్లు కావాలంటే కోటి ఇవ్వాల్సిందేనట. కొత్తగా ఎవరైనా కథ చెప్పడానికి వెళ్తే.. వెంటనే కోటి డిమాండ్ చేస్తుందట శ్రీలీల. ఇప్పుడు ఆమె నటిస్తున్న సినిమాలేవైనా సక్సెస్ అందుకుంటే మాత్రం ఆమె రెమ్యునరేషన్ మరింత పెంచడం ఖాయం.
Actor Navdeep's Newsense: జర్నలిస్టుగా యంగ్ హీరో నవదీప్ - ఆకట్టుకుంటోన్న ‘న్యూసెన్స్’ ఫస్ట్ లుక్
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ఎస్వీ రంగారావు మనవళ్లు
Sai Dharam Tej's Satya: రిపబ్లిక్ డే స్పెషల్, సాయి ధరమ్ తేజ్ - కలర్స్ స్వాతి మ్యూజికల్ వీడియో
Venkatesh Saindhav : 'సైంధవ్' స్టోరీ లైన్ మాములుగా లేదుగా - వెంకీ మామ మూడు క్లూస్ వదిలాడు
Balakrishna Song Remix : కళ్యాణ్ రామ్ 'అమిగోస్'లో బాలకృష్ణ సాంగ్ రీమిక్స్ - అది ఏ పాటంటే?
TS Teachers Transfers : ఉపాధ్యాయ దంపతులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్, స్పౌజ్ కేటగిరీ బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Pawan Vs Byreddy : నన్ను ముసలోడ్నంటావా ? కొండారెడ్డి బురుజు వద్ద కుస్తీకొస్తావా ? - పవన్కు బైరెడ్డి సవాల్ !
AP Capital supreme Court : ఏపీ రాజధానిపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ - ఈ సారి శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుపై...
Pranitha Subhash: క్యాజువల్ లుక్ లో ఆకట్టుకుంటున్న ప్రణీత