News
News
X

Payal Rajput: మరీ ఇంత దారుణంగా చేస్తారా? హాట్ బ్యూటీ పాయల్‌ రాజ్‌పుత్‌ ఆగ్రహం, అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. తాజాగా చేసిన విమాన ప్రయాణంలో సదరు సంస్థ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

FOLLOW US: 

పాయల్ రాజ్ పుత్.. ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో  తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుని.. టాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో కెరీర్ ఫుల్ బిజీగా కొనసాగిస్తోంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మంచు విష్ణుతో కలిసి ‘జిన్నా’ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నహాలు మొదలయ్యాయి. 

పాయల్ తాజాగా ఓ విమానయాన సంస్థపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతో ఖరీదైన తన లగేజీని విమాన సంస్థ స్థాప్ డ్యామేజ్ చేశారని ఫైర్ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది. ఈ సందర్భంగా తన లగేజ్‌ ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. అసలేం జరిగిందంటే..

రెండు  రోజుల క్రితం పాయల్ రాజ్ పుత్ ఇండిగో విమానంలో ప్రయాణం చేసింది. ప్రయాణ సమయంలో కొత్త సూట్ కేస్ లో తన లగేజీని తీసుకెళ్లింది. విమాన సిబ్బంది అడ్డగోలుగా లగేజీని విసిరేయడం మూలంగా తన కొత్త సూట్ కేస్ వీల్స్ విరిగిపోయాయి.కొంత లగేజ్ డ్యామేజ్ అయ్యింది. దీంతో ఆమెకు పట్టరాని కోపం వచ్చింది.  డ్యామేజ్ అయిన లగేజీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. “డ్యామేజ్‌ అయిన నా బ్యాగులు చూడండి. ఇందుకు ఇండిగో విమాన సిబ్బందే కారణం. నా లగేజ్‌ ని ఇష్టానుసారంగా విసిరారు. వారి నిర్లక్ష్యం కారణంగానే నా లగేజ్‌ దారుణంగా పాడైంది. ఈ ప్రయాణం నాకు చేదు అనుభవాన్ని ఇచ్చింది” అంటూ ట్వీట్ చేసింది.

కాసేపటి తర్వాత థ్యాంక్స్ అంటూ ట్వీట్

కొద్ది సేపటి తర్వాత పాయల్ మరో ట్వీట్ చేసింది. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన అమ్మడు.. సదరు విమాన సంస్థపై ప్రశంసలు కురిపించింది. ఇండిగో సంస్థ తన సమస్యను పరిష్కరించిందని వెల్లడించింది. తన అభ్యర్థనపై ఇండిగో ఎయిర్‌ లైన్‌ స్పందించిన తీరు పట్ల హర్షం వ్యక్తం చేసింది. తన సమస్యను పరిష్కరించిన ఇండిగో సంస్థకు ధన్యవాదాలు అంటూ పోస్టులో వెల్లడించింది.

గతంలోనూ ఇలాంటి ఘటనలు

ఇండిగో ఎయిర్ లైన్స్ పై గతంలోనూ పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. కొంత కాలం క్రితం బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా సైతం తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇండిగో విమానంలో ప్రయాణించిన ఆమె..   తన ఖరీదైన లగేజ్‌ బ్యాగ్‌ డ్యామేజ్‌ చేశారని, బ్యాగ్‌ హ్యాండిల్‌, వీల్స్‌ విరిగిపోయాయంటూ ఓ వీడియోను షేర్‌ చేశారు. పటిష్టమైన బ్యాగ్‌ ను ధ్వంసం చేసి పారేశారంటూ ఆమె మండిపడ్డారు. మంచి బ్యాగ్‌ను తీసుకొని మీ ఇండిగో విమానంలో ప్రయాణిస్తే.. ప్రయాణం ముగిసేసరికి బ్యాగ్‌ రెండు హ్యాండిల్స్‌ విరిగిపోయానని, వీల్స్‌ పూర్తిగా ఊడిపోయానని ఆగ్రహం వ్యక్తం చేసింది.

లగేజి పట్ల ఇండిగో సిబ్బంది అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని కొంతకాలంగా ప్రయాణికుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల తన వీణను సిబ్బంది పాడు చేశారని ప్రముఖ సంగీత కళాకారుడు శభేంద్ర రావు ఫేస్ బుక్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఎక్క‌డో ఒక‌సారి పొర‌పాటు జ‌రిగితే కామ‌న్. ప్ర‌తిసారి అదే ప‌నిగా జ‌రుగుతుంటే లోపం ఎవ‌రిలో ఉన్న‌ట్లు? అంటు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published at : 16 Sep 2022 10:15 AM (IST) Tags: Payal rajput indigo airline luggage damage

సంబంధిత కథనాలు

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Pawan Kalyan: ప్లాప్ డైరెక్ట‌ర్‌తో పవన్ కళ్యాణ్ సినిమా - లాంఛింగ్ కి రెడీ!

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Balakrishna's Unstoppable 2 Trailer : విజయవాడలో బాలకృష్ణ 'అన్‌స్టాప‌బుల్‌ 2' ట్రైలర్

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Pawan Kalyan's Footwear Price: పవన్ కళ్యాణ్ షూ ఖరీదు రూ.10 లక్షలా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమేనా?

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Bandla Ganesh: వెయ్యి కోట్లు దాటే మార్కెట్ ఎట్లుంటదో చూపిస్తా: పవన్‌పై బండ్ల గణేష్ ట్వీట్

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

Varun Tej New Movie Update : యాక్షన్ విత్ మెసేజ్ - వరుణ్ తేజ్ సినిమా డీటెయిల్స్ చెప్పిన ప్రవీణ్ సత్తారు

టాప్ స్టోరీస్

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

KCR Warangal Tour: వరంగల్‌లో ప్రతిమ మెడికల్‌ కాలేజ్‌‌ ప్రారంభించిన కేసీఆర్, అప్రమత్తంగా ఉండాలని వ్యాఖ్యలు

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

Srikalahasti News : రెచ్చిపోయిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్, మహిళపై అమానుష దాడి!

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

INDW Vs SLW, Asia Cup 2022: శ్రీలంకపై చెలరేగిన జెమీమా - ఎంత కొట్టారంటే?

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం

5G In India: మీ చేతిలో ఉన్న ఫోనే మీకున్న సూపర్ పవర్ - ఇది నిజం