By: ABP Desam | Updated at : 12 May 2023 01:58 PM (IST)
పవన్ కల్యాణ్ (Photo Credit: PawanKalyan.k/Instagram)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సుజిత్ దర్శకత్వంలో ‘ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘హరిహర వీరమల్లు’ సినిమా 75 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకోగా, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తొలి షెడ్యూల్ మాత్రమే పూర్తి చేసుకుంది. ‘ఓజీ’ సినిమా తొలి సెడ్యూల్ ముంబైలో రీసెంట్ గా కంప్లీట్ కాగా, రెండో షెడ్యూల్ పుణెలో కొనసాగుతోంది. మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 6 నెలల్లోగా ఈ మూడు సినిమాలను కంప్లీట్ చేసుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఏపీలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. నేపథ్యంలో తను కమిట్ అయిన సినిమా షూటింగ్స్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని, ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ ఫిల్మ్ 'హరి హర వీర మల్లు'. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినా, ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. 75 శాతం షూటింగ్ పూర్తి అయ్యింది. అయితే, పవన్ కల్యాణ్ పలు సినిమాతో బిజీ అయ్యారు. ‘హరిహర వీరమల్లు‘కు ఇప్పట్లో డేట్స్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని క్రిష్ భావిస్తున్నారట. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో మొదటి భాగాన్ని విడుదల చేయాలనుకుంటున్నారట. స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేసి మిగతా షూటింగ్ కంప్లీట్ అయ్యాక రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నారట. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు అమ్మాయి పూజితా పొన్నాడ కూడా ఓ రోల్ చేస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో 'గబ్బర్ సింగ్' తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' తెరకెక్కుతోంది. 'గబ్బర్ సింగ్' విడుదలై పదకొండు ఏళ్ళు అయిన సందర్భగా 'ఉస్తాద్ గబ్బర్ సింగ్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో పాతబస్తీలో పోలీస్ అధికారిగా పవన్ కనిపించారు. లుంగీ కట్టిన పవర్ స్టార్.. 'ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది' అని చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీ లీల ఓ కథానాయికగా నటిస్తున్నది. అశుతోష్ రాణా, నవాబ్ షా, 'కేజీఎఫ్' అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, 'టెంపర్' వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమను నిర్మాతలుగా నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి వ్యవహరిస్తున్నారు.
పవన్ హీరోగా, 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్'. ప్రియా మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని 'ఆర్ఆర్ఆర్' తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే తొలి షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ పుణెలో కొనసాగుతోంది. ప్రస్తుతం పుణెలో చిత్రబృందం కొన్ని పాటలను చిత్రీకరిస్తోంది.
Read Also: తమన్నాతో డేటింగ్ పై స్పందించిన విజయ్ వర్మ, ఇంతకీ ఆయన సమాధానం ఏంటంటే?
రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసిన సమంత, ‘సిటాడెల్’ టీమ్ - ఇండియాలో కాదు
హీరో విజయ్ కీలక నిర్ణయం - ఆ విద్యార్థులకు సాయం
Ranbir Kapoor: రణబీర్ కపూర్ మంచి మనసు - వారికి 'ఆదిపురుష్' టికెట్లు ఫ్రీ!
Leo Movie: విజయ్ ‘లియో’లో కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కొత్త ప్లాన్?
అభిమానుల చేతుల మీదుగా 'భగవంత్ కేసరి' టీజర్ - ఎన్ని థియేటర్లలో తెలుసా?
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం