Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మూడు నెలల కాల్షీట్స్ - రూ.60 కోట్ల రెమ్యునరేషన్
సముద్రఖని తెరకెక్కించిన 'వినోదయ సీతమ్' సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనతో సినిమాలు తీయడానికి ఎగబడుతుంటారు దర్శకనిర్మాతలు. ఈ రెండేళ్లలో ఆయన 'వకీల్ సాబ్', 'భీమ్లానాయక్' సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు సినిమాలు కూడా రీమేక్ కథలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఓ తమిళ రీమేక్ ను ప్లాన్ చేస్తున్నారు. సముద్రఖని తెరకెక్కించిన 'వినోదయ సీతమ్' సినిమాను పవన్ కళ్యాణ్ హీరోగా తెలుగులో రీమేక్ చేయనున్నారు.
ఇందులో సాయిధరమ్ తేజ్ లీడ్ రోల్ పోషించనున్నారు. కథ ప్రకారం.. పవన్ కళ్యాణ్ దైవదూతగా కనిపించనున్నారు. ఈ సినిమాను మూడు నెలలో పూర్తి చేయాలనుకుంటున్నారు. ఒరిజినల్ వెర్షన్ ను డైరెక్ట్ చేసిన సముద్రఖని రీమేక్ ను కూడా డైరెక్ట్ చేయనున్నారు. అయితే ఈ ఒక్క సినిమాకి గాను పవన్ కళ్యాణ్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారట. ఈ ఏడాది అక్టోబర్ తరువాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ కానున్నారు.
అంతలోపే ఈ రీమేక్ పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. జూలై నుంచి మూడు నెలల పాటు పవన్ కళ్యాణ్ తన కాల్షీట్స్ ఇవ్వబోతున్నారట. దానికోసం ఆయనకు రూ.60 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ మధ్యకాలంలో పవన్ ఒక్కో సినిమాకి యాభై కోట్ల చొప్పున తీసుకుంటున్నారు. ఈ రీమేక్ కోసం పది కోట్లు ఎక్కువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. జీస్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు అందించనున్నారు. అయితే టైటిల్స్ లో క్రెడిట్ మాత్రం తీసుకోరట. దానికి బదులుగా తన బ్యానర్ ఫార్చ్యూన్ ఫోర్ ని పార్ట్నర్ గా యాడ్ చేశారు.
నిజానికి ఈ సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ చాలా సినిమాలు కమిట్ అయ్యారు. ఇంకా 'హరిహర వీరమల్లు' సినిమా షూటింగ్ కూడా పూర్తి కాలేదు. మరోపక్క హరీష్ శంకర్ వెయిటింగ్ మోడ్ లో ఉన్నారు. ఈ సినిమాలను పక్కన పెట్టి మరీ 'వినోదయ సీతమ్' రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ
View this post on Instagram
View this post on Instagram