News
News
X

Pawan Kalyan: ఫ్యాన్స్ కోసం పవన్ ఆ రీమేక్‌ను వదులుకుంటారా?

పవన్ కళ్యాణ్ ను 'వినోదయ సిత్తం' రీమేక్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు అభిమానులు.

FOLLOW US: 
 
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలుపెట్టారు. ఈ సినిమా తరువాత 2024 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ మరో సినిమా ఏదైనా పూర్తి చేయాలనుకుంటున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా అనౌన్స్ అయి చాలా కాలమైంది. 

ఈ సినిమాను పవన్ ఎప్పుడు పట్టాలెక్కిస్తారా..? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఎన్నికల్లోపు స్ట్రెయిట్ సినిమా అంటే కష్టమని.. దానికి బదులుగా తక్కువ సమయంలో ఓ రీమేక్ చేసేయాలని పవన్ ఆలోచిస్తున్నారట. పవన్ కోసం ఆల్రెడీ ఒక రీమేక్ సినిమాను సెట్ చేసి పెట్టారు త్రివిక్రమ్. అదే 'వినోదయ సిత్తం'. రీమేక్ వెర్షన్ కి తెలుగు టచ్ అద్ది.. స్క్రిప్ట్ రెడీ చేసింది త్రివిక్రమే. 

ఇందులో పవన్ కళ్యాణ్ దైవదూతగా కనిపించనున్నారు. సాయిధరమ్ తేజ్ ను హీరో క్యారెక్టర్ కోసం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్ సినిమాపై పవన్ ఫ్యాన్స్ వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. పవన్ ఇదివరకు కొన్ని రీమేక్ సినిమాల్లో నటించారు. 'పింక్', 'అయ్యప్పనుమ్ కోశియుమ్' వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి.. కొన్ని మాస్ ఎలిమెంట్స్ ను యాడ్ చేశారు. 

కానీ 'వినోదయ సిత్తం'లో అలాంటి ఎలిమెంట్స్ కి స్కోప్ లేదు. నిజం చెప్పాలంటే.. ఇది 'గోపాల గోపాల' స్టైల్ లో సాగే కథ. రీసెంట్ గా 'వినోదయ సిత్తం' సినిమాను హిందీలో రీమేక్ చేశారు. 'థ్యాంక్ గాడ్' అనే పేరుతో సినిమాను రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాకి నెగెటివ్ టాక్ వస్తోంది. ఈ సినిమా చూశాక 'వినోదయ సిత్తం' రీమేక్ పై మరింత వ్యతిరేకత ఏర్పడుతోంది. ఈ సినిమా హిందీలో పెద్దగా ఆడలేదు. డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. హిందీలో మాస్ టచ్ ఇచ్చి.. క్యారెక్టర్ డిజైన్ మార్చినా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఇప్పుడు పవన్ ఈ సినిమా రీమేక్ ను పక్కన పెట్టేస్తే బెటర్ అని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి పవన్ వారి రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేస్తారో లేక రీమేక్ ను సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి!

News Reels

ఇక  'హరిహర వీరమల్లు' సినిమా విషయానికొస్తే.. ఈ ఏడాది పూర్తయ్యేలోపు సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్(Nidhi Aggerwal) కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ భామ నర్గిస్ ఫక్రి(Nargis Fakri) కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్(Megaproductions) పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 

Also Read: 'ఆదిపురుష్' సినిమాకి షాకింగ్ రన్ టైం - మూడు గంటలకు పైగానే!

పరశురామ్ కి ఛాన్స్ ఇస్తారా..?
మహేష్ బాబు(Mahesh Babu)తో 'సర్కారు వారి పాట' సినిమా తీసిన పరశురామ్.. ఇప్పటివరకు తన నెక్స్ట్ సినిమాను పట్టాలెక్కించలేదు. ఈ క్రమంలో పవన్ కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్లు సమాచారం. నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్(BVSN Prasad) ఇప్పటికే పవన్ కళ్యాణ్ కి అడ్వాన్స్ ఇచ్చారు. పరశురామ్ కథ గనుక పవన్ కి నచ్చితే వీరి కాంబినేషన్ లో సినిమా గ్యారెంటీ. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నారు. కథ మొత్తం పూర్తయ్యాక పవన్ కి వినిపిస్తారు. మరి పరశురామ్ కి పవన్ ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి!

Published at : 28 Oct 2022 06:32 PM (IST) Tags: Pawan Kalyan Harihara veeramallu Vinodhaya Sitham

సంబంధిత కథనాలు

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Bhavadeeyudu Bhagat Singh: పవన్ ఫ్యాన్స్‌లో కొత్త ఆశలు - భవదీయుడుపై లేటెస్ట్ న్యూస్!

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

Inaya in Bigg Boss: క్యారెక్టర్లు మార్చుకున్న హౌస్‌మేట్స్ - మళ్లీ రొమాన్స్ మొదలెట్టిన శ్రీహాన్, ఇనయా

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

ఆ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ - ఆస్కార్‌కు లైన్ క్లియరైనట్లేనా?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

FALL Series Review: ఫాల్ సిరీస్ రివ్యూ: అంజలి కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉంది?

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

Pawan Kalyan Harish Shankar : పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్‌లో ప్రభాస్ దర్శకుడు

టాప్ స్టోరీస్

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

BRA vs CRO, FIFA WC Quarter Final: ఫిఫా వరల్డ్ కప్‌లో సంచలనం, బ్రెజిల్‌పై విజయంతో సెమీస్‌కు క్రొయేషియా

Pawan On Ysrcp : కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Pawan On Ysrcp :  కారు నుంచి కట్ డ్రాయర్ల వరకూ - వారాహి రంగుల వివాదంపై వైఎస్ఆర్‌సీపీకి పవన్ ఇచ్చిన కౌంటర్స్ ఇవే

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Challa Joins BRS: బీఆర్ఎస్‌లోకి మొదలైన చేరికలు, మాజీ ఎమ్మెల్యే చల్లాకు గూలాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Mandous Cyclone Effect: మరింత బలహీనపడిన మాండూస్ తుఫాను, ఏపీలో ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు