Prabhas Upcoming Films: నాగ్ అశ్విన్ To ప్రశాంత్ నీల్ - క్రేజీ డైరెక్టర్లతో ప్రభాస్ వరుస సినిమాలు
Prabhas Films : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో 'కల్కి 2898 AD' విడుదలకు రెడీ అవుతుండగానే, మరో నలుగురు క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు.
Prabhas Upcoming Films With Top Directors: ‘బాహుబలి’ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆయన వరుస పాన్ ఇండియన్ చిత్రాలు చేస్తున్నారు. ‘బాహుబలి’ అనంతరం వచ్చిన పలు సినిమా అనుకున్న స్థాయిలో అలరించకపోయినా, ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది ‘సలార్’తో మంచి సక్సెస్ అందుకున్న ప్రభాస్, త్వరలో 'కల్కి 2898 AD'తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అంతేకాదు, పలువురు క్రేజీ డైరెక్టర్లతో వరుస సినిమాలు చేస్తున్నారు.
1.కల్కి 2898 AD- నాగ్ అశ్విన్
ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి 2898 AD'. వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సైన్స్ ఫిక్షన్ అండ్ ఫాంటసీ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తున్నది. దిశా పటానీ సెకండ్ హీరోయిన్‌గా చేస్తోంది. బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 27న ఈ సినిమా విడుదలకానుంది.
2.ది రాజా సాబ్- మారుతి
రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది రాజా సాబ్’. ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ అభిమానులను ఆకట్టుకుంది. దర్శకుడు ఈ సినిమాకి హారర్ టచ్ ఇస్తూనే భారీ గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ తో ఆడియన్స్ కు విజువల్ ఫీస్ట్ ను ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘ది రాజా సాబ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
3.ఫౌజి- హను రాఘవపూడి
‘సీతారామం’ డైరెక్టర్ హను రాఘవపూడితో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పాటల కంపోజింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ మూవీ హిస్టారికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘ఫౌజి’ అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ‘సీతారామం’ మాదిరిగానే ఈ సినిమా కూడా ఆర్మీ నేపథ్యంలో కొనసాగనుంది. ఇందులో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
4.స్పిరిట్- సందీప్ రెడ్డి వంగా
‘యానిమల్’ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ తో చేస్తున్నారు. ‘స్పిరిట్’ పేరుతో సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించబోతున్నాయి. నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ కథే 'స్పిరిట్' మూవీ అని సందీప్ తెలిపారు. ఈ సినిమాలో హీరో ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడని చెప్పారు. ‘స్పిరిట్’ తన ప్రీవియస్ మూవీస్ లా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలిపారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కీర్తి సురేష్, రష్మిక మందన, మృణాల్ ఠాగూర్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
5.సలార్-శౌర్యాంగ పర్వం- ప్రశాంత్ నీల్
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ‘సలార్’ దేశ వ్యాప్తంగా సంచనల విజయాన్ని అందుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించబోతున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ‘సలార్’ సీక్వెల్ టైటిల్‌ను చివరలో రివీల్ చేశారు. రెండో భాగానికి ‘సలార్-శౌర్యాంగపర్వం’ అనే పేరును ఖరారు చేశారు. ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లేందుకు చాలా టైమ్ పట్టే అవకాశం ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తర్వాతి చిత్రాన్ని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఆ సినిమా కంప్లీట్ అయ్యాకే ఈ చిత్రం షురూ కానుంది.
Read Also: సర్‌ప్రైజింగ్ అప్‌డేట్, ప్రభాస్ లేకుడానే సలార్ 2 షూటింగ్? - సెట్స్‌పైకి వచ్చేది ఎప్పుడంటే..