Best Thriller Movies On OTT: అద్దె ఇంట్లో అడల్ట్ మూవీ షూటింగ్ - చాటుగా చూసిన ముసలమ్మ, ఆ తర్వాత దబిడి దిబిడే - పిల్లలతో చూడొద్దు!
Movie Suggestions: ఒక అడల్ట్ మూవీని తెరకెక్కించి, హాలీవుడ్‌లో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని వారు ఆశపడతారు. షూటింగ్ కోసం ఒక ఇంటిని సెలక్ట్ చేసుకుంటారు. కానీ అక్కడ ఓ ఊహించని మలుపు ఎదురుచూస్తుంటుంది.

Best Thriller Movies On OTT: కొన్ని సినిమాలను ఏ కేటగిరిలో వేయాలి అని పూర్తిగా క్లారిటీ ఉండదు. ఇది అలాంటి ఒక సినిమా. కానీ పిల్లలు చూసేది మాత్రం కాదు.! ఇందులో వైలెన్స్, థ్రిల్లర్.. ఇలా అన్నీ ఉంటాయి. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ అయితే చాలా ఉంటుంది. ఇంతకీ ఆ మూవీ టైటిల్ ఏంటని అనుకుంటున్నారా.. ‘ఎక్స్’ (X). అసలు మూవీకి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో గానీ.. దానికి తగినట్టుగానే సినిమాలో లెక్కలేనంత అడల్ట్ కంటెంట్, న్యూడిటీ కూడా ఉంటుంది. దీనిని ఒక ఫ్రాంచైజ్‌లాగా ప్లాన్ చేశారు మేకర్స్. అందులో ముందుగా విడుదలయిన ‘ఎక్స్’.. ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.
కథ..
‘ఎక్స్’ మూవీ స్టార్ట్ అవ్వగానే 1979లో టెక్సాస్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో వరుసగా హత్యలు జరిగాయని పోలీసులకు సమాచారం అందుతుంది. వచ్చి చూస్తే ఒక ఇల్లు మొత్తం రక్తంతో నిండిపోయి ఉంటుంది. అక్కడ వారికి చాలా శవాలు కూడా దొరుకుతాయి. అసలు జరిగిన కథ ఏంటో అప్పుడే మొదలవుతుంది. 24 గంటల క్రితం ఆ ఇంట్లోకి కొందరు వ్యక్తులు వస్తారు. వారంతా అక్కడ ఒక అడల్ట్ సినిమాను తెరకెక్కించాలని, ఆ సినిమాతో హాలీవుడ్‌లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో ఒక వృద్ధ జంట మాత్రమే జీవిస్తుంటారు. వారు ఒక అడల్డ్ సినిమా షూట్ చేయడానికి వచ్చామని చెప్పకుండా అక్కడ ఫార్మ్ హౌజ్‌ను రెంట్‌కు తీసుకుంటారు. అక్కడ ఉండేది వృద్ధ జంటే కదా.. వారేం చేస్తారులే అనుకుంటారు. అదే వాళ్లు చేసిన తప్పు.
ఆ ఇంట్లో ఉండే ముసలావిడకు వయసు అయిపోయినా కూడా శారీరికంగా కోరికలు మాత్రం పోవు. అదే సమయంలో వీరంతా వచ్చి అక్కడ షూట్ చేస్తున్న అడల్ట్ సినిమాను కళ్లారా చూస్తుంది. దాంతో మరోసారి తన కోరిక తీర్చడానికి కూడా ఎవరైనా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన తనకు వస్తుంది. కానీ వయసు సహకరించకపోవడంతో తన భర్త తన కోరికను తీర్చలేకపోతాడు. దీంతో సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా వచ్చిన యువకుడిని తన కోరిక తీర్చమని అడుగుతుంది. అతడు నిరాకరించడంతో కత్తితో పొడిచి మరీ దారుణంగా హత్య చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? మిగిలిన వారు తప్పించుకున్నారా లేదా? చివరికి ఆ వృద్ధ జంట ఏం చేసింది? అనేది తెరపై చూడాల్సిన ‘ఎక్స్’ కథ.
వెరైటీ విలన్స్..
‘ఎక్స్’లో మియా గోత్, బ్రిటనీ ఆనా స్నో, మార్టిన్ హెండర్సన్.. చాలా బోల్డ్‌గా నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. వృద్ధులుగా నటించిన నటీనటులు కూడా తమ యాక్టింగ్‌తో అందరినీ భయపెట్టారు. ఒక అడల్ట్ కంటెంట్ మూవీనే అయినా సినిమాలో తర్వాత ఏం జరుగుతుంది అనే థ్రిల్‌ను ఆడియన్స్ ఫీల్ అయ్యేలా చేశాడు దర్శకుడు టీ వెస్ట్. మామూలుగా సినిమాలో విలన్స్ అంటే పెద్ద పర్సనాలిటీతో అందరినీ భయపెట్టేలా ఉండాల్సిన అవసరం లేదని, ఒక వృద్ధ జంట కూడా ఒక్కొక్కసారి ప్రేక్షకులను భయపెట్టగలదని ‘ఎక్స్’తో నిరూపించాడు దర్శకుడు. ఇక ఈ అడల్ట్ కంటెంట్ మూవీని చూడాలనుకునే వారు అమెజాన్ ప్రైమ్‌లో దీనిని చూసేయొచ్చు.
Also Read: ఫ్రెండ్‌తో కోడలు ఎఫైర్ - అత్తను హత్యచేసి మామకు అడ్డంగా దొరికిపోతుంది, ఇక అన్నీ ట్విస్టులే!
Also Read: ‘ఫాల్‌ఔట్’ రివ్యూ - 219 ఏళ్ల తర్వాత భూమిపై ఏం జరగబోతుంది? గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరిస్ ఎలా ఉంది?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

