అన్వేషించండి

Fall Out Review: ‘ఫాల్‌ఔట్’ రివ్యూ - 219 ఏళ్ల తర్వాత భూమిపై ఏం జరగబోతుంది? గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సీరిస్ ఎలా ఉంది?

Fall Out Web Series Review: గేమ్ ఆధారంగా చాలా అరుదుగా వెబ్ సిరీస్‌లు అనేవి తెరకెక్కుతుంటాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి యాడ్ అయ్యింది ‘ఫాల్ ఔట్’. తాజాగా విడుదలయిన సిరీస్‌కు పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.

Fall Out Web Series Review In Telugu: పుస్తకాల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కడం కామన్. కానీ ఈ అమెరికన్ వెబ్ సిరీస్ మాత్రం ఏకంగా ఒక గేమ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి తెరకెక్కింది. అదే ‘ఫాల్ ఔట్’. ఇప్పటికే ఈ టైటిల్‌తో ఒక గేమ్ సిరీస్ ఉంది. అంతే కాకుండా కొన్నాళ్ల క్రితం ఇదే టైటిల్‌తో జాకీ చాన్.. ఒక మూవీని కూడా తీశారు. కానీ ఈ ‘ఫాల్ ఔట్’ మాత్రం డిఫరెంట్. భవిష్యత్తును అంచనా వేస్తూ అమెరికన్ మేకర్స్ తెరకెక్కించే సినిమాలు, వెబ్ సిరీస్‌లు చాలావరకు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయి. ‘ఫాల్ ఔట్’ కూడా ఆ తరహాదే. తాజాగా Netflixలో విడుదలయిన ‘ఫాల్ ఔట్’ ఫస్ట్ సీజన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కథ

‘ఫాల్ ఔట్’ కథ 2077లో ప్రారంభమవుతుంది. సిరీస్ మొదలవ్వగానే ఒక న్యూక్లియర్ పేలుడు సంభవిస్తుంది. ఈ పేలుడు వల్ల చాలామంది మరణిస్తారు. మిగిలిన వారంతా భూమి అండర్ గ్రౌండ్‌లో ఉండే వాల్ట్స్‌లోకి వెళ్లిపోతారు. అక్కడ రకరకాల వాల్ట్స్, వాటికి నెంబర్లు కూడా ఉంటాయి. ఇదంతా వాల్ట్ టెక్ కార్పొరేషన్ నిర్మిస్తుంది. భూమిపై న్యూక్లియర్ యుద్ధాల నుంచి ప్రాణాలు కాపాడుకున్న చాలామంది పైకి రాకుండా ఈ అండర్ గ్రౌండ్ వాల్ట్స్‌లోనే జీవనం కొనసాగిస్తుంటారు. అయితే, యుద్ధంలో తమ ప్రాణాలను కాపాడుకొనేందుకు ధనవంతుల కోసం భూమి అడుగున వాటిని నిర్మించారు. భూమిపై నిర్మించేవారికి ఇది ఇష్టం ఉండదు. దీంతో కొంతమంది చొరబాటుదారులు.. వాల్ట్‌లోకి ప్రవేశిస్తారు. వాల్ట్ 32లో ఉన్నవారిని హతమార్చుతారు. ఆ తర్వాత వాల్ట్ 33లో ఉన్నవారిని చంపి.. దాన్ని కూడా కైవసం చేసుకొనేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సందర్భంగా వాల్ట్ 32 సభ్యులుగా నాటకమాడుతారు.

ఈ సందర్భంగా వాల్ట్ 33లో ఉన్న లూసీ మ్యాక్లిన్ (ఎల్లా పూర్నెల్)ను పెళ్లి చేసుకుని.. రెండు వర్గాలు కలిసి బతుకుదామనే సందేశాన్నిఇస్తారు. ఇందుకు వాల్ట్ 33లోని సభ్యులు అంగీకరిస్తారు. వాల్ట్ 32లో ఉన్న వ్యక్తితో లూసీకి పెళ్లి చేస్తారు. ఫస్ట్ నైట్ పూర్తయిన తర్వాత.. అసలు విషయం బయటపడుతుంది. అయితే, అప్పటికే నష్టం జరిగిపోతుంది. వాల్ట్ 32 సభ్యుల ముసుగులో ఉన్న చొరబాటుదారులు.. వాల్ట్ 33 సభ్యులపై దాడి చేస్తారు. లూసీ, ఆమె తండ్రి వాళ్లపై తిరగబడతారు. ఇద్దరు కలిసి వరుడిని చంపేస్తారు. ఆ తర్వాత చొరబాటుదారులు లూసీ తండ్రిని ఎత్తుకెళ్లిపో్తారు. భూమిపై ఉన్న వారి స్థావరంలో బంధిస్తారు. తండ్రిని ఎలాగైనా తిరిగి వాల్ట్‌లోకి తీసుకొస్తానంటూ లూసీ బయల్దేరుతుంది అప్పటికే ఎన్నో న్యూక్లియర్ వార్స్ వల్ల భూమిపై రేడియేషన్‌ పెరిగిపోవడంతో మరెన్నో సమస్యలు మొదలవుతాయి. అలాంటి కష్టమైన పరిస్థితుల మధ్య లూసీ.. తన తండ్రిని వెతకడం మొదలుపెడుతుంది.

లూసీ.. తన తండ్రిని వెతికే ప్రయాణంలో మ్యాక్సిమస్ (ఆరోన్ క్లిఫ్టన్ మోటెన్), కూపర్ హావర్డ్ (వాల్టన్ గాగిన్స్) ఎదురవుతారు. ఈ సందర్భంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవల్సి వస్తుంది. వాల్ట్‌లో ఎంతో శాంతియుతంగా జీవిచిన లూసీ.. భూమిపై ఉన్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో తన తండ్రిని కలుసుకొనేందుకు ఒక సాహసోసేపతమైన అవకాశం వస్తుంది. మరి, మంచితనానికి మారుపేరైనా లూసీ అక్కడి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుంది. తన తండ్రిని ఎలా కలుస్తుంది? ఆమె తండ్రి గురించి ఎలాంటి నిజం తెలుస్తుంది. బాల్యంలోనే కనిపించకుండా పోయిన తల్లి ఆచూకీ ఎలా దొరుకుతుంది? ఇలా ఒకటేమిటీ.. మీకు ఓపిక ఉండాలేగానీ.. ప్రతి ఎపిసోడ్ ఉత్కతంఠభరితంగా నెక్ట్స్ ఏమిటీ అనే తరహాలో ఉంటుంది. మనుషులు తమ స్వర్థం కోసం ఎంత దారుణానికి పాల్పడతారనేది చివరికి అర్థమవుతుంది. కొన్ని సీన్లు భావోద్వేగానికి గురిచేస్తాయి.

Also Read: అమ్మాయిలను చంపే సైకో కిల్లర్‌కు ట్రాకర్ పెడితే? ఈ మూవీలో హీరోనే ఎక్కువ భయపెడతాడు

విశ్లేషణ

‘ఫాల్ ఔట్’ లాంటి ఫ్యూచర్ కథలతో ఇంగ్లీష్‌లో ఇదివరకే పలు వెబ్ సిరీస్‌లు వచ్చాయి. కానీ ఇది మాత్రం వాటికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో పెద్దగా యాక్షన్ ఉండదు. అవును.. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ అంటేనే ఎక్కువగా ఫైట్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ‘ఫాల్ ఔట్’ మాత్రం అలా కాదు. ఇందులో యాక్షన్ కంటే ఎక్కువగా డ్రామానే ఉంటుంది. న్యూక్లియర్ వార్ ఆగకపోతే భూమి పరిస్థితి ఏంటి? లూసీ తన తండ్రిని చేరుకునే మార్గం ఏంటి? అనే అంశాల చుట్టూ మంచి డ్రామాను క్రియేట్ చేశారు దర్శకులు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండగా.. కేవలం మొదటి ఎపిసోడ్, ఆఖరి ఎపిసోడ్‌లో మాత్రమే కాస్త యాక్షన్ ఉంటుంది. మిగతా సిరీస్ అంతా ఎక్కువగా ఎమోషన్స్‌పైనే నడుస్తుంది.

మామూలుగా ఒక ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లో డ్రామాను ప్రేక్షకులు ఎక్కువగా ఆశించరు కాబట్టి యాక్షన్ చూడాలనుకునే వారిని మాత్రం ‘ఫాల్ ఔట్’ కాస్త డిసప్పాయింట్ చేస్తుందనే చెప్పాలి. కానీ ట్విస్టుల విషయంలో మాత్రం ప్రేక్షకులు డిసప్పాయింట్ అవ్వరు. దిమ్మతిరిగే ట్విస్టులు ఉన్నాయని చెప్పలేం కానీ.. కథను ఇంట్రెస్టింగ్‌గా ముందుకు సాగించడం కోసం, తరువాతి ఎపిసోడ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం కావాల్సిన ట్విస్టులను అయితే యాడ్ చేశారు మేకర్స్. ‘ఫాల్ ఔట్’లో మరో హైలెట్ ఏంటంటే ఈ సిరీస్‌లో ఉన్నది ‘ ఎపిసోడ్లే అయినా.. దీనికోసం అయిదుగురు దర్శకులు పనిచేశారు. మెచ్చుకోతగిన విషయం ఏమిటంటే.. ఈ సీరిస్ ఒక విజువల్ వండర్. మీకు ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేస్తాయి. లాజిక్స్ వెతుక్కోకుండా చూడాలి.

వెబ్ సిరీస్‌లలో ఒక్కొక్క ఎపిసోడ్‌కు ఒక్కొక్క దర్శకుడు మారుతూ ఉన్నప్పుడు.. ముందు ఎపిసోడ్ తీసిన డైరెక్టర్ విజన్‌ను మ్యాచ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో మాత్రం ‘ఫాల్ ఔట్’ దర్శకులు వందశాతం సక్సెస్ అయ్యారు. ‘ఫాల్ ఔట్’లోని మొదటి మూడు ఎపిసోడ్లు.. క్రిస్టోఫర్ నోలన్ బ్రదర్ అయిన జోనథన్ నోలన్ డైరెక్ట్ చేశాడు. 4వ ఎపిసోడ్‌కు డ్యానియల్ గ్రే లాంగినో దర్శకత్వం వహించాడు. 5వ ఎపిసోడ్‌ను క్లేర్ కిల్నర్ డైరెక్ట్ చేయగా.. 6, 7 ఎపిసోడ్ల డైరెక్షన్ బాధ్యతను ఫ్రెడరిక్ ఈవో టోయ్ డైరెక్ట్ చేశాడు. చివరి ఎపిసోడ్‌కు వెయిన్ యిప్ దర్శకత్వం వహించాడు. ‘ఫాల్ ఔట్’లో ఎక్కువ పాజిటివ్‌గా నిలిచిన మరో అంశం ఎల్లా పర్నెల్ నటన. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగులో కూడా ‘ఫాల్ ఔట్’ అందుబాటులో ఉంది. తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్‌పై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు.

Also Read: ఆ కళ్లను ఇండియా, పాక్ బోర్డర్‌లో ఎందుకు పాతారు? మనుషులను ఆవహించే ఆ ‘రెడ్ ఐ’ని అడ్డుకొనేది ఎవరు? సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే మూవీ ఇది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TVK Vijay First Anniversary Speech in Telugu | ఒకడు ఫాసిజం..ఇంకోడు పాయసం..మాటల దాడి చేసిన విజయ్ | ABP DesamMS Dhoni Morse Code T Shirt Decoded | చెన్నై అడుగుపెట్టిన ధోని..ఊహించని షాక్ ఇచ్చాడు | ABP DesamSri Mukha Lingam  Temple History | శివుడు లింగం రూపంలో కాకుండా ముఖరూపంలో కనిపించే ఆలయం | ABP DesamTirumala Kshethra Palakudu Rudrudu Temple | కోనేటి రాయుడి క్షేత్రానికి కాపలా ఈయనే | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sri Reddy Arrest?: పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
పోసాని అరెస్ట్ తర్వాత టార్గెట్ శ్రీ రెడ్డి... బూతులకు తగిన మూల్యం చెల్లించక తప్పదా?
Telangana Latest News: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ సీఎం- మోదీతో కలిసి బీఆర్ఎస్‌పై కుట్రలు- కవిత సంచలన వ్యాఖ్యలు
Posani Krishan Murali Arrest: నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టుపై జగన్ స్పందన ఇదే!
Ram Pothineni: రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
రైటర్‌గా మారిన రామ్ పోతినేని... మహేష్ బాబు సినిమాలో లవ్ సాంగ్ రాసిన హ్యాండ్సమ్ హీరో
Yogi Adityanath Mahakumbh Mela Closing Ceremony: చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
చీపురు పట్టిన సీఎం .. ఊడ్చిపడేశారు!
Pawan Kalyan News: పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
పార్టీ ప్లీనరీ ముందు ఈ స్టేట్మెంట్ అవసరమా జనసేనానీ
Apsara OTT release: 'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
'అప్సర'తో ఆహా కొత్త ప్రయోగం... ఈ టీజర్ చూశారా ? వర్టికల్ వెబ్ సిరీస్ అంటే ఏంటో తెలుసా?
Maha Kumbh 2025:  మహా కుంభమేళా ఆఖరి రోజు  ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
మహా కుంభమేళా ఆఖరి రోజు ప్రయాగరాజ్ లో సందడి చూశారా!
Embed widget