Citadel Honey Bunny: 'సిటాడెల్'లో సమంత అన్నయ్యగా తెలుగు హీరో - ఎవరీ యష్ పూరి? ఏం చేశాడో తెలుసా?
Yash Puri In Citadel Honey Bunny: సమంత లేటెస్ట్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బన్నీ'లో ఆమెకు అన్నయ్యగా నటించినది తెలుగు హీరో అని తెలుసా? అతను ఏయే సినిమాలు చేశారో తెలుసా?
Who Is Yash Puri: ఇతడిని ఎక్కడో చూసినట్టు ఉందే! - సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన 'సిటాడెల్: హనీ బన్నీ' (Citadel Honey Bunny) చూశాక చాలా మంది తెలుగు వీక్షకుల్లో మెదిలిన ఆలోచన. ఎవరీ యష్ పూరి? ఆ కథ ఏమిటి? అనేది చూస్తే...
సమంత అన్నయ్యగా నటించిన యాక్టర్ ఎవరు?
'సిటాడెల్: హనీ బన్నీ' చూస్తే... తెలుగు ఆడియన్స్ ఒక్క విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతారు. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌లో తెలుగు అమ్మాయిగా సమంత కనిపించారు. అదీ ఓ రాజ కుటుంబానికి చెందిన రాణిగా! రాజ మహల్‌కు వెళ్లిన సన్నివేశాల్లో తెలుగు మాట్లాడుతుంది సమంత. అక్కడ ఆమెకు అన్నయ్యగా కనిపించిన నటుడు ఎవరో గుర్తు పట్టారా?
Also Read: బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్... నెట్టింట వీడియో వైరల్
View this post on Instagram
సమంతకు అన్నయ్యగా, ప్రతాప రుద్ర పాత్రలో నటించిన అబ్బాయి పేరు యష్ పూరి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో. ఆయన మూడు సినిమాలు చేశారు. గత ఏడాది 'హ్యాపీ ఎండింగ్' అని ఓ సినిమా వచ్చింది. 'టాక్సీవాలా' ఫేమ్ విష్ణు ఓయ్ కూడా నటించారు. ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమా అది. అంతకు ముందు 'చెప్పాలని ఉంది' అని మరో సినిమా చేశారు.
'చెప్పాలని ఉంది'లో సునీల్, సత్య నటించారు. అందులో కథానుగుణంగా కొన్ని సన్నివేశాల్లో జిబ్రిష్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించారు యష్ పూరి. అంతకు ముందు 'అలాంటి సిత్రాలు' అని ఇంకో సినిమా చేశారు. ఇప్పుడు 'సిటాడెల్: హనీ బన్నీ'తో నేషనల్, ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లారు. అందులో యష్ పూరి కనిపించేది కొంత సేపే అయినప్పటికీ... కీలక సన్నివేశాల్లో ఉన్నారు. సెటిల్డ్ పెర్ఫార్మన్స్ చేశారు. లాస్ట్ ఎపిసోడ్ యాక్షన్ సీక్వెన్సులకు ముందు సమంత కుమార్తెను కాపాడటం కోసం తీసుకువెళ్లే సీన్ ఆడియన్స్ అందరికీ రిజిస్టర్ అవుతుంది. మరి, సీజన్ 2లో అతని పాత్ర ఎలా ఉంటుందో చూడాలి.
'సిటాడెల్'లో సౌత్ యాక్టర్లు ఉన్నారండోయ్!
యష్ పూరి ఒక్కరే కాదు... 'సిటాడెల్: హనీ బన్నీ'లో కొంత మంది సౌత్ యాక్టర్లు కూడా ఉన్నారు. సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ కీలక పాత్రలో తనదైన సీరియస్ నటనతో ఆకట్టుకున్నారు. తమిళనాడు, డబ్బింగ్ సినిమాల ద్వారా పరిచయమైన తలైవాసల్ విజయ్ అయితే డాక్టర్ రఘు అని కథను మలుపు తిప్పే పాత్రలో నటించారు.