News
News
వీడియోలు ఆటలు
X

నేరుగా ఓటీటీలోకి విజయ్ సేతుపతి ఫస్ట్ బాలీవుడ్ మూవీ - తెలుగులోనూ చూడొచ్చు!

కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన మొదటి హిందీ సినిమా 'ముంబైకర్' ఎట్టకేలకు నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది.

FOLLOW US: 
Share:

విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ప్రస్తుతం సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. అయితే హిందీలో విజయ్ సేతుపతి నటించిన మొదటి సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే దక్షిణాదిలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి ఇప్పుడు హిందీలో 'ముంబైకర్' అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇస్తున్నాడు. అయితే ఈ సినిమాని థియేటర్స్ లో కాకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. నిజానికి గత కొన్ని నెలలుగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా నేరుగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్రముఖ ఓటీటీ మాధ్యమం ‘జియో సినిమా’ (Jio Cinema)లో జూన్ 2వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తూ ఓ టీజర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

ఇక ఇటీజర్ లో విజయ్ సేతుపతి ఓ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తున్నాడు. అంతేకాదు టీజర్ లో ఓ చిన్నారిని అతడు కిడ్నాప్ చేయడం మనం చూడొచ్చు. ఇక ఆ చిన్నారి ముంబైలోనే ఓ డాన్ కొడుకు కావడం మెయిన్ ట్విస్ట్. ఇక టీజర్ మొత్తం ఆ కిడ్నాప్ చుట్టే తిరిగింది. ఇక టీజర్ లో విజయ్ సేతుపతి హిందీ మాట్లాడే తీరు కూడా చాలా గమ్మత్తుగా నవ్వు తెప్పిస్తోంది. ప్రముఖ DOP సంతోష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్రాంత్ మస్సీ, తాన్య మాణిక్ తల, రాఘవ్ బిర్నాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకి కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ స్క్రిప్ట్ అందించడం విశేషం. హెచ్ ఆర్ పిక్చర్స్, జియో స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అమృతే మరియు రామ్ సురేందర్ సంగీతం అందించారు. ఇక జూన్ 2న జియో సినిమాలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు, తమిళంలోనూ అందుబాటులో ఉండనుంది.

ఇక ఇటీవల బాలీవుడ్ లో 'ఫర్జీ' అనే వెబ్ సిరీస్ తో విజయ్ సేతుపతి హిందీ మార్కెట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్ అగ్ర హీరో షాహిద్ కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్ లో విజయసేతుపతి ఇంటలిజెన్స్ ఆఫీసర్ గా అద్భుతమైన నటనను కనబరిచాడు. 'ఫ్యామిలీ మెన్' వెబ్ సిరీస్ ని డైరెక్ట్ చేసిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ కి అనూహ్య స్పందన లభించింది. ఇక ఈ వెబ్ సిరీస్ కి కొనసాగింపుగా సీజన్ 2 కూడా త్వరలోనే రాబోతోంది. ఫర్జీ వెబ్ సిరీస్ తో హిందీలో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతికి ఈ 'ముంబైకర్' అనే చిత్రం ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ, షారుక్ ఖాన్ కాంబినేషన్ లో రూపొందుతున్న 'జవాన్' సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతోపాటు కత్రినా కైఫ్ తో కలిసి 'మేరి క్రిస్మస్' అనే సినిమా చేస్తున్నాడు.

Published at : 25 May 2023 07:57 PM (IST) Tags: Vijay Sethupathi Vijay Sethupathi Mumbaikar Movie Mumbaikar Movie OTT Release Vijay Sethupathi Bollywood Debut Movie Mumbaikar

సంబంధిత కథనాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

మంచువారి రూ.100 కోట్ల సినిమా, మెగా ఇంట పెళ్లి భాజాలు - ఇంకా మరెన్నో సినీ విశేషాలు

Pareshan Movie OTT Platform : తిరువీర్ 'పరేషాన్' - నయా తెలంగాణ సినిమా ఏ ఓటీటీలో వస్తుందంటే?

Pareshan Movie OTT Platform : తిరువీర్ 'పరేషాన్' - నయా తెలంగాణ సినిమా ఏ ఓటీటీలో వస్తుందంటే?

టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు మూవీ విశేషాలివే!

టాప్-5 ఎంటర్‌టైన్మెంట్ న్యూస్ - ఈ రోజు మూవీ విశేషాలివే!

Samantha: ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!

Samantha: ప్రియాంక చోప్రాకు తల్లిగా సమంత, ఇవిగో ఆధారాలు!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

మాస్‌ లుక్‌లో మహేష్, ప్రభాస్‌‌తో కమల్ ఢీ? - నేటి టాప్ 5 సినీ విశేషాలివే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు