అన్వేషించండి

Veerabhadruni Rahasyam Series Trailer : వీరభద్రపురంలో గంట మోగిందా? - థ్రిల్లర్ సిరీస్ వీరభద్రుని రహస్యం ట్రైలర్ రివ్యూ... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

Veerabhadruni Rahasyam Trailer Review : ఫేమస్ సీరియల్ మర్మదేశం వరల్డ్ నుంచి సరికొత్తగా రాబోతోంది వీరభద్రుని రహస్యం సిరీస్. తాజా ట్రైలర్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 1990ల మర్మదేశం ప్రపంచం నుండి వీరభద్రుని రహస్యం ట్రైలర్ విడుదల.
  • వీరభద్రపురం గ్రామంలో శిక్షలు, హత్యల వెనుక రహస్యం కథాంశం.
  • హారర్ థ్రిల్లర్ సిరీస్ జులై 3న ZEE5లో ప్రసారం.

Horror Thriller Series Veerabhadruni Rahasyam Series Trailer : 1990s ఫేం మర్మదేశం వరల్డ్ నుంచి సీక్వెల్ వీరభద్రుని రహస్యం (Veera Bhadruni Rahasyam) రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటి జనరేషన్‌కు అప్పటి తరాన్ని భయపెట్టిన కథను మరింత థ్రిల్లింగ్‌గా చూపించనున్నారు. తాజాగా కొత్త సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.

ధర్మ గంట మోగితే...

తప్పు చేస్తే వీరభద్రుడు శిక్షిస్తాడు... అనే నమ్మకం ఉన్న ఊరితో ముడిపడిన కథే ఈ వీరభద్రుని రహస్యం. తాజా ట్రైలర్ సిరీస్‌పై మరింత హైప్ పెంచేసింది. 'కొన్ని కోట్ల ఏళ్ల క్రితం విశ్వం పుట్టడానికి కారణమైన బిగ్ బ్యాంగ్ థియరీ నుంచి భూమ్మీద పుట్టిన మొదటి జీవం వరకూ అన్నీ యాక్సిడెంట్సే...' అంటూ ఓ ప్రొఫెసర్ చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ట్రైలర్... మరి దేవుడి సంగతేంటి? అనే ప్రశ్నకు సమాధానాన్ని వెతికే కథతో సాగుతుంది.

'వీరభద్రపురం' అనే ఊరిలో చెట్టు కింద ఉన్న వీరభద్రుడి గుడి చాలా పవర్ ఫుల్. తప్పు చేసిన వాడిని వీరభద్రుడు కచ్చితంగా శిక్షిస్తాడు అనేది అక్కడి ప్రజల నమ్మకం. తప్పు చేసిన వాడిని చంపేశాక వీరభద్రుడే గంట మోగిస్తాడని నమ్ముతుంటారు. అసలు ఆ ఊరిలో జరిగేది ఏంటి? వీరభద్రుడి పేరుతో ఎవరైనా హత్యలు చేస్తున్నారా? ఊరిలో పెద్ద మనిషికి వీరభద్రుడి గుడికి ఉన్న సంబంధం ఏంటి? రహస్యం ఛేదించాలనుకునే వారికి జరిగింది ఏంటి? అనేది తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

Also Read : Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?

ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?

ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ZEE5లో జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మొత్తం 60 ఎపిసోడ్స్‌తో రూపొందించిన సిరీస్ ఓ లాంగ్ ఫార్మ్ మిస్టరీగా ఒక్కో ఎపిసోడ్ రహస్యాలను రివీల్ చేస్తూ, ట్విస్టులు బయటపెడుతూ ముందుకు సాగుతుంది. ఈ సిరీస్‌కు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించగా... వెన్నెల పాత్రలో అన్నీ, యోగానందగా రఘు కుంచె, కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీష, అనురాధ, బాలచంద్ర, కల్కి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తొలుత రెండు ఎపిసోడ్స్‌తో ప్రారంభమై ఆ తర్వాత వారం వారం రెండు కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Also Read : Venkatesh Maha : నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

వీరభద్రుని రహస్యం సిరీస్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలవుతుంది?

“వీరభద్రుని రహస్యం” సిరీస్ ప్రముఖ ఓటీటీ ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. జులై 3 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది.

ఈ సిరీస్‌లో మొత్తం ఎన్ని ఎపిసోడ్‌లు ఉంటాయి?

ఈ సిరీస్‌ను మొత్తం 60 ఎపిసోడ్‌లతో రూపొందించారు. ఇది లాంగ్ ఫార్మ్ మిస్టరీగా ఒక్కో వారం రెండు కొత్త ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతాయి.

వీరభద్రుని రహస్యం సిరీస్‌కు దర్శకత్వం వహించినది ఎవరు?

ఈ సిరీస్‌కు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించారు. అన్నీ, రఘు కుంచె, రఘు వంటి నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

వీరభద్రుని రహస్యం సిరీస్ కథాంశం ఏమిటి?

ఈ సిరీస్ వీరభద్రుని గుడి, తప్పు చేసినవారిని శిక్షించే నమ్మకం ఉన్న వీరభద్రపురం అనే గ్రామం చుట్టూ తిరుగుతుంది. గ్రామంలో జరిగే హత్యలు, రహస్యాల ఛేదన దీని కథాంశం.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jana Nayakudu OTT: జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
జన నాయకుడు ఓటీటీ రిలీజ్ డేట్... అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన జీ5 ఓటీటీ
Crime Thriller OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ - వరల్డ్ వైడ్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Husharu Pittalu OTT : ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
ఆ ఓటీటీలోకి హుషారు పిట్టలు - రొమాంటిక్ కామెడీ మూవీ ఎప్పుడు, ఎందులో చూడొచ్చంటే?
This Week OTT Movies : ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీల్లో ట్రెండింగ్ మూవీస్ - ఒకే రోజు 5 సినిమాలు... ఇవి డోంట్ మిస్
Advertisement

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Embed widget