అన్వేషించండి

Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?

Varanasi Story : దర్శకధీరుడు రాజమౌళి అప్‌కమింగ్ విజువల్ వండర్ వారణాసి స్టోరీ లీక్ చేశారు. ఇప్పటివరకూ ఎవరూ ఊహించని ఓ విషయం చెప్పడంతో అంచనాలు మించిపోయాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • రాజమౌళి 'వారణాసి' కథాంశాన్ని లీక్ చేస్తూ అంచనాలు పెంచారు.
  • తండ్రి కొడుకుల బలమైన ఎమోషనే సినిమాకు మూలమని తెలిపారు.
  • ఆఫ్రికా అడవులు, రామాయణం, విపత్తులు, ఫాంటసీ అంశాలుంటాయి.
  • సెప్టెంబర్ చివరినాటికి షూటింగ్ పూర్తై ఏప్రిల్ 7న విడుదల.

Rajamouli About Mahesh Babu Varanasi Story : వారణాసి... మహేశ్ బాబు హీరోగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న విజువల్ వండర్. ఫస్ట్ గ్లింప్స్‌తోనే హాలీవుడ్ రేంజ్ హైప్ క్రియేట్ కాగా... ఈ మూవీ స్టోరీపై గతంలో సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వచ్చాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా మూవీ కథలో ఓ పార్ట్‌ను లీక్ చేశారు. కుంభకర్ణుడు, శ్రీరాముడి మధ్య వార్ జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు స్వయంగా జక్కన్నే వారణాసి అసలు స్టోరీని లీక్ చేశారు.  

అసలేంటీ వారణాసి?

ప్రస్తుతం రాజమౌళి ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఆన్సీ ఇంటర్నేషనల్ యానిమేషన్ ఫెస్టివల్‌లో వారణాసి గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ షేర్ చేసుకుంటున్నారు. తాజాగా... వారణాసి స్టోరీ గురించి ఆయన ఇచ్చిన లీక్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎవరూ ఊహించని ఓ ప్లాట్‌ను చెప్పడంతో అంచనాలు పదింతలు కాదు అంతకు మించి అనేలా ఉన్నాయి.

'వారణాసి' భారీ యాక్షన్ అడ్వెంచర్ అని అనుకుంటున్నప్పటికీ... సినిమాలో ఎమోషనల్ మూమెంట్ మూలం అని రివీల్ చేశారు జక్కన్న. 'సినిమాలో మీరు ఆఫ్రికా దట్టమైన అడవుల వన్యతను ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అంటార్కిటికాలో చలిని, మంచును అనుభూతి చెందుతారు. రామాయణంలోని దేవుళ్లను చూస్తారు. ప్రకృతి విపత్తులను చూస్తారు. అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్ని ఉన్నా దీనికి మూలం మాత్రం భారతీయల ఆత్మ లాంటి ఎమోషనే. తండ్రీ కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ నుంచే ఇవన్నీ వస్తాయి.' అంటూ రివీల్ చేశారు.

Also Read : Dil Raju : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ఫ్లాప్‌ - రివ్యూస్‌తో సినిమాలకు లాస్... దిల్ రాజు రియాక్షన్

తండ్రి ఎవరు?

తండ్రీ కొడుకుల మధ్య సాగే బలమైన ఎమోషన్ అని రాజమౌళి రివీల్ చేయగానే... మహేశ్ బాబుకు తండ్రిగా నటించింది ఎవరు? అనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మూవీలో ప్రకాశ్ రాజ్ కూడా నటిస్తున్నట్లు అప్పట్లో కన్ఫర్మ్ చేశారు. అయితే, తాను శివ భక్తుడిగా నటిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈయనే తండ్రి రోల్ చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దూకుడులో ప్రకాశ్ రాజ్, మహేశ్ తండ్రీ కొడుకులుగా నటించారు. ఈ మూవీలోనూ ప్రకాశ్ రాజే తండ్రి అయి ఉంటాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

రాజమౌళి మెయిన్ స్టోరీ రివీల్ చేయడంతో మహేశ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ గ్లోబల్ స్టార్ కావడం ఖాయమంటూ పోస్టులు పెడుతున్నారు. సెప్టెంబర్ లాస్ట్ వీక్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో మూవీ షూటింగ్ పూర్తవుతుందని రాజమౌళి చెప్పారు. సినిమాల క్లిష్టమైన, మెయిన్ సీన్స్ షూటింగ్ పార్ట్ అంతా కంప్లీట్ అయ్యిందని తెలిపారు. 

సినిమాలో మహేశ్ బాబు రుద్రుడిగా, శ్రీరాముడిగా నటిస్తున్నారు. మందాకినిగా ప్రియాంక చోప్రా, విలన్ రణకుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా... దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 7న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Sambarala Yeti Gattu: సాయి దుర్గా తేజ్ SYGలో బాలీవుడ్ టాప్ స్టార్... రిలీజ్ అప్డేట్ ఇచ్చిన టీమ్

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Frequently Asked Questions

'వారణాసి' సినిమా కథాంశం ఏమిటి?

రాజమౌళి ప్రకారం, 'వారణాసి' భారీ యాక్షన్ అడ్వెంచర్ అయినప్పటికీ, తండ్రీ కొడుకుల మధ్య బలమైన ఎమోషనే దీనికి మూలం. ఇది భారతీయ ఆత్మ వంటి భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది.

'వారణాసి' సినిమాలో ప్రధాన నటీనటులు ఎవరు?

ఈ చిత్రంలో మహేశ్ బాబు రుద్రుడు, శ్రీరాముడిగా నటిస్తున్నారు. ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ రణకుంభగా కనిపించనున్నారు.

'వారణాసి' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'వారణాసి' చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

'వారణాసి' సినిమాలో ఎలాంటి అంశాలు ఉంటాయి?

సినిమాలో ఆఫ్రికా అడవులు, అంటార్కిటికా చలి, రామాయణ దేవుళ్లు, ప్రకృతి విపత్తులు, అద్భుతమైన ఫాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయి. వీటన్నింటికీ మూలం తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Polimera 3 : పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
పొలిమేర 3లో యాక్షన్ కింగ్ ఎంట్రీ - హారర్ థ్రిల్లర్‌లో ఆయన రోల్ ఏంటి?
Dhanush : ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మా? - రాయన్ నేషనల్ అవార్డ్ To పాలిటిక్స్... కోలీవుడ్ స్టార్ రియాక్షన్
ధనుష్ పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మా? - రాయన్ నేషనల్ అవార్డ్ To పాలిటిక్స్... కోలీవుడ్ స్టార్ రియాక్షన్
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
ఈ వారం ఓటీటీ మూవీస్... ఈ 6 సినిమాలు డోంట్ మిస్ - ఏయే తేదీల్లో ఏ సినిమాలు స్ట్రీమింగ్ అంటే?
Jana Nayagan Collections: 'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
'జన నాయకన్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లు... ఆదివారం విజయ్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?
Advertisement

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Legal Notice Strategy on Revanth Reddy: కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
కేటీఆర్ లీగల్ నోటీసుల వ్యూహం తప్పా? రేవంత్ ఆరోపణలపై ఫీల్డ్‌లో కాకుండా కోర్టుల్లో యుద్ధమా?
Joint Stiffness : కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
కీళ్ల నొప్పి, బిగుతు తగ్గాలంటే ఈ 10 సూపర్ ఫుడ్స్ తినేయండి.. నిపుణుల సూచనలు ఇవే
Gen Z Protest: భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
భారత్‌ కనుక లాఠీఛార్జ్.. విదేశాల్లో అయితే కాల్చి పడేసేవాళ్లు: సీజేపీ ఆందోళనపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
Monsoon Laundry Hacks : వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఈ చిట్కాలు పాటించండి.. దుర్వాసన కూడా రాదు
Vandemataram 150 Years: వందేమాతరానికి  
వందేమాతరానికి  "అక్షరాంజలి".. 150 ఏళ్ల గీతానికి జీవం పోస్తున్న బాలిక 
India Gold Medal: కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
కామన్వెల్త్ గేమ్స్ 2026లో భారత్ కు తొలి స్వర్ణం.. చరిత్ర సృష్టించిన మీరాబాయి చాను
Adilabad Airport News: ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
ఆదిలాబాద్ ఎయిర్ పోర్టుకు రూ.2,278.14 కోట్ల నిధుల మంజూరు.. సర్కార్ జీవో విడుదల
Peddi Sudarshan Reddy Cardiac Arrest: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి కార్డియాక్ అరెస్ట్.. మెడికల్ మిరాకిల్‌తో నిలిచిన ప్రాణం
Embed widget