అన్వేషించండి

Venkatesh Maha : నేను మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ మూవీస్ గురించి - KGF కాంట్రవర్సీపై డైరెక్టర్ వెంకటేశ్ క్లారిటీ

Venkatesh Maha Reaction : తాను కమర్షియల్ సినిమాలను ఎప్పుడూ విమర్శించలేదని క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ వెంకటేశ్ మహా. మూడేళ్ల క్రితం తాను చేసిన కామెంట్స్‌ది ఎడిటింగ్ ట్రాక్ అని చెప్పారు.

Venkatesh Maha Clarity About Old Comments On Commercial Movies : 'కేరాఫ్ కంచరపాలెం' మూవీతో తనకంటూ ఇండస్ట్రీలో ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ వెంకటేశ్ మహా. ఆ తర్వాత 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో డిఫరెంట్ జానర్‌లో ఆడియన్స్‌ను మెప్పించారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు సత్యదేవ్ హీరోగా రావు బహదూర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో... తాను అప్పట్లో KGFని విమర్శించానంటూ జరిగిన ప్రచారంపై క్లారిటీ ఇచ్చారు. 

'ది ఎడిటింగ్ ట్రాక్'

తాను ఎప్పుడూ ఏ సినిమాను కూడా విమర్శించలేదని... అది ఎడిటింగ్ ట్రాక్ అని చెప్పారు వెంకటేశ్ మహా. 'ఆ రోజు నేను మాట్లాడింది ఓ కమర్షియల్ సినిమా గురించి కాదు. దాన్ని కట్ చేసి కొందరు ఎడిట్ చేశారు. నేను ఆ రోజు మాట్లాడింది అల్ట్రా వయలెన్స్ ఫిల్మ్స్ గురించి. కమర్షియల్ సినిమా గురించి నేను మాట్లాడినప్పుడు ఎండింగ్‌లో నేను మాట్లాడింది కట్ చేసేశారు. నేను కమర్షియల్ సినిమాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే అల్ట్రా వయలెన్స్ సినిమాలను మాత్రం ప్రోత్సహించను.

మాకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము అలాంటి సినిమాలు తీయమని చెప్పా. నేను ఆ రోజు మాట్లాడింది పూర్తిగా వేరు. కానీ ఎడిటింగ్ ట్రాక్‌తో మొత్తం మార్చేశారు. అది తెలీక నా ఫ్రెండ్స్, సన్నిహితులు వారి వారి భావాలు చెప్పారు.' అని క్లారిటీ ఇచ్చారు.

Also Read : Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?

అసలేంటీ కాంట్రవర్సీ కామెంట్స్?

మూడేళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకటేశ్ మహా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తమలాంటి దర్శకులు అభ్యుదయ భావాలను పక్కన పెట్టి సినిమాలు తీస్తే అంతకంటే గొప్ప సినిమాలు తీయగలమని ఇండైరెక్ట్‌గా KGFపై విమర్శలు చేశారు. 'మేము విలువలతో కూడిన సినిమాలు తీస్తున్నాం. అలాంటి సినిమాలను కొందరు డీగ్రేడ్ చేస్తూ ఓటీటీ సినిమాలని అంటున్నారు.' అని అన్నారు. సినిమా పేరు చెప్పకుండానే స్టోరీ చెబుతూ డీకోడ్ చేశారు.

ఓ సినిమాలో హీరో తల్లి కొడుకుని గొప్ప కావాలని చెబుతుందని... తాను బంగారం తెస్తానని ఆ కొడుకు ఆమెకు మాటిస్తాడని అన్నారు. బంగారం తవ్వే వాళ్ల వద్దకు వెళ్లి వారిని ఉద్ధరించి వారి కోసం ఇళ్లు కట్టి... ఆ బంగారం మొత్తం ఓ చోట పడేస్తాడు. అలాంటి గొప్పవాడు అవ్వమని తల్లి చెప్పడం... అది గొప్ప సినిమా అని జనాలు ఎగబడి చూడడం అంటూ అప్పట్లో వెంకటేశ్ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సాగింది. రెండే సినిమాలు తీసి పెద్ద స్టార్స్, డైరెక్టర్స్ స్టోరీస్‌ను విమర్శించడం ఏంటంటూ విమర్శలు చేశారు. దీంతో ఆయన తర్వాత దానిపై వివరణ ఇచ్చారు. తాజాగా మళ్లీ క్లారిటీగా చెప్పారు.

Also Read : Rao Bahadur Review : ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు - రావు బహదూర్‌పై సుకుమార్ రివ్యూ

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget