అన్వేషించండి

Rao Bahadur Review : ఇండియన్ సినిమా హిస్టరీలో ఇలాంటి సినిమా రాలేదు - రావు బహదూర్‌పై సుకుమార్ రివ్యూ

Rao Bahadur First Review : సత్యదేవ్ రావు బహదూర్‌పై స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు. సత్యదేవ్‌కు ఈ మూవీ గొప్ప గిఫ్ట్ అని అన్నారు.

Satyadev's Rao Bahadur First Review : యంగ్ హీరో సత్యదేవ్ హీరోగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ వెంకటేశ్ మహా దర్శకత్వంలో రాబోతోన్న సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా రావు బహదూర్. ఇప్పటికే రిలీజైన టీజర్ భారీ హైప్ క్రియేట్ చేస్తుండగా... జులై 3న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా చూసి ప్రశంసలు కురిపించగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తాజాగా రావు బహదూర్ చూసి రివ్యూ ఇచ్చారు.

'అసూయ పడే పాత్ర'

భారతీయ చిత్ర సీమలో ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదని చెప్పారు సుకుమార్. మూవీ టీంతో కలిసి సినిమా చూసిన ఆయన... డైరెక్టర్ వెంకటేశ్ మహా, హీరో సత్యదేవ్‌పై ప్రశంసలు కురిపించారు. 'రావు బహదూర్ సత్యకు ఓ గొప్ప గిఫ్ట్. ఏ యాక్టర్‌కు ఇంతలా ఇన్ని వేరియేషన్స్‌లో నటించే ఛాన్స్ లభించదు. ప్రతీ నటుడు అసూయపడే పాత్ర. భారతీయ చిత్రసీమలో ఇంతకు ముందు ఇలాంటి సినిమా ఎప్పుడూ రాలేదు. వెంకటేశ్ మహా ఎక్కువ టైం తీసుకున్నప్పటికీ ఫైనల్‌గా సక్సెస్ సాధించారు.

ప్రతీ విభాగం బెస్ట్‌గా పని చేసింది. వెండితెరపై ఇలాంటి కథను తీసుకురావడం చాలా కష్టమైన పని. సినిమా చూస్తున్నంత సేపు నేను లీనమైపోయా. నన్ను మైమరిపించింది. ఇలాంటి చిత్రాన్ని నిర్మించిన అనురాగ్ గొప్పవాడు. ఆయనకు ఈ స్టోరీ ఎలా అర్థమైందో నాకు తెలీదు. ఆయన లాంటి నిర్మాత దొరకడం వెంకటేశ్ అదృష్టం.' అని చెప్పారు.

Also Read : Varanasi Plot : వారణాసి స్టోరీ లీక్ - ఈ ప్లాట్ అస్సలు ఊహించలేదు... రాజమౌళి చెప్పిన సీక్రెట్స్ ఏంటంటే?

మహేశ్ బాబు రివ్యూ

రావు బహదూర్ సినిమా చూసిన మహేశ్ బాబు రెండు రోజుల క్రితం ట్విట్టర్ వేదికగా రివ్యూ ఇచ్చారు. 'వెంకటేశ్ మహా అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. సత్యదేవ్ ఆ ప్రపంచాన్ని తనదైన శైలిలో తన ఆధీనంలోకి తీసుకున్నారు. హీరోయిన్ దీపా థామస్ కూడా ఎంతో అద్భుతంగా నటించారు. మూవీ టీం మొత్తానికి చాలా గర్వంగా ఉంది. టెక్నికల్ టీం శ్రమ ఈ  సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆడియన్స్ ఈ కొత్త తరహా ఎక్స్‌పీరియన్స్‌ను థియేటర్లలో తప్పకుండా ఆస్వాదిస్తారు.' అంటూ రాసుకొచ్చారు.

ఈ మూవీలో సత్యదేవ్‌తో పాటు దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక, మాస్టర్ కిరణ్ కీలకపాత్రలు పోషించారు. సినిమాను మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్‌ల GMB ఎంటర్టైన్మెంట్ సమర్పణలో A+S మూవీస్, శ్రీచక్ర ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా... చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మిస్తున్నారు.

Also Read : Divija Prabhakar: ‌హీరోయిన్‌గా బుల్లితెర మెగాస్టార్ కూతురు... పవన్ సూపర్ హిట్ సాంగ్ టైటిల్‌తో సినిమా!

NOTE : మరిన్ని సినిమా వార్తలు, గాసిప్స్, ఓటీటీ అప్డేట్స్, వెబ్ సిరీస్‌లు, టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ లేటెస్ట్ సోషల్ మీడియా అప్డేట్స్, టీవీ సీరియల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham: 'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?
'జగమే సంగీతం' సిరీస్‌కు చిరంజీవి రివ్యూ... ప్రకాష్ రాజ్ గురించి ఏం చెప్పారంటే?
Sree Vishnu: అమీర్‌పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్
అమీర్‌పేట్‌ ఛాలెంజ్‌లు వద్దు... బట్టలు విప్పొద్దు... పబ్లిసిటీ రాయుళ్ళకు శ్రీవిష్ణు కౌంటర్
Bigg Boss Telugu 10 : గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
గెట్ రెడీ ఫర్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 - లాంచింగ్ ఎపిసోడ్ ముఖ్య అతిథిగా సర్దార్
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
Advertisement

వీడియోలు

Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం
Parvathipuram Manyam Jiyyammavalasa Pandulavanivalsa PVTG Gadaba Tribe Neglect | పేరుకే గ్రామం.. మౌలిక సదుపాయాలకు ఆమడ దూరం
BCCI Devajit Saikia On Indian Players | బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సంచలన వ్యాఖ్యలు
Gundenininda Gudigantalu Serial September 5 | రోహిణి మైండ్ గేమ్‌తో రివర్స్ అయిన ప్రభావతి
Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: రోడ్లపై ధర్నాలొద్దు, సమస్యలు తీర్చేందుకు 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
రోడ్లపై ధర్నాలు వద్దు.. సమస్యలు తీర్చడానికి 2 ఏళ్లు టైమ్ ఇవ్వండి: టీచర్లకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి
Mahesh Kumar Goud On Cabinet: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లే.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు
Jammu Kashmir Encounter: జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
జమ్మూ కశ్మీర్‌లో లష్కర్ కమాండర్ ఎన్ కౌంటర్.. నిఘా పెట్టి మట్టుబెట్టిన భద్రతా బలగాలు
Adilabad Road Accident: లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
లారీ, ట్యాంకర్ ఢీ.. NH-44పై 10 కి.మీ మేర భారీగా ట్రాఫిక్ జామ్.. ప్రత్యామ్నాయ మార్గాలివే
Singer Jhansi : బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
బిగ్ బాస్ హౌస్‍‌లోకి రైతు బిడ్డ సింగర్ ఝాన్సీ - అగ్నిపరీక్ష నుంచి డైరెక్ట్ హౌస్‍‌లోకి... బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా?
CM Chandrababu: 'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
'సీఈవో సీఎం'గా కాదు నీళ్లిచ్చిన నాయకుడిలా.. సీఎం చంద్రబాబు ఆసక్తికర పోస్ట్
Vijayasai Reddy Politics: విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన... రాజకీయ పార్టీపై ఈ నెల 7న ముహూర్తం ఫిక్స్
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
10 ఎయిర్ బ్యాగ్స్, 7 సీటర్ Kia Sorento లోన్ ద్వారా తీసుకుంటే EMI ఎంత చెల్లించాలి
Embed widget