Uthutha Herolu OTT : ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - చిన్న సినిమా... ఐఎండీబీలో 8.1 రేటింగ్
Uthutha Herolu OTT Platform : లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఉత్తుత్తి హీరోలు ఓటీటీలోకి వచ్చేసింది. ఫిబ్రవరి 27న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఐఎండీబీలో 8.1 రేటింగ్ సాధించింది.

Mahesh Vitta's Uthutha Herolu OTT : యూట్యూబ్‌లో కెరీర్ ప్రారంభించి బిగ్ బాస్ ఎంట్రీతో తనకంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు కమెడియన్ మహేశ్ విట్టా. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మూవీ ఉత్తుత్త హీరోలు. ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా... మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకున్నా... ఐఎండీబీ రేటింగ్ మాత్రం 8.1 సాధించింది. రిలీజైన కొన్ని ప్రాంతాల్లోనూ ఊహించని రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఈటీవీ విన్ సొంతం చేసుకోగా... శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మహేశ్ విట్టా సరసన ప్రవీణ సోనీ హీరోయిన్‌గా నటించారు. హర్ష కొడాలి దర్శకత్వం వహించగా... మహేశ్, ప్రవీణలతో పాటు తను కొణిదెల, హర శ్రీనివాస్, వాల్తేరు వినయ్, గంగా చిటికెల తదితరులు కీలకపాత్రలు పోషించారు. మహేశ్ విట్టా, కౌశిక్ రెడ్డి నిర్మాతలుగా సంయుక్తంగా నిర్మించారు. లోకల్ నేటివిటీతో పాటు కంటెంట్ బలంగా ఉండడంతో స్టోరీ అందరినీ ఆకట్టుకుంది.
View this post on Instagram
Also Read : ధనుష్ కర ఓటీటీ రిలీజ్ డేట్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
స్టోరీ ఏంటంటే?
స్టోరీ విషయానికొస్తే... రాయలసీమ నేపథ్యంతో సాగుతుంది. ప్రొద్దుటూరుకు చెందిన చందు (మహేశ్ విట్టా) చిన్నప్పటి నుంచే సినిమాలపై ఇష్టం పెంచుకుని హీరో కావాలని కలలు కంటుంటాడు. తన ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. స్వయంగా సినిమా స్టార్ట్ చేయడానికి అవకాశం వచ్చినా ఆర్థిక సమస్యలతో మధ్యలోనే ఆగిపోతుంది. ఇదే టైంలో వారికి ఓ ఊహించని అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఇది ట్రాప్ అని తెలుస్తుంది.
అసలు ఈ గ్యాంగ్ ఎవరి ట్రాప్‌లో పడింది? ఎవరు తమ స్వార్థం కోసం వీరిని యూజ్ చేసుకున్నారు? కిడ్నాప్ డ్రామాకు ఈ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? చందు సోనెమ్మ (ప్రవీణ్ సోనీ) లవ్ స్టోరీ ఎలాంటి మలుపు తిరిగింది? చివరకు వీరి కల నెరవేరిందా? వీరు సినిమా తీశారా? అనేది తెలియాలంటే మూవీ తీయాల్సిందే.
Before You Go
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















