Thudarum OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన మోహన్ లాల్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' - తెలుగులోనూ చూసేయండి
Thudarum OTT Platform: మలయాళ స్టార్ మోహన్ లాల్ రీసెంట్ బ్లాక్ బస్టర్ 'తుడరుమ్' ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి 5 భాషల్లో 'జియో హాట్ స్టార్'లో అందుబాటులోకి వచ్చింది.

Mohanlal's Thudarum OTT Streaming On Jio Hotstar: మలయాళ స్టార్ మోహన్ లాల్, శోభన జంటగా నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ 'తుడరుమ్'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ.230 కోట్ల కలెక్షన్స్ సాధించి అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా నిలిచింది.
5 భాషల్లో స్ట్రీమింగ్
ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'జియో హాట్‌స్టార్'లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం కేరళ బాక్సాపీస్ వద్దే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఫస్ట్ మలయాళ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రాన్ని రెజపుత్ర విజువల్ మీడియా బ్యానర్‌పై తరుణ్ మూర్తి తెరకెక్కించారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత మోహన్ లాల్, శోభన జంటగా నటించి మెప్పించారు.
Thudarum is now streaming exclusively on JioHotstar.
— JioHotstar Malayalam (@JioHotstarMal) May 29, 2025
Watch in Malayalam, Hindi, Tamil, Telugu, and Kannada.@mohanlal @shobana_actor @Rejaputhra_VM @talk2tharun#Thudarum #JioHotstar #JioHotstarMalayalam #ThudarumOnJioHotstar #Mohanlal #Shobhana #MalayalamCinema #Mollywood… pic.twitter.com/Q8RKueO2K0
స్టోరీ ఏంటంటే?
ఒకప్పుడు తమిళ సినిమాల్లో యాక్షన్ సీన్లకు డూప్‌గా నటించే షణ్ముఖం అలియాస్ బెంజ్ (మోహన్ లాల్) ఓ యాక్సిడెంట్ తర్వాత అన్నింటినీ వదిలేసి తన మాస్టర్ (భారతీ రాజా) ఇచ్చిన కారుతో కేరళలో స్థిరపడతాడు. భార్య లలిత (శోభన), ఇద్దరు పిల్లలతో హాయిగా జీవనం సాగిస్తాడు. ఓసారి అనుకోకుండా అతని కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును చాలా ప్రయత్నాల తర్వాత ఇంటికి తీసుకొస్తాడు. అతను తిరిగి ఇంటికి వచ్చే సరికి అతని కొడుకు మిస్ అవుతాడు.
దీనిపై బెంజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. అయితే.. తన కొడుకును వెతికే క్రమంలో విస్తుపోయే విషయాలు తెలుసుకుంటాడు. అసలు పోలీసులు బెంజ్ కారును ఎందుకు తీసుకెళ్లారు?, దీని వల్ల బెంజ్ పడిన ఇబ్బందులేంటి?, అతని కొడుకు మిస్ కావడానికి కారణాలేంటి?అటు పోలీసులు ఇటు బెంజ్‌ను షాకింగ్‌కు గురి చేసే ఘటనలేంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
మరో బ్లాక్ బస్టర్ కూడా..
మరోవైపు.. ఇదే ఓటీటీలోకి మరో బ్లాక్ బస్టర్ మూవీ సైతం స్ట్రీమింగ్ కాబోతోంది. తమిళ యాక్టర్ శశికుమార్, సిమ్రాన్ లేటెస్ట్ కామెడీ డ్రామా 'టూరిస్ట్ ఫ్యామిలీ' జూన్ 2 నుంచి 'జియో హాట్ స్టార్' ఓటీటీలోకి రానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ అందుబాటులోకి రానుంది. ఓవర్సీస్ ఆడియన్స్ కోసం సింప్లీ సౌత్ ఓటీటీలోనూ అదే రోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా దాదాపు రూ.75 కోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీకి అభిషాన్ దర్శకత్వం వహించారు. శ్రీలంక నుంచి భారత్‌కు వలస వచ్చిన ఫ్యామిలీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంది అనేదే ఈ మూవీ ప్రధానాంశం. ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి ప్రసంసించారు.






















