Retro OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన సూర్య 'రెట్రో' - ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Retro OTT Release Date: తమిళ స్టార్ సూర్య లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెట్రో' ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో 5 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

Suriya's Retro OTT Streaming On Netflix: కోలీవుడ్ స్టార్ సూర్య లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'రెట్రో'. ఈ నెల 1న రిలీజ్ అయిన ఈ మూవీ తమిళ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకోగా తెలుగులో మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. థియేటర్‌లో మిస్ అయిన వారి కోసం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
అనుకున్న డేట్ కన్నా ముందుగానే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థ స్పెషల్ వీడియోతో సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.
ఈ మూవీని 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య స్వయంగా నిర్మించారు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించారు. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించగా.. జయరామ్, కరుణాకరన్, జోజు జార్జ్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రొమాన్స్, మాస్ యాక్షన్, ఎమోషన్స్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. రాజశేఖర్ కర్పూర సుందర పాండియన్, కార్తికేయ సంతానం (స్టోన్ బెంచ్ ఫిల్మ్స్) సహా నిర్మాతలు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
A scar shaped like a spear. A destiny shaped by fire 🔥
— Netflix India (@NetflixIndia) May 29, 2025
Watch Retro, out 30 May, on Netflix in Tamil, Hindi, Telugu, Kannada and Malayalam. #RetroOnNetflix pic.twitter.com/R87pGRA0lA
కథ్ ఏంటంటే?
పారి అలియాస్ పారివేల్ కణ్ణన్ (సూర్య) ఓ అనాథ. మాఫియా వ్యవహారాలు, గ్యాంగ్ స్టర్‌గా ఉన్న తిలక్ (జోజు జార్జ్) దగ్గర అతని తండ్రి పని చేస్తాడు. ఓసారి తిలక్ ఇంటి మీది అతని శత్రువులు జరిపిన దాడిలో పారి తండ్రి చనిపోతాడు. ఆ సమయంలో తిలక్ భార్య పారిని చేరదీసి కన్నకొడుకులా చూస్తుంది. అయితే.. ఇది తొలుత ఇష్టం లేకపోయినా ఆ తర్వాత పారిపై ఇష్టం పెచుకుంటాడు తిలక్. అతన్ని ప్రేమగా చూసుకుంటాడు.
రుక్మిణి (పూజా హెగ్డే)తో లవ్‌లో పడిన పారి... ఆమెతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్, రౌడీ పనులకు దూరంగా ఉండి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. అయితే... పెళ్లికి ముందు చేసిన ఓ 'గోల్డెన్ ఫిష్' డీల్ వల్ల తిలక్ - పారి మధ్య శత్రుత్వం ఏర్పడుతుంది. దీంతో పెళ్లి టైంలో ఘర్షణ జరగ్గా.. ఇది చూసి పారికి దూరంగా వెళ్తుంది కన్మణి. అసలు గోల్డెన్ ఫిష్ డీల్ అంటే ఏంటి?, అండమాన్ దీవుల్లో ఏం జరిగింది? పారి, తిలక్ మధ్య శత్రుత్వానికి కారణం ఏంటి? కన్మణి, పారి మళ్లీ కలిశారా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















