అన్వేషించండి

భయపెట్టే అడవి.. లోపలికి వెళ్తే అంతా మాయ - క్షణక్షణం టెన్షన్ పెట్టే మూవీ ఇది

ఒక విచిత్రమైన అడవిలో అనుకోకుండా తప్పిపోయిన తన ట్విన్ సిస్టర్ జెస్స్ ను వెతుకుతున్న సారాకు ఆమె దొరికిందా? లేదా సూసైడ్ అడ్డా అయిన ఆ అడవిలో సారా కూడా చనిపోయిందా అనేది ది ఫారెస్ట్ సినిమా కథ.

ది ఫారెస్ట్ (2016)లో విడుదలయిన అమెరికన్ హర్రర్ థ్రిల్లర్. ఒక భయానక అడవిలో మిస్సయిన తన చెల్లిని వెతుకుతూ.. ఆమె కవల సోదరి కూడా అక్కడికి వెళ్తుంది. మరి, ఆమె కూడా ఆ అడవిలో తప్పిపోతుందా? తన సోదరి ఆచూకీ తెలుసుకోగలుగుతుందా? ఆ అడవిలో ఆమెకు ఎదురయ్యే సవాళ్లు ఏమిటనేదే కథ.

ఇదీ.. కథ..

సారా, జెస్స్ ఇద్దరూ ట్విన్ సిస్టర్స్. జెస్స్ జపాన్ లోని ఒక స్కూల్‌లో టీచర్ గా పనిచేస్తుండేది. ఆమె స్కూల్ క్యాంప్‌లో భాగంగా ఒక ఫారెస్ట్ దగ్గర ఉన్న పర్వతం వద్దకు వెళ్తుంది. అయితే, ఆమె దారి తప్పుతుంది. తిరిగి స్కూల్ క్యాంప్‌కు చేరుకోలేదు. ఆ ప్రాంతాన్ని అవోకిగహారా అంటారు. ఇది జపాన్‌లో మౌంట్ ఫూజి దగ్గర ఉంటుంది. ఇందులోకి సూసైడ్ చేసుకునేవాళ్లు వెళ్తారు. జెస్స్ ఆ ఫారెస్ట్ లోకి వెళ్లింది కాబట్టి ఆమె చనిపోయి ఉండొచ్చు అని సారాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్తాడు.

అయితే, సారా ఇందుకు ఒప్పుకోదు. తన సోదరికి ఏమైనా జరిగితే తనకు తెలుస్తుందని, ఒక ఫీల్ కలుగుతుందని అంటుంది. ఆమె బతికే ఉందనే బలమైన నమ్మకంతో సారా తన సిస్టర్‌ను వెతకటానికి జపాన్ వస్తుంది. ముందు జెస్స్ పనిచేసిన స్కూల్‌కు వెళ్లి ప్రిన్సిపల్ ని కలుస్తుంది. అక్కడ ఒక స్టూడెంట్ సారాను చూసి దెయ్యం అనుకొని భయపడుతుంది.

ఒకప్పుడు తినటానికి తిండి కరువై, ఇంట్లో ముసలివాళ్లను, వికలాంగులను ఆ ఫారెస్ట్‌లో వదిలేసేవారు. వారంతా ఆకలితో చనిపోయి, కోపంతో దెయ్యాలై తిరిగివచ్చేవారు అని ఆ ఫారెస్ట్ స్టోరీ ప్రిన్సిపల్ సారాకు చెప్తుంది. ఆ రోజు సాయంత్రం హోటల్ దగ్గర సారా.. ఐడెన్ అనే అమేరికన్ జర్నలిస్ట్ ని కలుస్తుంది. వాళ్లిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. సారా వాళ్ల పేరెంట్స్ ని చిన్నపుడు వాళ్ల తాగుబోతు డ్రైవర్ యాక్సిడేంటల్ గా చంపేశాడని చెప్తుంది. అది తన సిస్టర్ జెస్స్ కళ్లారా చూసిందని, తను మాత్రం కళ్ళు మూసుకున్నానని అంటుంది. కానీ, ఆ హత్య చేసేది డ్రైవర్ కాదు. సారా వాళ్ల తండ్రి.. ఆమె తల్లిని చంపేసి, తాను కూడా సూసైడ్ చేసుకున్నాడు.

ఐడెన్ తన డాక్యూమెంటరీ కోసం సారా హెల్ప్ కావాలని, ఒక గైడ్‌ను ఏర్పాటు చేసుకొని ఆ ఫారెస్ట్ లోకి వెళ్దామని ప్లాన్ చేస్తాడు. ఫారెస్ట్ దగ్గర జెస్స్ స్టే చేసిన హోటల్‌లో రిసెప్షనిస్ట్ ని కనుక్కోవటానికి వెళ్లినపుడు ఆమె మార్చురీకి తీసుకెళ్లి అక్కడున్న శవాల్లో జెస్స్ ఉందేమో చూడమంటుంది. చూస్తే అదొక భయంకరమైన రూపంతో ఉన్న శవం కానీ అది జెస్స్ కాదు. సారా ఫారెస్ట్ లోకి వెళ్లటానికి నిర్ణయించుకుంటుంది. అక్కడ ఉన్న ఓ స్థానిక యువతి ఈ అడవి బాధగా ఉన్నవాళ్లతో ఆడుకుంటుంది. మాయ సృష్టించి లేనివి ఉన్నట్టు నమ్మేలా చేస్తుందని చెప్తుంది.

ఐడెన్, ఆ పార్క్ గైడ్, సారా ముగ్గురూ ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్తారు. అక్కడి నుంచి అనుకోని విధంగా ఆ ఫారెస్ట్ ఇల్యూషన్స్ సృష్టిస్తుంది. చేయి దాటిపోయే వరకు సారాకు నిజాలు తెలియవు. చివరికి జెస్స్ దొరికిందా? ఆమె కూడా ఈ ఫారెస్ట్ మాయకు బలి అయిపోయిందా? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా Netflixలో స్ట్రీమ్ అవుతోంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Kompella Madhavi Latha: ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs Afg Semifinal 1 Preview | T20 World Cup 2024 లో మొదటి యుద్ధం గెలిచేదెవరోAfghanistan T20 World Cup 2024 Semis | Home Ground కూడా లేని ఆఫ్గాన్ కు BCCI అండ | ABP DesamBrian Lara Only Guy Who Predict Afghanistan Semis | T20 World Cup 2024 Semis ముందే ఊహించిన లారా |ABPAfghanistan Performance in T20 World Cup 2024 | ఈ వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ ఆట చూస్తే గూస్ బంప్స్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Inter Supplementary Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే
Kompella Madhavi Latha: ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
ఈ వికృత వ్యక్తి మనస్తత్వం ఏంటి? ఒవైసీ కామెంట్స్‌పై మాధవీ లత ఘాటు స్పందన
PM Modi: ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
ప్రధాని మోదీపై కేసు, బెంగళూరు న్యాయస్థానంలో ప్రైవేట్ ఫిర్యాదు - కారణం ఇదీ
Secunderabad: మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
మరదలిపై కన్నేసిన యువకుడు - ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె బావ కిరాతకం!
Andhra News in Telugu  : విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీకి షాక్.. హైకోర్టులో ఎదురుదెబ్బ 
Jeevan Reddy: తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
తిరుగుబాటు జెండా ఎగరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అధిష్ఠానం నుంచి కాల్
Lok Sabha Speaker: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా- మూజువాణి ఓటుతో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ 
Lok Sabha Speaker Om Birla: మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
మరో ఐదేళ్లు ఓం బిర్లా మార్గనిర్దేశం అవసరం: ప్రధాని
Embed widget