Tamannaah: షూటింగ్ కంప్లీటైన 8 ఏళ్లకు రిలీజ్ అవుతున్న తమన్నా మూవీ, అదీ ఓటీటీలో!
Tamannaah: తమన్నా ప్రధాన పాత్రలో నటించి చిత్రం ’దటీజ్ మహాలక్ష్మి’. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న 8 ఏళ్లకు ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రాబోతోంది. అదీ థియేటర్లలో కాకుండా ఓటీటీలో.
Tamannaah ‘That Is Mahalakshmi’ Movie: షూటింగ్ పూర్తైన కొద్ది రోజులకు సినిమా విడుదల కావడం కామన్. కానీ, ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న 8 ఏళ్లకు విడుదల కాబోతోంది. అదేంటి? సినిమా షూటింగ్ పూర్తయ్యాక ఎందుకు విడుదల కాలేదు? ఇంతకాలం తర్వాత ఎందుకు విడుదల అవుతోంది? అనే డౌట్స్ వస్తాయి. ఇంతకీ ఆ సినిమా ఏది? ఎందుకు రిలీజ్ కాలేదు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
షూటింగ్ పూర్తైనా విడుదల కాని తమన్న మూవీ
మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించిన చిత్రం ‘దటీజ్ మహాక్ష్మి’. ఈ సినిమాకు ‘హనుమాన్’ మూవీ దర్శకుడు ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు. లేడీ ఓరియెంటెడ్ మూవీగా ఈ చిత్రం రూపొందింది. జాతీయ అవార్డు అందుకున్న కంగనా రనౌత్ బాలీవుడ్ మూవీ ‘క్వీన్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. 2014లో ఈ సినిమా మొదలయ్యింది. 2016 వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది. చిత్రీకరణ పూర్తి అయ్యాక, సౌత్ రీమేక్ హక్కుల విషయంలో వివాదం మొదలయ్యింది. దీంతో మేకర్స్ ఆ సినిమాను విడుదల చేయకుండా అలాగే ఉంచేశారు. సుమారు 8 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆ మూవీ రిలీజ్ కాలేదు.
ఓటీటీ వేదికగా ‘దటీజ్ మహాలక్ష్మి’ విడుదల
వాస్తవానికి సినిమా చిత్రీకరణ సమయంలో మంచి అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ప్రమోషన్స్ కూడా బాగానే చేశాడు. కానీ, రిలీజ్ విషయంలో మరీ ఎక్కువ గ్యాప్ రావడంతో ఈ సినిమా గురించి అందరూ మర్చిపోయారు. చివరకు తమన్నా, ప్రశాంత్ కూడా ఆ సినిమా గురించి ఆలోచించడం మానేశారు. కానీ, తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నారట. అయితే, ఈ మూవీని నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకురాబోతున్నారట. సినిమా షూటింగ్ పూర్తై చాలా కాలం కావడంతో థియేటర్లలో ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించడం కష్టం అని భావిస్తున్నారట. అందుకే ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
నెట్ ఫ్లిక్స్ తో ‘దటీజ్ మహాలక్ష్మి’ మేకర్స్ చర్చలు
ఈ సినిమా విషయంలో నెట్‌ఫ్లిక్స్ తో ‘దటీజ్ మహాలక్ష్మి’ మేకర్స్ చర్చలు జరుపుతున్నారట. త్వరలోనే మూవీ రిలీజ్ పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదల తేదీని వీలైనంత త్వరగా ప్రకటించాలని భావిస్తున్నారట. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమా, అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ‘డీజే టిల్లు’ ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, సంజయ్ స్వరూప్, జీవీఎల్ నరసింహ రావు, మాస్టర్ సంపత్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.అయితే, గతంలోనూ ‘దటీజ్ మహాలక్ష్మి’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.
Read Also: మహేష్ బాబుతో పోటీపై తెలివిగా జవాబిచ్చిన తేజా సజ్జా