Meerpet: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'సూక్ష్మదర్శిని' - మీర్‌పేట్ మర్డర్ కేసుతో ఇండియాలో టాప్‌లోకి చేరిన సినిమా
Sookshmadarshini movie OTT Streaming: 'సూక్ష్మదర్శిని' మూవీ సడెన్‌గా టాప్ వన్‌లో నిలిచింది. ఒక్క రోజులోనే అత్యధిక వ్యూస్‌తో ఈ చిత్రం టాప్ వన్‌కి చేరినట్టు తాజాగా హాట్‌స్టార్ వెల్లడించింది.
![Meerpet: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'సూక్ష్మదర్శిని' - మీర్‌పేట్ మర్డర్ కేసుతో ఇండియాలో టాప్‌లోకి చేరిన సినిమా Sookshmadarshini movie is now trending on Hotstar after Meerpet murder case Gurumurthy comments Meerpet: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'సూక్ష్మదర్శిని' - మీర్‌పేట్ మర్డర్ కేసుతో ఇండియాలో టాప్‌లోకి చేరిన సినిమా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/29/5b6fc3e0adb2a7ec4ddb124c8b2e49b017381459859861176_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Sookshmadarshini movie Now Trending in Hotstar: మీర్‌పేట్ హత్య ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉలిక్కిపడేల చేసింది. గురుమూర్తి తన భార్యను చంపి ఆ మృతదేహాన్ని ఎలా మాయం చేశాడనేది తెలిసి అంతా విస్తుపోయారు. అయితే అతడు ఈ దారుణ ఘటనకు పాల్పడడానికి 'సూక్ష్మదర్శిని' అనే సినిమా తనకు స్పూర్తి అని, సినిమాలో ఎలా చూపించారో అలాగే చేశానని పోలీసుల విచారణలో వెల్లడించాడు. ఇది తెలిసి అంతా విస్తుపోయారు. సినిమాలో చూపించినట్టుగానే భార్యను చంపి, మృతదేహాన్ని ముక్కలుగా చేసి, వేడి నీళ్లలో ఉడికించి, పోడి చేసి చెరువులో విసిరేశానని పోలీసులు ముందు ఒప్పుకున్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అయితే గురుమూర్తి దెబ్బకు 'సూక్ష్మదర్శిని' మూవీ ట్రెండింగ్‌లో నిలిచింది.
థియేటర్‌లో మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక నిందితుడు గురుమూర్తి దెబ్బకు ఈ చిత్రం ఓటీటీలో అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుంది. నిజానికి ఈ సినిమా ఓటీటీకి వచ్చి చాలా రోజులు అవుతుంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఎవరు దీనిని పెద్దగా పట్టించుకోలేదు. అయితే తన భార్యను హత్య చేయడానికి 'సూక్ష్మదర్శిని' సినిమా ఇన్‌స్పైర్ అని చెప్పడంతో అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. అసలు సినిమాలో ఏం చూపించారా? అని చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. హాట్‌స్టార్ విడుదలైన ఈ సినిమా అత్యధిక వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది. ఒక్కరోజులోనే అత్యధిక వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం 'సూక్ష్మదర్శిని' మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ విషయాన్ని స్వయంగా హాట్‌స్టార్ ప్రకటిచింది.
బ్లాక్-కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా
బ్లాక్ కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మలయాళ చిత్రం 'సూక్ష్మదర్శిని'. నజ్రియా నజీమ్, బసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఎంసీ జితిన్ దర్శకత్వంలో వహించాడు. హ్యాపీ అవర్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఏవీఏ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22, 2024న మలయాళంలో థియటర్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలోని కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు క్యూ కట్టారు. దాదాపు రూ. 5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ. 55 కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ సినిమా ఇతర భాషల్లోనూ ఓటీటీలోకి తీసుకువచ్చారు. జనవరి 11న తెలుగుతో పాటు తమిళ్‌తో పాటు ఇతర భాషల్లో ఈ చిత్రం ఓటీటీలో విడుదలైంది. మొదటి పెద్ద ప్రేక్షకాదరణ పొందని ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో అత్యధిక వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది.
కథ విషయానికి వస్తే...
ప్రియా (నజ్రీయ నజీమ్) అనే అమ్మాయి తన భర్త, పాపతో హౌస్ వైఫ్‌గా సంతోషంగా ఉంటుంది. మరోవైపు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు వారి పక్కింట్లోకి అనారోగ్యం బారిన పడిన తన తల్లితో ఓ వ్యక్తి దిగుతాడు. అతడి పేరు మ్యాన్యువల్ (బాసిల్ జోసెఫ్). నిజానికి ఇది వారి సొంతూరు, సొంత ఇల్లు. తన సొంతూరు కాబట్టి తల్లి త్వరగా కొలుకుటుందనే నమ్మకంతో ఇక్కడికి వచ్చామని మాన్యువల్ చెబుతాడు. కానీ, అతడు చెప్పేది నమ్మేలా అనిపించదు ప్రియకు. కొన్ని రోజులకు ఆమె మాన్యువల్ ప్రవర్తన వింతగా ఉన్నట్టు కనిపెడుతుంది. ఇదే విషయాన్ని ప్రియా తన భర్తకు చెబుతుంది.కానీ ఆయన అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరిస్తాడు. కానీ ప్రియా మాత్రం తన సందేహాన్ని తీర్చుకోవడానికి మాన్యువల్‌ను ఒ కంట కనిపెడుతూ ఉంటుంది. అదే సమయంలో తరచూ మాన్యువల్ తల్లి తప్పిపోవడం, మళ్లీ మరుసటి రోజు ఆమె కనిపించడం ప్రియాని తికమక పెడుతాయి. ఇంకా క్షణ్ణంగా మాన్యువల్‌పై ఫోకస్ పెట్టిన ప్రియాకు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. ఇంతకి ఆ నిజం ఏంటీ? మాన్యువల్ ఈ ఊరికి రావడానికి కారణమేంటి? ఆమె తల్లి కనిపించకపోవడం వెనక ఉన్న నిజం ఏంటి? అనేది సినిమా చూసి తెలుకోవాలి.
Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ బదులు హిందీ యాక్షన్ హీరో?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)