RECCE Web Series Teaser: తలలు తెగాయ్, రక్తాలు చిందాయ్ - కాసుల కోసం 'రెక్కీ'
శ్రీరామ్, శివ బాలాజీ ప్రధాన పాత్రల్లో నటించిన 'రెక్కీ' వెబ్ సిరీస్ టీజర్ విడుదల అయ్యింది. ఇది ఎలా ఉంది?
'అడివిలో సింహాన్ని చంపమని చెబుతున్నారు.
యేటాడలంటే చాలా ఓర్పు, నేర్పు కావాలా?
కసితో చంపాలంటే కసుక్కున కత్తి దించేయవచు.
కాసుల కోసం చంపాలంటే రెక్కీ చేయాల్సిందే స్వామి'
- ఈ వాయిస్ ఓవర్ వినిపిస్తుంటే... తెరపై శ్రీరామ్, శివబాలాజీ, 'ఆడుకాలమ్' నరేన్... ఒక్కొక్క పాత్రను చూపించారు. ఇదీ 'రెక్కీ' వెబ్ సిరీస్ టీజర్‌లో దృశ్యాలు!
లెనిన్ పాత్రలో శ్రీరామ్, చలపతిగా శివ బాలాజీ, వరదరాజులు పాత్రలో 'ఆడుకాలమ్' నరేన్ నటించిన వెబ్ సిరీస్ 'రెక్కీ'. శ్రీ రామ్ కొలిశెట్టి నిర్మించారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. ఈ నెల 17న జీ 5 ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ కానుంది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
ఈ సిరీస్ 1990ల నేపథ్యంలో తెరకెక్కింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ హత్యకు గురి అవుతారు. ఆయన్ను ఎవరు హత్య చేశారు? ఇన్స్పెక్టర్ ఎలా దర్యాప్తు చేశారు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి. టీజర్ చూస్తే రా అండ్ రియలిస్టిక్‌గా తీసినట్లు తెలుస్తోంది. విజువల్స్‌లో తలలు ఎగిరి పడటం, రక్తం చిందడం వంటి దృశ్యాలు ఉన్నాయి.
Also Read: 'విక్రమ్' రివ్యూ: కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
View this post on Instagram
ఇందులో ధన్యా బాలకృష్ణ, ఎస్తర్ నోరోన్హా, శరణ్య ప్రదీప్, రాజశ్రీ నాయర్, రామరాజు, తోటపల్లి మధు, సమీర్, సమ్మెట గాంధీ, ఉమా దానం కుమార్, కృష్ణకాంత్ ప్రధాన తారాగణం. సుమారు 25 నిమిషాల నిడివి గల ఎపిసోడ్స్ ఏడు ఉన్నాయి. గ్రామీణ ఫ్యాక్షన్, క్రైమ్ నేపథ్యంలో డ్రామా మిస్ అవ్వకుండా రూపొందించిన సిరీస్ అని జీ 5 తెలిపింది. శ్రీరామ్ మద్దూరి సంగీతం అందించారు.
Also Read: 'మేజర్' రివ్యూ: బరువెక్కిన గుండెతో బయటకు వస్తారు, సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఎలా ఉందంటే?