Unstoppable with NBK: బాలయ్య షోలో శ్రియ, సుహాసిని సందడి - ‘అన్‌స్టాపబుల్’ ప్రోమో చూశారా?
Unstoppable with NBK: నందమూరి బాలయ్య హోస్ట్ చేస్తున్న‘అన్‌స్టాపబుల్’ షో లేటెస్ట్ ఎపిసోడ్ మరింత జోష్ తో ముందుకు రాబోతోంది. అందాల తారలు, అద్భుతమైన దర్శకుడు బాలయ్యతో కలిసి సందడి చేయబోతున్నారు.
Unstoppable with NBK: ఊర మాస్ హీరో, నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘‘అన్‌స్టాపబుల్’ విత్ ఎన్బీకే’ టాక్ షో తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది. తొలిసారి టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరించిన బాలయ్య అద్భుతంగా అలరించారు. అంతేకాదు, ఈ షో ఐఎండీబీ రేటింగ్స్ లోనూ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుని ఆహా అనిపించింది.
బాలయ్య షోలో అందాల తారలు, అద్భుతమైన దర్శకుల సందడి
ప్రస్తుతం ‘అన్ స్థాపబుల్’ లిమిటెడ్ ఎడిషన్ నడుస్తోంది. తాజాగా ఈ షోలో అందాల తారలు, అద్భుతమైన దర్శకుడు సందడి చేయబోతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ ప్రోమో విడుదల చేసింది. లిమిటెడ్ ఎడిషన్ 3వ ఎపిసోడ్ లో అందాల తార శ్రియ శరణ్, సీనియర్ నటి సుహాసిని, దర్శకులు హరీష్ శంకర్, జయంత్ సి. పరాంజీ పాల్గొన్నారు. షోకు సంబంధించిన తాజా ప్రోమోలో ఎలాంటి సంభాషనలు లేకుండా కేవలం విజువల్స్ మాత్రమే చూపించారు. శ్రియ క్యారీ వ్యాన్ నుంచి షోలోకి వస్తున్న విజువల్స్ తో పాటు దర్శకుడు హరీష్ శంకర్, పరాంజీ బాలయ్యతో ముచ్చటించడం కనిస్తుంది. సీనియర్ నటి సుహాసిని బాలయ్య ప్రేమగా దగ్గరికి తీసుకుని మాట్లాడ్డం చూపించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ ఎపిసోడ్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కు వస్తుంది అనే విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
Mystery reveal aipoindi... 😍 Ippudu e stellar stars tho #Unstoppable sarada ki meeru ready ah? 🥳#UnstoppableWithNBK coming soon on Aha! @harish2you @shriya1109 #NBKOnAHA #NBK #NandamuriBalakrishna @hasinimani @jayanthparanji pic.twitter.com/X3kn4k9PgS
— ahavideoin (@ahavideoIN) December 13, 2023
తొలి ఎపిసోడ్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్
మూడవ సీజన్ (లిమిటెడ్ ఎడిషన్) ‘అన్‌స్టాపబుల్’ షో తొలి ఎపిసోడ్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్ పాల్గొని సందడి చేసింది. బాలయ్య హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. క్యూట్ బ్యూటీ శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఎపిసోడ్ లో బాలయ్య రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులను బాగా అలరించింది.
రెండో ఎపిసోడ్ లో పాల్గొన్న ‘యానిమల్’ టీమ్
ఇక రెండో ఎపిసోడ్ లో ‘యానిమల్’ టీమ్ ‘అన్ స్థాపబుల్’ స్టేజి మీద అలరించింది. ఈ షోలో హీరో, హీరోయిన్లు రణబీర్ కపూర్, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. తొలిసారి ఈ షో కి బాలీవుడ్ హీరో రావడం మరింత ఆసక్తిని కలిగించింది. ఈ షోలో సందీప్, రణబీర్ తో బాలయ్య చేసిన సందడి అందరినీ ఆకట్టుకుంది. సందీప్ అప్పుడప్పుడు విస్కీ తీసుకుంటానని చెప్పడంతో నువ్వు నా బ్రాండ్ కు వచ్చేయి స్క్రిప్ట్ త్వరగా రాస్తావు అని బాలకృష్ణ చెప్పడం బాగా హైలెట్ అయ్యింది. రణబీర్ బాలయ్య డైలాగ్స్ తో అదరగొట్టారు. ఇక బాలయ్య, రణబీర్ కలిసి పైసా వసూల్ పాటకు స్టెప్పులు వేసి అలరించారు.
అందాల తారలు, అద్భుతమైన దర్శకులు...!!
— ahavideoin (@ahavideoIN) December 14, 2023
అన్ స్టాపబుల్ వేదికగా సందడి షురూ 🥳#UnstoppableWithNBK #Unstoppable @ahavideoIN #NBKOnAHA #NBK #NandamuriBalakrishna @harish2you @shriya1109 @hasinimani @jayanthparanji pic.twitter.com/lutQbSgVSN
Read Also: త్రిప్తి దిమ్రి దెబ్బకు ఆ ఇద్దరు హీరోయిన్లు ఔట్ - అరుదైన క్రెడిట్ కొట్టేసిన ‘యానిమల్‘ బ్యూటీ