Shah Rukh Khan: పాపం SRK - ఓటీటీ రంగంలోకి షారుక్ ఖాన్, బాద్‌షా ఆశలను గల్లంతు చేసిన డిస్నీ హాట్ స్టార్!
ఈరోజు షారుఖ్ ఓటీటీ వెంచర్ కి సంబంధించిన ఓ వీడియో రిలీజయింది. అందులో షారుఖ్ తన టీమ్ తో కలిసి SRK+ కోసం మంచి ఐడియాస్ చెప్పమని అడుగుతారు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ SRK+ అనే పేరుతో ఓటీటీ వెంచర్ మొదలుపెట్టబోతున్నట్లు నిన్న సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో నిజంగానే ఆయన ఓటీటీ వెంచర్ స్టార్ట్ చేయబోతున్నట్లు అభిమానులు అనుకున్నారు. కానీ అది డిస్నీ హాట్ స్టార్ ప్రమోషన్స్ కోసమని తెలుస్తోంది. ఈరోజు షారుఖ్ ఓటీటీ వెంచర్ కి సంబంధించిన ఓ వీడియో రిలీజయింది.
అందులో షారుఖ్ తన టీమ్ తో కలిసి SRK+ కోసం మంచి ఐడియాస్ చెప్పమని అడుగుతారు. దానికి దర్శకుడు అనురాగ్ కశ్యప్.. 'సైకో కిల్లర్, సూపర్ కాప్' అని స్టోరీ చెప్పగానే.. వెంటనే మరో వ్యక్తి 'ఆల్రెడీ డిస్నీ హాట్ స్టార్ లో ఇదే కాన్సెప్ట్ తో 'రుద్ర' అనే సిరీస్ వచ్చిందని చెబుతాడు. ఇంతలో మరో కాన్సెప్ట్ చెప్పడానికి ప్రయత్నిస్తాడు అనురాగ్ కశ్యప్. అది కూడా డిస్నీ హాట్ స్టార్ లో ఉందని చెబుతారు.
దీంతో షారుఖ్ డల్ అవుతాడు. ఇంతలో ఐపీఎల్ అని మరో ఐడియా ఇవ్వగా.. అది కూడా డిస్నీ హాట్ స్టార్ లోనే ప్రసారం కానుందని చెబుతారు. అన్నీ ఐడియాస్ డిస్నీ హాట్ స్టార్ లోనే అంటూ డల్ ఫేస్ పెడతాడు షారుఖ్. ఈ వీడియో చూసిన అజయ్ దేవగన్.. 'ముందే చెప్పి ఉంటే SRK+ లోనే 'రుద్ర' సిరీస్ ను రిలీజ్ చేసి ఉండేవాడిని' అంటూ బదులిచ్చాడు. దానికి షారుఖ్ సీజన్ 2 కచ్చితంగా SRK+ లోనే విడుదల చేయాలని అడుగుతాడు. ఇదంతా కూడా హాట్ స్టార్ కంటెంట్ ని హైలైట్ చేస్తూ ప్రమోషన్స్ కోసం చేసినట్లు తెలుస్తోంది.
View this post on Instagram
Toh… Season 2 Disney+ Hotstar pe nahin, SRK+ pe hoga…. Pukka? https://t.co/MqYXUYvrvP
— Shah Rukh Khan (@iamsrk) March 16, 2022
Before You Go
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















