Save The Tigers 2 : తెలుగులో సూపర్ హిట్టైన వెబ్ సిరీస్ సీక్వెల్‌లో కొత్త హీరోయిన్ - స్విమ్మింగ్ పూల్‌లో సీన్స్
తెలుగు ఓటీటీలో కామెడీతో హిట్ అందుకున్న వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్స్'. దానికి ఇప్పుడు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు.
ఆలుమగల మధ్య ప్రేమలు, అలకలు సహజమే. ప్రతి ఇంట్లో ఉంటూనే ఉంటాయి! వాటిని వినోదాత్మకంగా చూపించిన మహి వి రాఘవ్ (Mahi V Raghav) భారీ హిట్ అందుకున్నారు. తెలుగు ఓటీటీలో కామెడీతో హిట్ అందుకున్న వెబ్ సిరీస్ అంటే 'సేవ్ ద టైగర్స్' (Save The Tigers Web Series) అని చెప్పాలి.
'పాఠశాల', 'ఆనందో బ్రహ్మ', 'యాత్ర' చిత్రాలతో తనకంటూ ప్రత్యేక పేరు, గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మహి వి. రాఘవ్. ఆయన నిర్మించడంతో పాటు ప్రదీప్ అద్వైతంతో కలిసి షో రన్నర్ (క్రియేటర్)గా వ్యవహరించిన వెబ్ సిరీస్ 'సేవ్ ద టైగర్'. అంతరించిపోతున్న పులులను, మొగుళ్లను కాపాడుకుందాం... అనేది ఉప శీర్షిక. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైంది. దాని తర్వాత మరో వెబ్ సిరీస్ 'సైతాన్' చేశారు. అదీ హిట్టే. ఇప్పుడు 'యాత్ర 2'లో చిత్రీకరణలో బిజీగా ఉన్న మహి వి. రాఘవ్... మరోవైపు 'సేవ్ ద టైగర్స్ 2'ను కూడా సెట్స్ మీదకు పంపించారు.
'సేవ్ ద టైగర్స్ 2'లో సీరత్ కపూర్!
Seerat Kapoor in Save The Tigers Web Series : హీరోయిన్ సీరత్ కపూర్ ఉన్నారు కదా! 'రన్ రాజా రన్', 'టైగర్', 'రాజు గారి గది 2', 'టచ్ చేసి చూడు', 'కృష్ణ అండ్ హిజ్ లీల', 'మా వింత గాధ వినుమా' సినిమాల్లో నటించిన అమ్మాయి! 'సేవ్ ద టైగర్స్' సీజన్ 2లో ఆమె నటిస్తున్నారు.
ప్రస్తుతం సీరత్ కపూర్ మీద సిమ్మింగ్ పూల్స్ సీన్స్ తీస్తున్నారు. ఆవిడ ఏ పాత్రలో నటిస్తున్నారు? అనేది కొన్ని రోజుల్లో అనౌన్స్ చేయనున్నారు. 'సేవ్ ద టైగర్స్' ఫస్ట్ సీజన్ నటీనటుల విషయానికి వస్తే... అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి ఓ జంటగా... ప్రియదర్శి, 'జోర్దార్' సుజాత మరో జంటగా... చైతన్య కృష్ణ, దేవయాని ఇంకో జంటగా నటించారు. వాళ్ళు కూడా సీజన్ 2లో నటిస్తున్నట్లు తెలిసింది.
Also Read : 'కన్నూర్ స్క్వాడ్' రివ్యూ : మమ్ముట్టి కొత్త సినిమా ఎలా ఉంది - కార్తీ మూవీనే మళ్లీ తీశారా?
View this post on Instagram
Save The Tigers web series season 2 cast and crew : 'సేవ్ ద టైగర్స్'తో నటుడు తేజా కాకుమాను (Teja Kakumanu) దర్శకుడిగా మారారు. 'బాహుబలి'తో పాటు కొన్ని సినిమాల్లో ఆయన నటించిన సంగతి తెలిసిందే. 'సేవ్ ద టైగర్స్ 2'కి దర్శకుడు మారినట్లు తెలిసింది. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది. 'సేవ్ ద టైగర్స్' భారీ విజయం సాధించిన నేపథ్యంలో... రెండో సీజన్ మీద అంచనాలు నెలకొన్నాయి. వాటిని అందుకునే విధంగా సిరీస్ ఉంటుందని యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Also Read : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial