Satyam Sundaram OTT: ఓటీటీలోకి ఈ వారమే 'సత్యం సుందరం'... రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్
Meiyazhagan OTT Release Date: కార్తీ, అరవింద్ స్వామి నటించిన సినిమా 'సత్యం సుందరం'. ఓటీటీలోకి ఈ వారం రానుంది. నెట్‌ఫ్లిక్స్ ఆ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.
కోలీవుడ్ స్టార్ కార్తీ (Karthi), సీనియర్ కథానాయకుడు అరవింద్ స్వామి (Aravind Swamy) యాక్ట్ చేసిన తమిళ సినిమా 'మెయ్యళగన్' (Meiyalagan). ఆ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు 'సత్యం సుందరం' (Satyam Sundaram 2024 Movie)గా తీసుకు వచ్చారు. రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అంతకు మించి ప్రశంసలు అందుకుంది. ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదల కావడానికి రెడీ అయింది.
అక్టోబర్ 27న 'సత్యం సుందరం' డిజిటల్ ప్రీమియర్!
Satyam Sundaram OTT Release Date: 'సత్యం సుందరం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. కేవలం తమిళంలో మాత్రమే కాదు... తెలుగులోనూ థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది నెట్‌ఫ్లిక్స్. ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు కన్నడ, హిందీ భాషల్లో కూడా అనువదించారు.
Meiyazhagan OTT Release Date Netflix: అక్టోబర్ 27... అంటే రాబోయే ఆదివారం 'సత్యం సుందరం' సినిమాలో ఐదు భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. తమిళ, తెలుగు భాషలతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ వీక్షకులకు ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
Also Read: 'సత్యం సుందరం' రివ్యూ: తమిళ్‌లో బ్లాక్ బస్టర్ టాక్ - మరి తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా ఉందా?
View this post on Instagram
తమిళ హిట్ '96' తర్వాత మరొకటి!
'సత్యం సుందరం' సినిమాకు సి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. తమిళ చిత్రసీమలో ఆయనకు మంచి పేరు ఉంది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సౌత్ క్వీన్ త్రిష జంటగా నటించిన '96' సినిమా తీసింది ఆయనే. ఆ సినిమాను తెలుగులో శర్వానంద్, సమంత జంటగా 'జాను' పేరుతో రీమేక్ చేశారు. కానీ, ఆశించిన విజయం సాధించలేదు. కానీ, దర్శకుడిగా ఆయనకు మంచి పేరు వచ్చింది. '96' దర్శకుడి నుంచి కథ రావడంతో వెంటనే చేశానని కార్తీ చెప్పారు.
Also Read: ఎవరీ రియా? అసలు, సోషల్ మీడియాలో ఈ అమ్మాయి ఎందుకు అంత పాపులర్ అవుతుందో తెలుసా?
'సత్యం సుందరం' సినిమా కథలో మలుపులు, మెదడుకు పని చెప్పే అంశాలు అసలు లేవు. కథ చాలా సింపుల్. సొంత ఊరు, బంధువుల నుంచి దూరంగా వెళ్లిన ఓ కుటుంబంలో యువకుడు తప్పనిసరి పరిస్థితుల్లో చెల్లెలి పెళ్లికి వెళతాడు. ఆ పెళ్లిలో అతనికి ఓ యువకుడు పరిచయం అవుతాడు. అతను ఎవరో గుర్తు రాదు. చివరకు, ఏమైంది? అనేది క్లుప్తంగా సినిమా కథ. కానీ, ఈ కథను చెప్పే క్రమంలో ప్రేమ్ కుమార్ రాసిన పలు సన్నివేశాలు మనసు చెమ్మగిల్లేలా చేశాయి. గుండె లోతుల్లో ప్రేమను తట్టి లేపాయి. చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకు వెళ్లాయి.