Sarangapani Jathakam OTT Streaming: ఓటీటీలోకి వచ్చేసిన ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Sarangapani Jathakam OTT Platform: ప్రియదర్శి లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సారంగపాణి జాతకం' ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

Priyadarshi's Sarangapani Jathakam OTT Streaming: వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి, రూపా కొడువాయూర్ (Roopa Koduvayur) జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సారంగపాణి జాతకం'. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ మూవీ కోసం ఓటీటీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తుండగా.. తాజాగా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఈ మూవీ ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: జయం రవితో రిలేషన్ షిప్ రూమర్స్ - సింగర్ కెనీషాను చంపేస్తామంటూ బెదిరింపులు
స్టోరీ ఏంటంటే?
జాతకాలంటే విపరీతమైన పిచ్చి ఉండే సారంగపాణి (ప్రియదర్శి) ఓ కార్ షోరూంలో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తుంటాడు. అదే షోరూంలో పని చేసే మేనేజర్ మైథిలీ (రూపా కొడువాయూర్)తో ప్రేమలో పడతాడు. ఆ విషయం ఆమెకు చెప్పే లోపే సారంగపాణికే ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది. పెద్దల అంగీకారంతో ఇద్దరి ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత జిగేశ్వరనంద్ (శ్రీనివాస్ అవసరాల) సారంగపాణి చేతిని చూసి ఒక మర్డర్ చేస్తావని చెప్తాడు. దీంతో పెళ్లికి ముందే మర్డర్ చేయాలని భావించి.. మ్యారేజ్ వాయిదా వేయాలని డిసైడ్ అవుతాడు.
తన ఫ్రెండ్ చందుతో (వెన్నెల కిశోర్) కలిసి తన చేతికి మట్టి అంటకుండా ఎవరినైనా చంపాలని సారంగపాణి ప్లాన్ చేస్తాడు. మొదట ఓ వృద్ధురాలిని, ఆ తర్వాత తన కార్ షోరూం హెడ్‌నే చంపాలని అనుకుంటాడు. మరి సారంగపాణి ఎవరినైనా మర్డర్ చేశాడా?, మైథిలీ ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది? సారంగపాణి ఉద్యోగం ఎందుకు పోయింది? హైదరాబాద్ నుంచి విశాఖకు పెద్ద వ్యాపారవేత్త, అహోటెల్ అధినేత అహోబిల్ రావు (తనికెళ్ళ భరణి)ను కలవడానికి సారంగపాణి ఎందుకు వెళ్ళాడు? ఎక్కువగా జాతకాలను నమ్మితే జరిగే పరిణామాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
మరో ఓటీటీలోకి 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి'
ఈ మూవీతో మరిన్ని మూవీస్ కూడా ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. ఇప్పటికే 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోన్న నందమూరి కల్యాణ్ రామ్ రీసెంట్ మూవీ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' శుక్రవారం నుంచి 'ఆహా' ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీలో కల్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించగా.. సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై అశోక్ వర్ధన్, సునీల్ బలుసు ఈ మూవీని నిర్మించగా.. ప్రదీప్ చిలుకూరి ఈ మూవీని భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు.
తల్లి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కాగా కొడుకు తన తండ్రి మరణంతో గ్యాంగ్ స్టర్‌గా మారతాడు. దీంతో తల్లీ కొడుకుల మధ్య దూరం పెరుగుతుంది. మరి ఆ కొడుకు మారాడా? ఉగ్రవాది నుంచి తన తల్లికి ముప్పు ఉందని తెలుసుకున్న కొడుకు ఏం చేశాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.






















