(Source: Poll of Polls)
Kenishaa: జయం రవితో రిలేషన్ షిప్ రూమర్స్ - సింగర్ కెనీషాను చంపేస్తామంటూ బెదిరింపులు
Ravi Mohan: కోలీవుడ్ స్టార్ జయం రవి, సింగర్ కెనీషా మధ్య రిలేషన్ షిప్ వార్తలు హల్చల్ చేస్తోన్న వేళ ఆమెకు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఈ మేరకు ఆమె ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను పంచుకున్నారు.

Singer Kenishaa Gets Murder Threats From Unknown Persons: కోలీవుడ్ స్టార్ జయం రవి, ఆర్తి రవి డివోర్స్ వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆయన సింగర్ కెనీషాతో రిలేషన్‌లో ఉన్నారని.. అందుకే భార్య ఆర్తి రవికి విడాకులు ఇస్తున్నారనే వార్తలు తాజాగా హల్చల్ చేశాయి. తాజాగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కెనీషాకు హత్యా బెదిరింపులు కలకలం రేపాయి.
కోర్టు ముందు హాజరుపరచండి
తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నాయని సింగర్ కెనీషా తెలిపారు. ఈ మేరకు ఆ మెసేజ్‌ల స్క్రీన్ షాట్లను పంచుకున్నారు. తాను తప్పు చేస్తే శిక్ష అనుభవించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. 'నేను కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయలేదు. మీ అందరి నుంచీ ఏ విషయాన్నీ దాచలేదు. నాకు సంబంధించింది ఏదైనా నా ముఖంపైనే చెప్పండి. మీకు నిజానిజాలు చెప్పడం నాకు కూడా సంతోషమే. నా చుట్టూ జరుగుతోన్న కొన్ని విషయాలకు నేను బాధ్యురాలిని అని మీరంతా అనుకుంటే నన్ను కోర్టు ముందు హాజరుపరచండి.' అని అన్నారు.
ప్రశాంతంగా బతకనివ్వండి
కొందరు శాపాలు పెడుతున్నారని.. దాని వల్ల తాను ఎంతో వేదన అనుభవిస్తున్నానని సింగర్ కెనీషా తెలిపారు. 'కర్మ ఎవరినీ విడిచిపెట్టదు అని అంతా నన్ను నిందిస్తున్నారు. కానీ, నిజం బయటకు వచ్చాక మీరు కూడా ఇలాంటి బాధనే అనుభవించాలి అని నేను కోరుకోవడం లేదు. చాలామందికి అసలు నిజం ఏంటో తెలియకపోవడంతో నన్ను నిందిస్తున్నారు. త్వరలోనే నిజం బయటపడాలని దేవున్ని ప్రార్థిస్తున్నా. నేను తప్పు చేస్తే చట్టం వేసే శిక్షను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. అప్పటివరకూ నన్ను ద్వేషించొద్దు. ప్రశాంతంగా బతకనివ్వండి.' అని రిక్వెస్ట్ చేశారు కెనీషా.
Also Read: మహేష్ బాబు 'ఖలేజా' రీ రిలీజ్ ట్రైలర్ చూశారా? - కల్ట్ ఫాలోయింగ్ ఈజ్ గోయింగ్ ఆన్
అసలేం జరిగిందంటే?
తన భార్య ఆర్తి రవితో డివోర్స్ తీసుకున్నట్లు కోలీవుడ్ స్టార్ జయం రవి గతేడాది ప్రకటించారు. అయితే.. డివోర్స్ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని.. తనను సంప్రదించకుండానే దీన్ని బయటపెట్టారంటూ ఆర్తి ఆరోపించారు. తాజాగా.. ఓ పెళ్లి వేడుకలో సింగర్ కెనీషాతో జయం రవి కనిపించగా.. వీరిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేశాయి. ఆమెతో రిలేషన్ కారణంగానే తన భార్య ఆర్తి రవికి రవి మోహన్ విడాకులు ఇచ్చారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో ఆర్తి రవి.. జయం రవిపై ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టారు. దీనికి జయం రవి సైతం స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. సింగర్ కెనీషా సైతం ఇండైరెక్ట్‌గా స్పందించారు.
భరణం కోరుతూ పిటిషన్
ఇటీవలే.. డివోర్స్ వ్యవహారానికి సంబంధించి జయం రవి, ఆర్తి చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరు కాగా.. ఆమెతో వివాహ బంధాన్ని కొనసాగించలేనని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తనకు నెలకు రూ.40 లక్షల భరణం ఇప్పించాలని కోరుతూ ఆర్తి రవి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం దీనిపై తదుపరి విచారణను జూన్ 12కు వాయిదా వేసింది.





















