అన్వేషించండి

Gamblers: జూన్ 6న మ్యాడ్ హీరో 'గ్యాంబ్లర్స్' - కొత్త మూవీ పోస్టర్ చూశారా?

Santosh Sobhan: యంగ్ హీరో సంగీత్ శోభన్ లేటెస్ట్ మూవీ 'గ్యాంబ్లర్స్' . ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. కొత్త పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.

Sangeeth Shobhan's Gamblers Movie Release Date: మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో అటు యూత్ ఆడియన్స్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌లోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు హీరో సంగీత్ శోభన్. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'గ్యాంబ్లర్స్'. ఈ మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.

మిస్టరీ ఎంటర్‌టైనర్

ఈ మూవీ మిస్టరీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతుండగా.. డిఫరెంట్ రోల్‌లో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) కనిపించబోతున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆయన సరసన ప్రశాంతి చారులింగ హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే 'కేసీఆర్‌' మూవీ ఫేమ్‌ రాకింగ్‌ రాకేష్‌, పృథ్వీరాజ్‌ బన్న, సాయి శ్వేత, జస్విక, భరణి శంకర్‌, మల్హోత్ర శివ, శివారెడ్డి కీలక పాత్రలు పోషించారు.

ప్రముఖ రచయిత, దర్శకుడు విజయేంద్రప్రసాద్‌ దర్శకత్వంలో 'శ్రీవల్లి' అనే సైన్స్‌  ఫిక్షన్‌ సినిమాను నిర్మించిన నిర్మాతలు సునీత, రాజ్‌కుమార్‌ బృందావనంలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేఎస్‌కే చైతన్య దర్శకత్వం వహిస్తుండగా.. రేష్మాస్‌ స్టూడియోస్‌, స్నాప్‌ అండ్‌ క్లాప్‌ ఎంటర్‌టైన్‌‌మెంట్‌ బ్యానర్‌పై మూవీని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఈ సందర్బంగా దర్శకుడు చైతన్య మాట్లాడుతూ.. 'ఇదొక మిస్టరీ ఎంటర్‌టైనర్‌. ఈ చిత్రంలో కొత్త సంగీత్‌ శోభన్‌ను చూడబోతున్నారు. ఆయన నటనలోని మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. చిత్రంలో ఉండే థ్రిల్లింగ్‌ అంశాలు, ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. పూర్తి వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాలను అలరించే అంశాలున్నాయి. ఇటీవల కేసీఆర్‌ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న రాకింగ్‌ రాకేష్‌ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రను పోషిస్తున్నాడు. ఆయన పాత్ర కూడా అందర్ని అలరించే విధంగా ఉంటుంది.' అని అన్నారు.

Also Read: 'నాయకుడు' కంటే 'థగ్ లైఫ్' భారీ హిట్ అవుతుంది... ఫ్యాన్స్‌, ప్రేక్షకులకు కమల్ హాసన్ ప్రామిస్

గత చిత్రాలకు భిన్నంగా..

'గ్యాంబ్లర్స్' మూవీ హీరో సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని నిర్మాతలు అన్నారు. 'మ్యాడ్‌, మ్యాడ్‌ స్క్వేర్‌ చిత్రాలతో సంగీత్‌ శోభన్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో పూర్తి థ్రిల్లింగ్‌ అంశాలతో రూపొందిన ఈ గ్యాంబ్లర్స్‌ తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది.' అని తెలిపారు.

ఈ మూవీకి నిర్మాతలు: సునీత, రాజ్‌కుమార్ బృందావనం కాగా..  స్క్రీన్ ప్లే - దర్శకత్వం: KSK చైతన్య (KSK Chaitanya), కథ - అదనపు స్క్రీన్‌ప్లే - డైలాగ్స్: విజయ్ చిట్నీడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ ప్రకాష్, సంగీతం: శశాంక్ తిరుపతి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: ప్రేమ్ సాగర్, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవ్ నాయర్, ఎడిటర్: శశాంక్ మాలి, యాక్షన్: వింగ్ చున్ అంజి, కొరియోగ్రఫీ: నిక్సన్ డి'క్రూజ్, సాహిత్యం: కిట్టు విస్సాప్రగడ
కాస్ట్యూమ్ డిజైనర్లు: అశ్వంత్ బైరీ, ప్రతిభా రెడ్డి.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
Jo Jo Movie: దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
దేవ కట్టా సమర్పణలో... రస్టిక్ రొమాంటిక్ కామెడీ 'జో జో'
Husharu Pittalu Review - 'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
'హుషారు పిట్టలు' రివ్యూ: మారుతి 'ఈ రోజుల్లో', 'బస్ స్టాప్' రేంజ్‌లో... బోల్డ్ సినిమా ఎలా ఉందంటే?
Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Embed widget