Sarangapani Jathakam OTT Platform: ఆ ఓటీటీలోకి ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Sarangapani Jathakam OTT Platform: ప్రియదర్శి లేటెస్ట్ మూవీ 'సారంగపాణి జాతకం' డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' సొంతం చేసుకుంది.

Priyadarshi's Sarangapani Jathakam OTT Release On Amazon Prime Video: వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి (Priyadarshi), రూప కొడువాయూర్ (Roopa Koduvayur) జంటగా నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సారంగపాణి జాతకం' (Sarangapani Jathakam). ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఓటీటీలోకి సైతం రానుంది.
ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్
'సారంగపాణి జాతకం' డిజిటల్, స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' (Amazon Prime Video) సొంతం చేసుకుంది. సాధారణంగా ఏ సినిమా అయినా థియేటర్‌లో విడుదలైన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంటే కాస్త ఆలస్యంగా ఓటీటీలోకి వస్తుంది. ఈ సినిమా కూడా థియేట్రికల్ రన్ తర్వాత 'అమెజాన్ ప్రైమ్'లోకి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
Also Read: మరోసారి హిట్ కాంబో రిపీట్! - రజినీకాంత్ 'జైలర్ 2'లో 'పుష్ప 2' విలన్?
ఈ మూవీకి దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించగా.. శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, 'వెన్నెల' కిశోర్, 'వైవా' హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'జెంటిల్‌మన్', 'సమ్మోహనం' విజయాల తర్వాత భారీ అంచనాల మధ్య మోహనకృష్ణ ఇంద్రగంటి (Indraganti Mohana Krishna), శ్రీదేవి మూవీస్ కలయికలో మూడో చిత్రంగా 'సారంగపాణి జాతకం' రూపొందింది.
స్టోరీ ఏంటంటే?
సారంగపాణి (ప్రియదర్శి) ఓ జాతకాల పిచ్చోడు. ఓ కార్ షోరూమ్‌లో సేల్స్ మ్యాన్‌గా పని చేస్తుంటాడు. అదే షోరూంలో పని చేసే మేనేజర్ మైథిలీ (రూపా కొడువాయూర్) అంటే అతనికి లవ్. ఆ విషయం ఎలా చెప్పాలా? అని ఆలోచిస్తుండగానే.. సారంగపాణికే ఆ అమ్మాయి ప్రపోజ్ చేస్తుంది. ఇంట్లో పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరిస్తారు. ఎంగేజ్మెంట్ కూడా జరుగుతుంది. అయితే, జాతకాలంటే పిచ్చి ఉన్న సారంగపాణి మాత్రం పెళ్లి కొద్ది రోజులు వాయిదా వేయాలని అడుగుతాడు. జిగేశ్వరనంద్ (శ్రీనివాస్ అవసరాల) సారంగపాణి చేతిని చూసి ఒక మర్డర్ చేస్తావని చెప్తాడు. దీంతో ఆందోళనకు గురైన సారంగపాణి పెళ్లి వాయిదా వేయాలంటూ.. తాను పెళ్లికి ముందే ఓ మర్డర్ చేయాలని డిసైడ్ అవుతాడు.
తన ఫ్రెండ్ చందుతో (వెన్నెల కిశోర్) కలిసి తన చేతికి మట్టి అంటకుండా చంపాలని సారంగపాణి ప్లాన్ చేస్తాడు. మొదట ఓ వృద్ధురాలిని చంపాలని ప్లాన్ చేయగా.. ఆ తర్వాత తన కార్ షోరూం హెడ్‌నే చంపాలని అనుకుంటాడు. మరి సారంగపాణి ఎవరినైనా మర్డర్ చేశాడా?, మైథిలీ ఎందుకు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది? సారంగపాణి ఉద్యోగం ఎందుకు పోయింది? హైదరాబాద్ నుంచి విశాఖకు పెద్ద వ్యాపారవేత్త, అహోటెల్ అధినేత అహోబిల్ రావు (తనికెళ్ళ భరణి)ను కలవడానికి సారంగపాణి ఎందుకు వెళ్ళాడు? అక్కడికి మైథిలీ ఎందుకు వచ్చింది? ఎక్కువగా జాతకాలను నమ్మితే జరిగే పరిణామాలేంటి? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.





















