అన్వేషించండి

Bads Of Bollywood Web Series: మరో వివాదంలో 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వెబ్ సిరీస్ - ఢిల్లీ హైకోర్టుకు NCB మాజీ అధికారి... 2 కోట్లు చెల్లించాలని డిమాండ్

Bads Of Bollywood Controversies: లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' మరో వివాదంలో చిక్కుకుంది. ఈ సిరీస్‌లో తనను తప్పుగా చూపించారంటూ మాజీ అధికారి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు.

Sameer Wankhede Petition Against Bads Of Bollywood Web Series: బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పటికే సిరీస్‌లో నిషేధిత వస్తువులు వాడారంటూ కంప్లైంట్ అందండంతో NHRC తీవ్రంగా పరిగణించింది. ఇక తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మాజీ అధికారి సమీర్ వాంఖడే ఈ సిరీస్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిరీస్‌లో తనను తప్పుగా చూపించారని... తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్లు చెల్లించాలని పిటిషన్ వేశారు. 

అసలేం జరిగిందంటే?

'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌లో యాంటీ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలను నెగిటివ్‌గా చూపించారంటూ మాజీ అధికారి సమీర్ వాంఖడే పిటిషన్‌లో పేర్కొన్నారు. అధికారి పాత్రను అభ్యంతరకర రీతిలో చూపిస్తూ... చట్టాలను అతిక్రమించి వాటిని అగౌరవపరిచారని తెలిపారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్, రెడ్ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థపై పరువు నష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.2 కోట్లు చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ ఆయన కోర్టును కోరారు. ఈ మొత్తాన్ని క్యాన్సర్ రోగుల చికిత్స కోసం టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్‌కు విరాళంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

అయితే, గతంలో క్రూజ్ నౌక డ్రగ్స్ వ్యవహారంలో ఆర్యన్ ఖాన్‌ను  సమీర్ వాంఖడే బృందం అరెస్ట్ చేసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' సిరీస్‌తోనే ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా మారాడు. ఈ నెల 18 నుంచి ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్'లో సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. హీరో కావాలనుకునే ఓ యువకుడి కథ, హిట్ కొట్టిన తర్వాత సదరు హీరో ఇద్దరు ఫేమస్ ప్రొడ్యూసర్స్ మధ్య ఎలా నలిగిపోయాడు? అనేదే ప్రధానాంశంగా సిరీస్ తెరకెక్కింది. 

Also Read: ప్లీజ్... నన్ను ఒంటరిగా వదిలేయండి - ఆమిర్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ ఆగ్రహం

ఈ సిరీస్‌లో రాఘవ్ జ్యూయెల్, మోనా సింగ్, లక్ష్య, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్స్ చాలా వరకూ అతిథి పాత్రల్లో మెరిశారు. దిశా పటానీ, షారుక్ ఖాన్, కరణ్ జోహార్, దర్శక ధీరుడు రాజమౌళి, ఆమిర్ ఖాన్ గెస్ట్ రోల్స్ చేశారు. రణబీర్ కపూర్ క్యామియో రోల్ చేశారు. 

NHRC తీవ్ర ఆగ్రహం

ఇటీవల NHRC సైతం ఈ సిరీస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ ఓ సీన్‌లో నిషేధిత ఈ సిగరెట్ వినియోగించడంపై అభ్యంతరం తెలిపింది. ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం - 2019ని ఉల్లంఘించడమే కాకుండా ఎలాంటి వార్నింగ్స్ కానీ డిస్‌క్లైమర్స్ కానీ లేకుండా ఆ సీన్స్ ఉన్నాయంటూ వినయ్ జోషి అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర సమాచార కమిషన్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. సిరీస్ నిర్మాతలు, రణబీర్, నెట్ ఫ్లిక్స్‌పై కేసు నమోదు చేయాలంటూ ముంబై పోలీసులను ఆదేశించింది. ఈ వివాదం మరిచిపోక ముందే మరో వివాదంలో సిరీస్ చిక్కుకుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Aakali Rajyam OTT : మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మరో ఆకలి రాజ్యం వచ్చేస్తోంది - ఓటీటీలోకి ఒరిజినల్ సిరీస్... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Srinivasa Mangapuram OTT : ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేసిన శ్రీనివాస మంగాపురం - ఘట్టమనేని వారసుడి మూవీ ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget