Rana Naidu 2 Release Date: వెంకటేష్ వర్సెస్ రానా... నెట్‌ఫ్లిక్స్‌లో 'రానా నాయుడు' సీజన్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్ - ఎప్పుడంటే?
Rana Naidu 2 Premiere Date: విక్టరీ వెంకటేష్, ఆయన అన్న కుమారుడు రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఇప్పుడు రెండో సీజన్ వస్తోంది. దీని ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ అయ్యింది.

విక్టరీ వెంకటేష్ (Venkatesh), ఆయన సోదరుని కుమారుడు - మ్యాచ్ స్టార్ రానా దగ్గుబాటి (Rana Daggubati) ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu Season 2). ఇది హిందీలో రూపొందినప్పటికీ... పలు భారతీయ భాషలలో డబ్బింగ్ చేశారు. తెలుగులో ఆ సిరీస్ టాక్ ఆఫ్ ద టౌన్ అయింది. వెంకటేష్ నుంచి ఆ తరహా సిరీస్ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓటీటీ ప్రాజెక్ట్స్ అంటే ఆ మాత్రం ఉండడం కామన్. తెలుగులో కొద్దిపాటి విమర్శలు పక్కన పెడితే బాలీవుడ్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో రెండో సీజన్ తీశారు. ఇప్పుడు ఆ సీజన్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు.
జూన్ 13న రానా నాయుడు 2 ప్రీమియర్!
Rana Naidu 2 streaming platform release date: నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. ఇప్పుడు రెండో సీజన్‌ను మరింత భారీగా రూపొందించారు. తొలి సీజన్‌లో వెంకటేష్, రానాలతో పాటు అర్జున్ రాంపాల్, సుర్విన్ చావ్లా కీలక పాత్రలు పోషించగా... ఈ సారి కృతి కర్బంద కూడా యాడ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ, డినో మోరియా తదితరులు మరోసారి ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
View this post on Instagram
జూన్ 13వ తేదీ నుంచి 'రానా నాయుడు 2' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెలిపారు. ఈ సారి కూడా తెలుగు ఆడియన్స్ ఈ సిరీస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తొలి సీజన్‌లో వెంకటేష్ వర్సెస్ రానా మధ్య సీన్స్ ఆసక్తి కలిగించాయి. మరి ఈసారి కథ, కథనాలు ఎలా ఉంటాయో చూడాలి. కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌ను లోకోమోటివ్ గ్లోబల్ సంస్థతో కలిసి సుందర్ ఆరోన్ నిర్మించారు. కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహించారు.
Also Read: అప్పుడు రామ్ చరణ్‌కు చెప్పలేదు... ఇప్పుడు ఎన్టీఆర్‌కు చెప్పాడు... బన్నీ రూటే సపరేటు





















