Project Hail Mary OTT : రెండు ఓటీటీల్లో 6 వేల కోట్ల సైన్స్ ఫిక్షన్ మూవీ - ఎందులో చూడొచ్చంటే?
Project Hail Mary OTT Platform : రీసెంట్ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' ఓటీటీలోకి వచ్చేసింది. మార్చిలో రిలీజైన మూవీ దాదాపు రూ.6 వేల కోట్లు కలెక్ట్ చేసింది.

Ryan Gosling's Project Hail Mary OTT Streaming : సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీస్ అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా వచ్చిన 'అవతార్ ఫైర్ అండ్ యాష్' తర్వాత అంతటి స్థాయిలో హాలీవుడ్‌తో పాటు ఇండియన్ ఆడియన్స్‌ను మెప్పించిన సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ 'ప్రాజెక్ట్ హెయిల్ మేరీ' (Project Hail Mary). ఈ ఏడాది మార్చి 20న రిలీజైన మూవీ ఎన్నో రికార్డులు సృష్టించింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తెలుగు, సహా ప్రాంతీయ భాషల్లో రిలీజైన సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.6 వేల కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో'లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే రెంటల్ విధానంలో Youtubeలో ఉంది. ఇప్పుడు మరో ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ర్యాన్ గాస్లింగ్, సండ్రా హుల్లర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
View this post on Instagram
స్టోరీ ఏంటంటే?
భూమికి సూర్యకాంతికి అందించే ఆస్ట్రో ఫేజ్ అనే గ్రహాంతర సూక్ష్మజీవి వల్ల మానవాళి అంతరించిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. దాన్ని కాపాడేందుకు రైలాండ్ గ్రేస్ (ర్యాన్ గాస్లింగ్) అనే మిడిల్ స్కూల్ సైన్స్ టీచర్ అంతరిక్షంలోకి బయలుదేరుతాడు. అయితే, ఊహించని విధంగా తన గతాన్ని మర్చిపోయి అంతరిక్ష నౌకలో మేల్కొంటాడు. ఆ తర్వాత తన గతాన్ని గుర్తు చేసుకుంటూ, తెలివితేటలు ఉపయోగించి ముంచుకొస్తున్న ప్రమాదం నుంచి మానవాళిని ఎలా రక్షించాడు? ఇందులో గ్రహాంతర వాసుల సహాయం ఎలా తీ సుకున్నాడు? అనేదే స్టోరీ.
Before You Go
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు























