News
News
వీడియోలు ఆటలు
X

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

ఓటీటీలలో విశేష ఆదరణ దక్కించుకున్న పలు పాపులర్ ఇండియన్ షోలు ఇప్పుడు మూడో సీజన్ తో తిరిగి రాబోతున్నాయి. మీర్జాపూర్ నుంచి ఫ్యామిలీ మ్యాన్ వరకు సీజన్ 3తో రాబోయే సిరీసులు ఇవే!

FOLLOW US: 
Share:
డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలైన తర్వాత, ఇండియాలోనూ వెబ్ సిరీస్ లకు విశేష ఆదరణ లభించింది. బిగ్ స్క్రీన్ మీద చెప్పలేని కథలను, ఓటీటీలలో చెప్పడానికి అవకాశం ఉండటంతో.. స్టార్ ఫిలిం మేకర్స్ కూడా వెబ్ కంటెంట్ మీద ఫోకస్ పెడుతున్నారు. అగ్ర నటీనటులు సైతం ఒరిజినల్ సిరీసుల ద్వారా కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు వెబ్ సిరీసులు ప్రేక్షకులని బాగా ఆకట్టుకున్నాయి. అందుకే మేకర్స్ వీటికి కొనసాగింపుగా సీజన్లు రూపొందిస్తున్నారు. వీటిలో కొన్ని తెలుగులో కూడా ఉన్నాయి. త్వరలో సీజన్ 3తో రాబోతున్న పాపులర్ వెబ్ సిరీసులు, అవి స్ట్రీమింగ్ కాబడే వివిధ ఫ్లాట్ ఫార్మ్స్ గురించి ఇప్పుడు చూద్దాం!
 

ఫ్యామిలీ మ్యాన్:

బాలీవుడ్ స్టార్ మనోజ్ బాజ్ పాయ్ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రాజ్ & డీకే ఈ సిరీస్ ను డైరెక్ట్ చేశారు. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ ఒరిజినల్ కు మూడో సీజన్ రాబోతోంది. ఇప్పటి వరకూ వచ్చిన సీజన్స్ ను పాకిస్థాన్, శ్రీలంకలలో టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తీయగా.. ఈసారి మన పొరుగు చైనాతో పొంచివున్న ప్రమాదం నేపధ్యంలో ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ సీజన్ లో టాలీవుడ్ యువ హీరో సందీప్ కిషన్ నటించగా.. సీజన్ 2లో స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు కీలక పాత్ర పోషించింది. దీంతో దర్శక ద్వయం ఈసారి ఏ సౌత్ స్టార్ ని భాగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. 'ఫ్యామిలీ మ్యాన్ 3' అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

మీర్జాపూర్:

తెలుగు ప్రేక్షకులకు అసలైన మజాని పరిచయం చేసిన వెబ్ సిరీస్ ''మీర్జాపూర్". అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, రసిక దుగల్ మరియు శ్వేతా త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించారు. అశ్లీల కంటెంట్ డోస్ కాస్త ఎక్కువే అయినప్పటికీ, ఈ సిరీస్ అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. గుడ్డు పండిట్, అఖండానంద త్రిపాఠి అకా ఖాలీన్ భయ్యా, మున్నా పాత్రలు అందరినీ ఆకట్టుకున్నాయి. అందుకే ఇప్పుడు సీజన్ 3 కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇది మరింత క్రూరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుడ్డు దాడి నుండి బయటపడిన కలీన్ భయ్యా, తన కొడుకు మున్నా మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎలాంటి ప్లాన్స్ చేస్తాడో అని ఆలోచిస్తున్నారు. చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

పంచాయత్:

జితేంద్ర కుమార్ నటించిన సిరీస్ ‘పంచాయత్’. అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన ఈ ఒరిజినల్, విశేష ఆదరణ దక్కించుకొని IMDbలో 8.9 రేటింగ్ సాధించింది. అయితే త్వరలో ఈ సిరీస్ మూడో సీజన్ తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉందని మేకర్స్ ధృవీకరించారు. సీజన్ 3 ఖచ్చితంగా ఉంటుంది కానీ దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపారు. రెండు సీజన్లకు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని, స్క్రిప్టు మీద ఎక్కువ వర్క్ చేయాల్సిన బాధ్యత వుందని పేర్కొన్నారు.

ఆర్య:

బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ లీడ్ రోల్ లో రూపొందించిన థ్రిల్లర్ సిరీస్ "ఆర్య". డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రెండు సీజన్స్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మంచి ఆదరణ దక్కింది. పలు అంతర్జాతీయ అవార్డులకు కూడా నామినేట్ అయింది. అయితే ఇప్పుడు ఈ సిరీస్ మూడో సీజన్ తో రాబోతోంది. ఇప్పటికే షూటింగ్ జరుగుతున్నట్లు సుస్మితా సేన్ క్లారిటీ ఇచ్చింది.

డిల్లీ క్రైమ్:

ఓటీటీ ప్రియులను విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్ లలో ‘డిల్లీ క్రైమ్’ ఒకటి. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో డిల్లీ పోలీసుల ఇబ్బందులు, పరిశోధనలు, రాజకీయ ఒత్తిళ్లు వంటివి చూపించారు. ఇది నెట్ ఫ్లిక్స్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అయింది. ఎమ్మీ అవార్డ్ సహా పలు ఇతర డిజిటల్ అవార్డులను గెలుపొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు 3వ సీజన్ కోసం రెడీ అవుతున్నారు. ఇందులోనూ షెఫాలీ షా, రసిక దుగల్, రాజేష్ తైలాంగ్ భాగం కానున్నారు.

మిస్ మ్యాచ్డ్:

నెట్ ఫ్లిక్స్ లో మూడవ సీజన్ తో తిరిగి వస్తున్న పాపులర్ ఇండియన్ షోల జాబితాలో "మిస్ మ్యాచ్డ్" కూడా ఉంది. 2017లో సంధ్యా మీనన్ నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ లో రోహిత్ సరాఫ్, ప్రజక్తా కోలీ ప్రధాన పాత్రల్లో నటించారు. త్వరలోనే ఈ న్యూ ఏజ్ షోకి సీజన్ 3 రాబోతోంది. 

అఫహరన్:

అరుణోదయ్ సింగ్, మహి గిల్ మరియు నిధి సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్-థ్రిల్లర్ సిరీస్ "అఫహరన్". వూట్ ఓటీటీలో వచ్చిన ఈ షోకి మంచి రెస్పాన్స్ దక్కింది. అయితే మేకర్స్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన సీజన్ కోసం తిరిగి కలుస్తారని అందరూ భావిస్తున్నారు. 

కోటా ఫ్యాక్టరీ:

ఓటీటీ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న సిరీస్ లలో "కోటా ఫ్యాక్టరీ" కూడా వుంది. నెట్ ఫ్లిక్స్ రెండు సీజన్లు స్ట్రీమింగ్ అవ్వగా, ఇప్పుడు సీజన్ 3 కోసం సిద్ధం అవుతున్నారు. ఇది జితేంద్ర కుమార్ నేతృత్వంలో రాబోతోంది. కోచింగ్ క్లాసెస్ కు ప్రసిద్ధి చెందిన కోటా నగరానికి వెళ్లి IIT ప్రవేశానికి సిద్ధమయ్యే విద్యార్థుల జీవితాలను రాబోయే సీజన్ లో చూపించనున్నారు.

షి (SHE):

బాలీవుడ్ ఫిలిం మేకర్ ఇంతియాజ్ అలీ రూపొందించిన సిరీస్ "షి". నెట్ ఫ్లిక్స్ వేదికగా రెండు సీజన్లు స్ట్రీమింగ్ అయ్యాయి. ఇందులో ఆదితి పోహంకర్ లీడ్ రోల్ ప్లే చేసింది. సస్పెన్స్, క్రైమ్, థ్రిల్, డ్రామాతో కూడిన ఈ సిరీస్ ను ఆడియన్స్ ఆదరించారు. త్వరలో దీనికి సీజన్ 3ని రూపొందించనున్నారు. 
 

ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్:

నెట్ ఫ్లిక్స్ తన పాపులర్ రియాలిటీ షో, 'ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' యొక్క మరో ఎగ్జైటింగ్ సీజన్ తో తిరిగి రావడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ వైవ్స్ మహీప్ కపూర్, సీమా కిరణ్ సజ్దే, నీలం కొఠారి సోని మరియు భావా పాండేల పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాల కథతో ఈ షో రూపొందనుంది.
 
Published at : 24 Mar 2023 12:19 PM (IST) Tags: Amazon Prime Mirzapur Delhi Crime OTT Web Series Kota Factory Panchayat Family Man SHE NETFLIX VOOT

సంబంధిత కథనాలు

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Shiva Balaji Madhumitha : మధుమితను ప్రేమలో పడేయాలని శివబాలాజీ అన్ని చేశారా - వెన్నెల కిశోర్ 'ఛీ ఛీ' అని ఎందుకున్నారు?

Kevvu Karthik Marriage : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Kevvu Karthik Marriage : త్వరలో  పెళ్లి చేసుకోబోతున్న కెవ్వు కార్తిక్, అమ్మాయి ఎవరంటే?

Telugu Indian Idol 2 Finale : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?

Telugu Indian Idol 2 Finale : 'ఇండియన్ ఐడల్ 2' ఫినాలేలో టాప్ 5 కంటెస్టెంట్స్ & జర్నీ - మీకు తెలుసా?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

Unstoppable Trailer : ఆవారాలా? పోలీసులా? 25 లక్షల కోసం వాడ్ని పట్టించారా? 'అన్‌స్టాపబుల్' ట్రైలర్ ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!