News
News
వీడియోలు ఆటలు
X

Taraka Ratna Video : హిందూపూర్ వెళ్ళడానికి ముందు - అమ్మాయి నిష్కతో తారక రత్న గేమింగ్ టైమ్

Taraka Ratna Last Video With Family : హిందూపూర్ వెళ్ళడానికి ముందు అమ్మాయి నిష్కతో తారకరత్న టైమ్ స్పెండ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

FOLLOW US: 
Share:

నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) జ్ఞాపకాల నుంచి ఆయన కుటుంబం బయటకు రాలేకపోతోంది. ఆయనతో గడిపిన చివరి క్షణాల గురించి భార్య అలేఖ్యా రెడ్డి, పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

హిందూపూర్ వెళ్ళడానికి ముందు...
తారక రత్న, అలేఖ్యా రెడ్డి దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. నిష్క (Taraka Ratna Daughter Nishka) తర్వాత కవలలు (అబ్బాయి, అమ్మాయి) జన్మించారు. ఇప్పుడు తారక రత్న పెద్దమ్మాయి నిష్క సోషల్ మీడియాలో అడుగు పెట్టారు. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేశారు. తాజాగా తండ్రితో గేమింగ్ ఆడుతున్న వీడియో షేర్ చేశారు. 

''హిందూపూర్ వెళ్ళడానికి ముందు రోజు సాయంత్రం ఓబు (ఇంట్లో తారక రత్నను ముద్దుగా పిలిచే పేరు)తో... గేమింగ్'' అంటూ ఈ వీడియోను నిష్క అకౌంట్ నుంచి షేర్ చేశారు. యువగళం పాదయాత్రలో పాల్గొనడానికి ముందు రాజకీయ కార్యక్రమాల్లో తారకరత్న చురుగ్గా పాల్గొన్నారు. అప్పట్లో కొన్నిసార్లు బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఎన్నికైన హిందూపూర్ కూడా వెళ్లారు.

Also Read : సినిమా ఇవ్వలేదు కానీ ఆశీసులు ఇస్తున్న చిరంజీవి

View this post on Instagram
 
A post shared by Nishka Nandamuri (@nishka_nandamuri)

తండ్రి తారక రత్నతో దిగిన ఫోటోను నిష్క పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆమె తొలి పోస్ట్ అదే. ఆ ఫోటోకి క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు. జస్ట్ రెండు లవ్ ఎమోజీలను యాడ్ చేశారు. ఆ తర్వాత తారక రత్న, అలేఖ్యా రెడ్డి ఫోటో పోస్ట్ చేశారు. ''మై పేరెంట్స్! వీళ్ళే నా బలం, నా ప్రేమ'' అని నిష్క పేర్కొన్నారు. ఆ ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలో అలేఖ్యా రెడ్డి షేర్ చేశారు.

తారక రత్న ఫిబ్రవరి 18న మరణించారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న అలేఖ్యా రెడ్డి, ఆ తర్వాత నుంచి తరచూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇటీవల నందమూరి బాలకృష్ణను దేవుడిగా వర్ణించారు. హిందూపురంలో నిర్మించిన ఆస్పత్రిలో తారక రత్న పేరు మీద ఓ బ్లాక్ ఓపెన్ చేయడంతో ఆయనది బంగారు మనసు అని పేర్కొన్నారు. దానికి కొన్ని రోజుల ముందు తమ దంపతులపై వివక్ష చూపించారని పేర్కొన్నారు. 

Also Read మృగాలను భయపెట్టే మగాడిగా ఎన్టీఆర్ - స్టోరీలైన్ చెప్పేసిన కొరటాల

''మనం కలిశాం, మనం మంచి స్నేహితులు అయ్యాం, మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేశాం... మన బంధం గురించి అప్పట్లో నేను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నప్పటికీ... మన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు పెట్టాలని నువ్వు కాన్ఫిడెంట్‌గా ఉన్నావ్. ఆ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి నువ్వు యుద్ధం చేయడం స్టార్ట్ చేశావ్'' అని తమ ప్రయాణం ప్రారంభమైన తొలినాళ్లలో సంగతులు అలేఖ్యా రెడ్డి చెప్పుకొచ్చారు.

పెళ్లి తర్వాత వివక్ష!
తారక రత్న, తాను పెళ్లి చేసుకున్న మరుక్షణం నుంచి తమకు కష్టాలు మొదలు అయ్యాయని అలేఖ్యా రెడ్డి పేర్కొన్నారు. తమపై వివక్ష చూపించారని, అయినా తాము బతికామని, సంతోషంగా ఉన్నామని ఆమె వివరించారు. పెద్దమ్మాయి నిష్కమ్మ జన్మించిన తర్వాత తమ ఆనందం రెట్టింపు అయ్యిందని తెలిపారు. అయితే, ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నారు. 2019లో కవలలు జన్మించడం తమకు సర్‌ప్రైజ్ అన్నారు. తారక రత్న ఎప్పుడూ పెద్ద కుటుంబం కావాలని కోరుకునే వారని, ఇప్పుడు తనను మిస్ అవుతున్నామని అలేఖ్యా రెడ్డి తెలిపారు. తారక రత్న గుండెల్లో బాధను ఎవరూ అర్థం చేసుకోలేదని, బాలకృష్ణ ఒక్కరే తమకు అండగా ఉన్నారని ఆమె చెప్పుకొచ్చారు.  

Published at : 24 Mar 2023 07:49 AM (IST) Tags: Nandamuri Taraka Ratna Taraka Ratna Hindupur Alekhya Reddy Nishka Nandamuri

సంబంధిత కథనాలు

Raja Ravindra New Movie : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో 'డియర్ జిందగీ' - అసలు కథ ఏమిటంటే?

Raja Ravindra New Movie : రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో 'డియర్ జిందగీ' - అసలు కథ ఏమిటంటే?

Indiana Jones And The Dial Of Destiny: అమెరికాలో ఒక్క రోజు ముందుగా ఇండియాలో 'ఇండియానా జోన్స్' లేటెస్ట్ మూవీ 

Indiana Jones And The Dial Of Destiny: అమెరికాలో ఒక్క రోజు ముందుగా ఇండియాలో 'ఇండియానా జోన్స్' లేటెస్ట్ మూవీ 

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

Anasuya - Vimanam 2023 Movie : అప్పుడు 'వేదం'లో అనుష్క - ఇప్పుడు 'విమానం'లో అనసూయ

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

తగ్గేదేలే, హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న సౌత్ స్టార్స్ వీరే!

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

మే నెలలో డబ్బింగ్ సినిమాలదే హవా - ఈ మూవీస్‌కు పాజిటీవ్ రెస్పాన్స్!

టాప్ స్టోరీస్

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

Coromandel Train Accident: ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం జగన్ విచారం- సహాయక చర్యల కోసం స్పెషల్‌ టీం ఏర్పాటు

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

BRS Politics : మూడో కూటమికి చాన్స్ లేదన్న కేటీఆర్ - జాతీయ రాజకీయాలపై బీఆర్ఎస్ ఆశలు వదిలేసినట్లేనా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ పనీ చెప్పడం లేదా ?

AP BJP Kiran : బీజేపీలో చేరినా సైలెంట్ గానే కిరణ్ కుమార్ రెడ్డి - హైకమాండ్ ఏ  పనీ చెప్పడం లేదా ?

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో