Paradha OTT Platform: ఆ ఓటీటీకే అనుపమ పరమేశ్వరన్ 'పరదా' డిజిటల్ రైట్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
Paradha OTT Release: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సోషల్ డ్రామా 'పరదా'. ఈ నెల 22న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా... డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సొంతం చేసుకుంది.

Anupama Parameswaran's Paradha OTT Platform Locked: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా మూవీ 'పరదా'. సినిమా బండి, శుభం చిత్రాల ఫేం ప్రవీణ్ కండ్రేగుల ఈ మూవీకి దర్శకత్వం వహించగా... ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ఆకట్టుకుంటున్నాయి.
ఆ ఓటీటీకి డిజిటల్ రైట్స్
ఇక ఈ మూవీ డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' దక్కించుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్యే చాన్స్ ఉంది. ఈ మూవీలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, సంగీత కీలక పాత్రలు పోషించారు. ఆనంద మీడియా బ్యానర్‌పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ మక్కువతో కలిసి మూవీని నిర్మించారు.
ఈ మూవీలో అనుపమ 2.Oను చూడబోతున్నారంటూ ట్రైలర్ లాంచ్ సందర్భంగా యంగ్ హీరో రామ్ పోతినేని తెలిపారు. 'సుబ్బు' అనే ఓ పల్లెటూరి అమ్మాయి చుట్టూ ఈ 'పరదా' స్టోరీ సాగబోతున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ఊరిలో కఠినమైన కట్టుబాట్లు, మగవారికి మాత్రమే ఉండే వెసులుబాట్లు నుంచి విసిగిపోయిన ఓ అమ్మాయి ఇద్దరు అపరిచితులతో కలిసి ట్రిప్‌నకు వెళ్తుంది. ఆ టైంలో ఆమె అదృశ్యం కాగా... ఊరిలో ఊహించని ప్రమాదం పొంచి ఉంటుంది. అసలు ఆమెకు ఎదురైన ప్రమాదం ఏంటి? ఊరిలో అంతా ఎందుకు సుబ్బుకు వ్యతిరేకంగా మారుతారు? ఆమె 'పరదా' వెనుక అవమానాలు, కట్టుబాట్లు ఏంటో తెలియాలంటే మూవీ చూడాల్సిందే.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















