Godzilla Minus One OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ - స్ట్రీమింగ్ ఎక్కడ, తెలుగులో ఉందా?
విదేశాల్లో థియేటర్లలో సందడి చేసిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’ సినిమా.. భారత్ లో సైలెంట్ ఓటీటీలోకి వచ్చేసింది. నాలుగు భాషల్లో ప్రేక్షకులను అలరిస్తోంది.
Godzilla Minus One OTT Steaming: నవంబర్ 2023లో జపాన్ లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఆ తర్వాత ఈ సినిమా అమెరికా, ఆస్ట్రేలియా సహా పలు దేశాల్లో విడుదలైంది. విజువల్ వండర్ గా రూపొందిన ఈ మూవీ ప్రేక్షకులను ఓ రేంజిలో కట్టిపడేసింది. ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ ఆడియెన్స్ కు సరికొత్త అనుభూతిని పంచాయి. అయితే, ఈ సినిమా భారత్ లో ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా? అని ఎదురు చూసిన అభిమానులకు మేకర్స్ సడెన్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇండియన్ థియేటర్స్‌లో రిలీజ్ కాని ఈ మూవీ నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం గమనార్హం.
నెట్ ఫ్లిక్స్ వేదికగా 4 భాషల్లో స్ట్రీమింగ్
‘గాడ్జిల్లా మైనస్ వన్’ సినిమా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్ గా నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చింది. ఇవాళ ఉదయం నుంచే ఈ సినిమా నాలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, తెలుగులో మాత్రం అందుబాటులో లేదు. కేవలం జపాన్, ఇంగ్లీష్, హిందీ, తమిళంలో స్ట్రీమ్ అవుతోంది.
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’
నిజానికి ‘గాడ్జిల్లా’ సినిమాలు హాలీవుడ్ తో పాటు జపనీస్ లో చాలా ఏళ్లుగా తెరకెక్కుతున్నాయి. ఈ ప్రాచైజీలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అందులో భాగంగా వచ్చిన 37వ సినిమా ‘గాడ్జిల్లా మైనస్ వన్’. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా, ఏకంగా రూ. 660 కోట్ల రూపాయలు వసూళు చేసింది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది.
బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు
తకాషి యమజాకి దర్శకత్వం వహించిన ‘గాడ్జిల్లా మైనస్ వన్’కి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. విజువల్ ఎఫెక్ట్స్, స్క్రీన్ ప్లే, మ్యూజిక్, డైరెక్షన్ సహా పలువు విభాల పనితీరు అద్భుతం అంటూ సినీ దిగ్గజాలు అభివర్ణించారు. అంతేకాదు, ఈ ఏడాది ఈ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు మరింత ఆదరణ పెరిగింది.
ఇక ఈ సినిమా సెకండ్ వరల్డ్ వార్ కథాంశంతో తెరకెక్కించారు. ఆటం బాంబులు పడి ధ్వంసమైన హిరోషిమా, నాగసాకి కథతో రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. కనీవినీ ఎరుగని గ్రాఫిక్స్ మైమరచిపోయేలా చేసింది. తాజాగా ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ వేదికగా భారతీయ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
View this post on Instagram
Read Also: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత