OG OTT: పవన్ 'OG' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
OG OTT Platform: పవన్ 'ఓజీ' మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ సినిమా ఇప్పుడు ఏ ఓటీటీలోకి వస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan's OG Movie OTT Platform Lokced: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ డ్రామా 'OG' బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అదరగొడుతొంది. సోషల్ మీడియా మొత్తం 'ఓజీ' మేనియానే నడుస్తుండగా... ఈ మూవీ ఏ ఓటీటీలోకి వస్తుందనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.
ఎందులో స్ట్రీమింగ్ అంటే?
'OG' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకోగా థియేట్రికల్ రన్ తర్వాత స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పవన్ సినిమా అంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 'ఓజీ' మూవీ ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఆయన్ను ఎలా చూడాలనుకున్నారో అలానే పవర్ ఫుల్ రోల్‌లో చూశారు. మూవీ హిట్ టాక్ సొంతం చేసుకోగా ఓటీటీ రిలీజ్ ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత 6 నుంచి 8 వారాల మధ్యలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
సుజీత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశారు. వీరితో పాటు సత్య దాదాగా ప్రకాష్ రాజ్, శ్రియారెడ్డి, హరీష్ ఉత్తమన్, అర్జున్ దాస్, శుభలేక సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దాసరి కల్యాణ్ నిర్మించారు.
స్టోరీ ఏంటంటే?
తనను సొంత కొడుకులా చూసుకునే డాన్ వంటి వ్యక్తికి అండగా ఉండే ఓ యోధుడు అనుకోని కారణాలతో అతనికి దూరం అవుతాడు. తనకు అన్నం పెట్టిన చేతులు కష్టంలో ఉన్నాయని తెలుసుకుని మళ్లీ తిరిగి వచ్చి వారికి అండగా నిలబడతాడు. ఇదే ప్రధానాంశంగా 'ఓజీ' రూపొందించారు. ముంబైలోని కొలాబా పోర్టు సత్య దాదా (ప్రకాష్ రాజ్) కనుసన్నల్లో ఉంటుంది. ఓ కంటైనర్ కోసం వచ్చిన ముఠా సత్య దాదా కొడుకు వెంకట్‌ను చంపేస్తుంది. అయితే, కంటైనర్‌లో ఆర్డీఎక్స్ ఉందని తెలుసుకున్న సత్య దాదా అది వాళ్ల కంట పడకుండా దాచేస్తాడు.
ఇక ఈ కంటైనర్, దానిలోని ఆర్డీఎక్స్ కోసం ఇస్తాంబుల్ నుంచి మిరాజ్ కర్ (తేజ్ సప్రూ) పెద్ద కొడుకు ఓమి (ఇమ్రాన్ హష్మీ) వస్తాడు. వెంటనే సత్య దాదా ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న 'ఓజాస్ గంభీర' మళ్లీ ముంబైకి వస్తాడు. ఓమి నుంచి సత్యా దాదా ఫ్యామిలీని, పోర్టును ఓజీ ఎలా కాపాడాడు? అసలు ఓజీ ముంబై నుంచి వెళ్లడానికి రీజన్ ఏంటి? అతనికీ జపాన్‌లోని సమురాయ్ వంశానికీ సంబంధం ఏంటి? ఓజీ పేరు చెబితేనే ముంబయి ఎందుకు గడగడలాడిపోతుంది? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.




















