Nivetha Pethuraj Paruvu: పోలీసులతో నివేతా పేతురాజ్ గొడవ - ఇదంతా 'పరువు' కోసమేనట, జీ5 క్లారిటీ!
Nivetha Pethuraj Viral Video: హీరోయిన్ నివేతా పేతురాజ్ ఇటీవల పోలీసులతో గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వ్యవహరంపై ప్రముఖ ఓటీటీ సంస్థ క్లారిటీ ఇచ్చింది.
nivetha pethuraj heated argument with cops is a promotional stunt: హీరోయిన్ నివేతా పేతురాజ్(Nivetha Pethuraj Viral Video) ఇటీవల పోలీసులతో గొడవ పడిన సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తన కారును సోదా చేయాలని, వెనక కారు డిక్కి ఒపెన్ చేయాలని అడిగిన పోలీసులుతో ఆమె గొడవకు దిగింది. అర్థం చేసుకోండని, ఇది పరువుకు సంబంధించిన విషయమంటూ పోలీసులు వాగ్వాదానికి దిగింది. అంతేకాదు తన వీడియోని ఎందుకు రికార్డ్ చేస్తున్నారంటూ పోలీసులనే ప్రశ్నించింది. ఇక ఈ వీడియో నివేతా పేతురాజ్‌ని అలా చూసి అంతా షాక్ అయ్యారు.
పోలీసులు అడిగితే కారు డిక్కీ ఎందుకు ఒపెన్ చేయలేదు, అంత సీక్రెట్ ఏముందా? అని అంతా సందేహంలో పడిపోయారు. అంతేకాదు ఇది మా కుటుంబ పరువు సంబంధించిన విషయమని, ఇప్పుడు మీకు చెప్పిన అర్థం కాదంటూ ఆమె అసహనం చూపించిన తీరు అందరిని నెటిజన్లు సర్‌ప్రైజ్ చేసిది. అయితే నివేతా ఇలా ప్రవర్తించడానికి అసలు కారణమేంటో బయటపడింది. కొందరు నెటజన్లు సందేహించినట్టుగానే ఇది పబ్లిక్ స్టంట్ అట. తన లేటెస్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో ఇది భాగం అట.
View this post on Instagram
Paruvu Web Series on Zee5: తాజాగా దీనిపై ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5 OTT) క్లారిటీ ఇచ్చింది. నివేతా పోలీసులతో అలా గొడ పడటానికి కారణం ఇదేనంటూ తాజాగా పోస్ట్ షేర్ చేసింది. కాగా నివేతా పేతురాజ్ దాదాపు ఏడాది తర్వాత ఆమె తెలుగులో రీఎంట్రీ ఇస్తుంది. పరువు అనే వెబ్ సిరీస్‌లో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. నరేష్ అగస్త్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ క్రైం థ్రిల్లర్ వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ పవన్ సాధనని షో రన్నర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ జీ5(ZEE5) డిజిటల్ ప్లాట్‌ఫాం వేదికగా స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ని కూడా ప్రకటించిది. ఈ వెబ్ సిరీస్ ని జూన్ 14న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు జీ5 అధికారిక ప్రకటన ఇచ్చింది.
View this post on Instagram
nivetha pethuraj heated argument with cops: ఈ నేపథ్యంలోనే ఇలా పోలీసులతో గొడవపడుతున్నట్టుగా.. పరువుకి సంబంధించింది అంటూ నివేతా తన వెబ్ సిరీస్‌ని ప్రమోట్ చేసింది. ఇప్పుడిదే వీడియో షేర్ చేస్తూ ZEE5 అసలు విషయం చెప్పింది. అంతేకాదు ఈ వెబ్ సిరీస్ జీ5లోకి అతిత్వరలోనే రానుందంటూ ప్రకటన కూడా ఇచ్చేసింది. కాగా ఈ పరువు వెబ్ సిరీస్ హానర్ కిల్లింగ్స్ బ్యాక్‌డ్రాప్‌లో సందేశాత్మక కథాంశంతో రూపొందుతోన్నట్లు సమాచారం. మొత్తం ఏడు ఎపిసోడ్స్‌తో క్రైం, థ్రిల్లింగ్ అంశాలతో ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందంటున్నారు. ఇందులో నివేతా పేతురాజ్ క్యారెక్టరైజేషన్ ఛాలెంజింగ్‌గా ఉండనుందట.
Also Read: బాలీవుడ్‌లో మరో బ్రేకప్ - ఐదేళ్ల బంధానికి ముగింపు పలికిన మలైకా, అర్జున్..!