Rana Naidu 2: 'రానా నాయుడు 2' నుంచి క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్ - స్పెషల్ వీడియోతో ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్!
Rana Naidu 2 Update: విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన వెబ్ సిరీస్ 'రానా నాయుడు'. దీనికి సీక్వెల్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా రానా నాయుడు 2 నుంచి క్రేజీ అప్‌డేట్ అచ్చింది నెట్‌ఫ్లిక్స్
Rana Naidu 2 Web Series Filming Now: దగ్గుబాటి హీరోలు విక్టరి వెంకటేష్, రానా దగ్గుబాటి నటించిన హిందీ వెబ్ సిరీస్ రానా నాయుడు. బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ తెలుగులోనూ డబ్ అయ్యింది. అయితే ఇందులో అసభ్యకర పదాలు, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో తెలుగు ఆడియన్స్ నుంచి విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా మన ఫ్యామిలీ హీరో వెంకటేష్ నుంచి అసభ్యకర వ్యాఖ్యలు వినడాన్ని మన ప్రేక్షకులు తీసుకోలేకపోయారు. దీంతో ఈ వెబ్ సరీస్ టాలీవుడ్ ఆడియన్స్ నుంచి నెగిటివిటీని అందుకుంది. అయినా కూడా విడుదలైన అన్ని భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ హిట్ అయ్యింది.
నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ఈ సిరీస్ మిలియన్ వ్యూస్ తెచ్చుకుని చరిత్ర సృష్టించింది. ఇక ఈ వెబ్ సీరిస్‌కు సీక్వెల్ కూడా ఉందని ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. అయితే తొలి సీజన్ వచ్చి సుమారు మూడేళ్లు అవుతుంది. ఇంకా 'రానా నాయుడు 2'కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ ప్రియులు అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా దీనిపై నెట్‌ఫ్లిక్స్ క్రేజీ అప్‌డేట్ వదిలింది. 'రానా నాయుడు 2' షూటింగ్ మొదలైందంటూ చిన్న వీడియో వదిలింది. అందులో వెంకటేష్-రానాల యాక్షన్ సీన్‌ను చూపించారు. దీంతో సీజన్ 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో సీజన్ 2 గురించి నెట్‌ఫ్లిక్స్ యాజమాన్యం ఓ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రానా నాయుడు వెబ్ సిరీస్ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు నుంచి విశేష ఆదరణ లభించిందని, దానిని దృష్టిలో పెట్టుకునే సీజన్ 2 ప్లాన్ చేశాన్నారు. ఈ సీక్వెల్ ఎన్నో ట్విస్ట్‌లు, యాక్షన్, ఫ్యామిలీ డ్రామాతో మరింత ఆసక్తిగా ఉంటుందని, ఇది ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. త్వరలోనే ఈ సీజన్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ అప్‌డేట్ ఇచ్చిన కొద్ది రోజులకే తాజాగా 'రానా నాయుడు 2'అప్‌డేట్ ఇవ్వడంపై ఆడియన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
View this post on Instagram
కాగా 'రానా నాయుడు' వెబ్ సిరీస్ అమెరికన్ టీవీ సిరీస్ 'రే డొనోవన్'కు రీమేక్‌గా రూపొందింది. దీనికోసం రానా, వెంకటేష్‌లు మొదటి సారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. యాక్షన్, క్రైం డ్రామాగా వచ్చిన ఈ సిరీస్‌లో వీరిద్దరూ తండ్రీ కొడుకులుగా కనిపించి ఫ్యాన్స్‌ని అలరించారు. ఓటీటీలో మంచి విజయం సాధించిన ఈ వెబ్ సిరీస్‌లో రానా నటనకు గానూ ఇటీవల 'ఇండియన్ టెలీ అవార్డు 2024'లో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్న విషయం తెలిసిందే. యాక్షన్ అండ్ క్రైమ్ డ్రామాగా తెరకెక్కిన 'రానా నాయుడు'లో రానా భార్య పాత్రలో సుర్వీన్ చావ్లా నటించింది. గౌరవ్ చోప్రా, సుచిత్రా పిళ్ళై తదితరులు ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.
Also Read: ఈ వారం థియేటర్ - ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే!